ఆటాపోటీ

కోహ్లీ వాదన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోర్నీలు లేదా సిరీస్‌లు ఏవైనా, ఒక జట్టులో కెప్టెన్‌దే కీలక పాత్ర అవుతుందని, సమయానుకూలంగా అతను తీసుకునే నిర్ణయాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయని కోహ్లీ వాదన. జట్టు జయాపజయాలకు కెప్టెన్‌నే బాధ్యుడ్ని చేస్తారని, అందుకే, నాయకుడికి తగినంత వెసులుబాటు ఇవ్వాలని అంటాడు. ఎన్ని వ్యూహాలు, ప్రణాళికలను సిద్ధం చేసుకున్నప్పటికీ, మైదానంలోకి దిగిన తర్వాత, పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత కెప్టెన్‌పైనే ఉంటుందని పలుమార్లు స్పష్టం చేశాడు. క్రికెట్ బోర్డు అధికారులు, క్రికెటర్లకు మధ్య పారితోషికాల నుంచి క్రమశిక్షణ వరకూ అనేకానేక అంశాల్లో విభేదాలు కొనసాగుతున్నాయన్నది వాస్తవం. అయితే, వాటిని చర్చించుకోకుండా, సామరస్యంగా పరిష్కరించుకోకుండా తెగే వరకూ లాగడమే అసలు సమస్య. ఈ విషయంలో కుంబ్లే పొరపాటు ఎంత ఉందో, కోహ్లీ పాత్ర కూడా అంతే ఉంది. మాజీ కోచ్‌పై వాడిన అస్త్రానే్న మరోసారి రవి శాస్ర్తీపై సంధిస్తే నవ్వులపాలు కావడం ఖాయం.