మంచి మాట

భగవంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కారణాకారుడు భగవంతుడు. భగవంతుని సృష్టిలోని అత్యుత్తమ పథంలో ఉన్నవారు మానవులు. వీరికి విచక్షణా జ్ఞానాలనిచ్చిన భగవం తుడు అరిష్డవర్గాలను ఇచ్చాడు. బలహీనమైన, అతి చంచలమైన మనస్సును కూడా ఇచ్చాడు. జంతువులు ప్రకృతి ధర్మంగా ప్రవర్తిస్తాయ. వాటికి ఆలోచన ఉండదు.
కాని మనుష్యులకు వాక్ సౌందర్యంతో పాటుగా ఆలోచనా స్రవంతిని కూడా భగవంతుడు ఇచ్చాడు. ఈ ఆలోచనల పరంపరలో చాలామంది కొట్టుకుపోతుంటారు. ఆలోచనను క్షణమైన వీడకుండా ఉండేవాడే మనిషి అన్న స్థాయకి చేరుకొన్నాడు. కాని ఎవరైతే ఈ ఆలోచనలను నియంత్రించి చంచలమైన మనస్సును పట్టుకుని స్థిరం చేసుకొంటూ ఏకాగ్రతను సాధిస్తారో వారికి సృష్టి రహస్యం ఏమిటో తెలుస్తుంది. అటువంటి వారు భగవంతుడిని వ్యక్తరూపంలో కూడా చూసే నేర్పును పొందుతారు.
కాని మనుష్యులందరూ గుణాలకు దాసులైనవారే. కామం,కోధ్రం, అహంకారం, అసూయ ఇలాంటివాటికి సులభంగా మనిషి దాసు డవుతాడు. తనకు లేనిది ఇతరులకు ఉన్నది అంటే సహించలేని స్థితిని కూడా పొందుతాడు. తాను ఒక్కడే అందరికన్నా అధికంగా ఉండాలన్న కాంక్షతో ఉంటుంటాడు. ఇది చాలామంది విషయంలోనే సమానమే. కాని మనుష్యుల్లో కూడా మహితాత్ములు ఉంటారు. వారు నిర్గ్ణులుగా ఉంటారు. వారు భగవంతునికి మారురూపులుగా ఉంటారు.
భగవంతుడు సర్వవ్యాపి అని, భగవంతుడు కాని అంశమేథీ లేదనుకొనవారికి సర్వమూ భగవంతుని రూపంలోనే కనిపిస్తుంది. అన్నిప్రాణులూ భగవంతుని రూపాలుగా కనిపిస్తాయ. అట్టాంటి మనుష్యులు ఇతరులకన్నా అధికులమనో, లేక వారికేదో ఉన్నది తమకు లేదనో బాధను పొందరు. ఇట్లాంటి వారే గుణాలను దూరంగా పెట్టగలిగి ఉంటారు. వారిలో సమత్వబుద్ధి ఏర్పడి ఉంటుంది. ఈసు నసూయలు వారి దరిచేరవు. వీరు మనుష్యుల్లో మనీషులుగా వ్యవహ రించబడుతారు. వీరికిగుణాతీతుడైన భగవంతుడు గా అధీనుడుగా ఉంటాడు.
నిర్గుణురూపమైన భగవంతుని గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా గుణాలను అదుపులో పెట్టుకోవాలి. క్షణభంగురమైన జీవితంలో దేనికి ప్రాముఖ్యం ఇవ్వాలో తెలుసుకోవాలి. నశ్వరమైన జగత్తు అధికారియైన అనశ్వరమైన భగవంతుడిని చూడాలి. ఆ పరా త్పరుని చూడాలంటే అహంకారాది గుణాలను దూరం చేసుకోవాలి. సర్వం భగవంతుని రూపమే అని నమ్మాలి. మురికికూపంలో చిక్కుకున్న వారికి గంధం యొక్క సుగంధం తెలయనట్లే గుణాలకు దాసులైనవారికి జగత్తు, జగన్నాథుడు వేర్వేరుగా కనిపిస్తారు. అపుడు ప్రాణులు వేరు అయనట్టు ప్రాణుల్లోని చైతన్యం వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది.
భగవంతుని పోల్చే శక్తి నశిస్తుంది. కనుకనే మొట్టమొదట గుణాలను అదుపులో పెట్టుకోవాలి. ఏవిషయంపైనా కూడా వ్యామోహ పడకూడదు. ప్రాపంచిక సుఖాలనే సత్యమని, ఇవే నిత్యమని శాశ్వతమనీ భ్రమించకూడదు. కాని ఇది అంత సులభసాధ్యం అందరికీ కాదు. బలహీన మనస్కులు కష్టం రాగానే ఎంతో వ్యాకుల పడిపోతారు. ఇపుడు ఏవౌతుందో అనుకొనేసమయంలో అన్యాయం అక్రమం చేసేవారు ఎదురై వారిని అపమార్గంలోకి సులభంగామళ్లించే ప్రయత్నం చేస్తారు. వీరి నుంచి తప్పించుకోవాలంటే భక్తిమార్గమే సులభో పాయం. భక్తిసామ్రాజ్యంలోకి అడుగిడిన వారికి భగవంతుడు తప్ప అన్యం తెలీదు. ఈ భక్తిమార్గంలో నడిచేవారిలో సమత్వబుద్ధి దానికదే కూడు కుంటుంది. సర్వప్రాణిలోను వారికి భగవంతుని అంశ కని పిస్తుంది. అందరినీ సమానంగా చూచే బుద్ధి వస్తుంది. తాము నిమిత్తమాత్రులమని, తన చేత భగవంతుడే ఈ పనులను చేయ స్తున్నాడని వారు నమ్ముతారు. దీనివల్ల అహంకారం ఏర్పడదు. కోరికలుండవు. భగవంతుడు ఇచ్చిన దానిని మాత్రమే తీసుకోవాలన్న దృక్పథంఉన్న వారిలో కామక్రోధాధులు దరిచేరవు. దానివల్ల సన్మార్గాన్ని వీడవలసిన అవసరం వారికి రాదు. వారే భగవంతుని రూపులుగా మారుతారు.

- రాంప్రసాద్