ఆటాపోటీ

ఏకాభిప్రాయం ఎక్కడ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా రవి శాస్ర్తీ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదా? ఎవరికివారు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారా? బిసిసిఐకి సుప్రీం కోర్టు నియమించిన పాలనాధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకోవడం వల్లే, గత్యంతరం లేని పరిస్థితుల్లో కోచ్ పేరును హడావుడిగా వెల్లడించారా? ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్, శ్యామ్ బెనగల్, మన్మోహన్ దేశాయ్, చార్లీ చాప్లిన్ ఒక్క చోట చేరి, తీసిన సినిమా మాదిరి ఈ ఎంపిక అనేకానేక మలుపులు తిరిగింది. క్షణక్షణం ఉత్కంఠ రేపింది. కొత్త కోచ్ ఎంపికపై సిఎసి సభ్యులు విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి, ఒక ప్రకటనను విడుదల చేస్తారన్న వాదన బలంగా వినిపించింది. కానీ, ఇది జరగలేదు. మొత్తం మీద టీమిండియా కొత్త కోచ్ ఎంపిక తీరును పునశ్చరణ చేసుకుంటే, ఈ ప్రశ్నలన్నింటికీ అవునని సమాధానం చెప్పక తప్పదు. కోచ్ ఎంపికను సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ పర్యవేక్షణలోని క్రికెట్ సలహా మండలి (సిఎసి)కి అప్పగిస్తున్నట్టు బిసిసిఐ అంతకు ముందే ప్రకటించింది. దీనితో అందరి దృష్టి సిఎసిపై నిలిచింది. కాగా, దరఖాస్తులు చేసుకోవడానికి ఈనెల 9వ తేదీని గడువుగా పెట్టిన సిఎసి పదో తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించింది. అనంతరం గంగూలీ విలేఖరులతో మాట్లాడుతూ కోచ్ ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేశామని, అయితే, నిర్ణయాన్ని వెల్లడించబోమని తేల్చిచెప్పాడు. అయితే, అప్పటికే రవి శాస్ర్తీ ఎంపిక జరిగిపోయిందని, బిసిసిఐ ప్రకటన లాంఛనమని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సమయంలోనే బిసిసిఐ పాలనా వ్యవహారాలను చూడడంతోపాటు, లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయించడానికి సుప్రీం కోర్టు నియమించిన అధికారుల బృందం (సిఒఎ) జోక్యం చేసుకుంది కోచ్ పేరును వెంటనే ప్రకటించాలని బిసిసిఐని ఆదేశించింది. దీనితో కంగుతిన్న బోర్డు హడావుడిగా ఒక ప్రకటన చేసింది. రవి శాస్ర్తీని సిఎసి కోచ్‌గా ఎంపిక చేసిందని తెలిపింది. ముంబయిలోని బిసిసిఐ కేంద్ర కార్యాలయంలో ఇంటర్వ్యూలను పూర్తి చేసిన గంగూలీ ఆ వెంటనే కోల్‌కతాకు వెళ్లి, అక్కడ కూడా తాను అంతకు ముందు చేసిన ప్రకటననే పునరుద్ఘాటించాడు. ఒకటి రెండు రోజుల్లో వివరాలు తెలుస్తాయని తెలిపాడు. రవి శాస్ర్తీ పేరును బిసిసిఐ ప్రకటించిందన్న విషయం తెలిసిన తర్వాత నాలిక కరచుకున్నాడు.
ఎవరి కోసం నిరీక్షణ!
కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలను ముగించి, రవి శాస్ర్తీ పేరును ఖాయం చేసినప్పటికీ, ఈ ప్రకటన చేయడానికి సిఎసి ఎందుకు సంశయించింది? ఎవరి అభిప్రాయాలను తీసుకోవడానికి నిరీక్షించాలని తీర్మానించింది. సిఒఎ జోక్యం చేసుకోకపోతే, కోచ్ పేరును వెల్లడించడానికి ఇంకెంత సమయం తీసుకునేది? ఇవి సహజంగా ప్రతి ఒక్కరినీ వేధించిన ప్రశ్న. ఎవరు, ఎన్ని కారణాలు చెప్పినా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయం తెలుసుకోవడానికే గంగూలీ ప్రకటన చేయలేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది. నిజానికి రవి శాస్ర్తీ పేరును గంగూలీ తీవ్రంగా వ్యతిరేకించాడని బిసిసిఐ వర్గాలు ఇప్పటికే అంటున్నాయి. అయితే, రవి శాస్ర్తీ ముంబయికి చెందిన వాడు కావడంతో, మరో మరాఠీ యోధుడు సచిన్ తెండూల్కర్ అతనినే నియమించాలని పట్టుబట్టాడని సమాచారం. సచిన్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతులు, బిసిసిఐలో అతనికి ఉన్న పట్టును గమనించిన గంగూలీ సాధ్యమైనంత వరకూ నిర్ణయాన్ని వాయిదా వేసి, ఆతర్వాత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఒక అస్త్రంగా వాడుకోవాలన్న ఆలోచనలో ఉన్నాడని బోర్డుతో సన్నిహిత సంబంధాలు ఉన్నవారు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కోహ్లీ అమెరికాలో సెలవులు గడుపుతున్నాడు. అతను స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం, కోచ్ పేరును ప్రకటించాలన్నది గంగూలీ వ్యూహం కావచ్చు. కోహ్లీ కోసమే అతను నిరీక్షించాడని, కానీ, సిఒఎ జోక్యంతో అతని ఆలోచన ఫలించలేదని అంటున్నారు. ఇంటర్వ్యూ జరిగే సమయంలో సిఎసి సభ్యులు కోహ్లీని కనీసం వీడియో కాల్ ద్వారా మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాహుల్ జోహ్రీ ఇంగ్లాండ్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరుగుతున్నప్పుడు కోహ్లీని, జట్టులోని మిగతా సభ్యులను సంప్రదించాడు. వారి అభిప్రాయాలు తీసుకున్నాడు. వివరాలను సిఎసి, బిసిసిఐ ముందు ఉంచాడు. ఈ చర్చల అనంతరమే భారత జట్టు వెస్టిండీస్ టూర్‌కు వెళ్లింది. ఆ పర్యటన పూర్తయన తర్వాత కోహ్లీ అమెరికాలో షికారుకు వెళ్లాడు. రవి శాస్ర్తీ హఠాత్తుగా రంగ ప్రవేశం చేయడంతో, గంగూలీకి దిక్కుతోచలేదు. అందుకే, కోహ్లీని అడ్డం పెట్టుకొని, రవి శాస్ర్తీ కోచ్‌గా ఎంపిక కాకుండా అడ్డుకోవాలని ప్రయత్నించాడు. కానీ, అతని వ్యూహం ఫలించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో కోచ్ నియామకంపై సానుకూలంగా స్పందించాడు. అయిష్టంగానే రాజీ పడ్డాడు.
అనుభవజ్ఞుడు
రవి శాస్ర్తీ అనుభవజ్ఞుడు. క్రికెటర్‌గా అతను 80 టెస్టులు ఆడి, 3,830 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 11 సెంచరీలు, 12 అర్ధ శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 206 పరుగులు. అదేవిధంగా, 15,751 బంతులు వేసి, 6,185 పరుగులిచ్చి, 151 వికెట్లు పడగొట్టాడు. 75 పరుగులకు ఐదు వికెట్లు అతని అత్యుత్తమ బౌలింగ్ విశే్లషణ. 150 వనే్డ ఇంటర్నేషనల్స్‌లో 3,108 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లోనే అతను నాలుగు సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు చేశాడు.