ఆటాపోటీ

వైరుధ్యాలు సహజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోచ్, క్రికెటర్ల సంబంధాల్లో కొన్ని వైరుధ్యాలు తప్పవు. అనిల్ కుంబ్లే, కోహ్లీ విషయంలో ఇది రుజవైంది. ఇద్దరూ పరస్పరం విభేదించుకుంటున్నారన్న వార్త చాలాకాలంగా అభిమానులను వేధిస్తునే ఉంది. కుంబ్లే, కోహ్లీ మధ్య యుద్ధ వాతావరణం నెలకొందని, చాంపియన్స్ ట్రోఫీకి బయలుదేరే ముందే, ఆరు నెలలుగా వీళ్లిద్దరి మధ్య మాటల్లేవని వచ్చిన వార్తలు సహజంగానే భారత క్రికెట్ అభిమానులను ఆందోళనకు గురి చేశాయి. నిజం చెప్పాలంటే, అలాంటి వార్తల్లో నిజం ఉన్నప్పటికీ, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. క్రికెటర్లకు సహాయక సిబ్బందికి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడం చాలా సహజం. ఈ పరిస్థితి కేవలం టీమిండియాకే పరిమితం కాదు.. ఎక్కడైనా ఉంటుంది. అయితే, సమస్యపై వీధికెక్కి పరువు తీసుకునే బదులు నాలుగు గోడల మధ్య కూర్చొని, చర్చల ద్వారా పరిష్కరించుకుంటే బాగుంటుంది. వ్యక్తిగతంగా కుంబ్లే మంచివాడు. కానీ, క్రమశిక్షణ విషయంలో రాజీ పడడు. ప్రాక్టీస్ నుంచి మొదలుపెడితే, మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డి పోరాడడం వరకూ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. విశే్లషిస్తాడు. తప్పు చేసిన వారు ఎంతటివారైనా నిలదీస్తాడు. భవిష్యత్తులో వాటిని పునరావృతం చేయవద్దని హెచ్చరిస్తాడు. అతనిలోని ఈ లక్షణాలే కోహ్లీ అండ్ కంపెనీకి నచ్చలేదు. కుంబ్లే మందలింపులను తల్లిండ్రులు తమతమ పిల్లల పట్ల చూపే ఆపేక్షపూరిత వ్యాఖ్యలుగా కోహ్లీ, అతని సహచరులు అనుకొని ఉంటే బాగుండేది. కానీ, ఇక్కడ కోహ్లీ అహం దెబ్బతిన్నది. జట్టుపై తనకు తప్ప మరెవరికీ పట్టు ఉండేందుకు ఇష్టపడని అతను కుంబ్లేపై కత్తి కట్టాడు. అతనిని సాగనంపి, తనకు ఇష్టమైన రవి శాస్ర్తీ కోచ్‌గా ఎంపికయ్యేందుకు అన్ని రకాలైన వ్యూహాలను అనుసరించాడు. అనుకున్నది సాధించాడు. అయితే, రవి శాస్ర్తీతో అతని హనీమూన్ ఎంతకాలం కొనసాగుతుందనేది చూడాలి. 2019 వరల్డ్ కప్ వరకూ కోహ్లీతో ఎలాంటి సమస్యలు రావని రవి శాస్ర్తీ అనుకున్నా, అతనిని నామమాత్రపు స్థానానికి నెట్టేసి తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని కెప్టెన్ భావించినా టీమిండియాలో కలతలు, అలకలు, ఒకరిపై మరొకరి ఆధిపత్య పోరాటాలు తప్పవు.