ఆటాపోటీ

సర్దుకుపోదాం రండి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ ప్రపంచంలో రవి శంకర్ అంటే ఎవరికీ తెలియకపోవచ్చు.
జయధ్రద్ శాస్ర్తీ అని చెప్పినా అర్థం కాకపోవచ్చు.
కానీ రవి శాస్ర్తీ అంటే మాజీ ఆల్‌రౌండర్, స్టార్ కామెంటేటర్, టీమిండియా మాజీ డైరెక్టర్ అని క్షణాల్లో చెప్పేస్తారు. ఇది అందరికీ తెలిసిన పేరు. ఒకప్పుడు భారత క్రికెట్‌కు పర్యాయపదంగా మారిన పేరు. కోచ్ పదవికి రవి శాస్ర్తీ రంగంలోకి దిగిన వెంటనే, అతని ఎంక ఖాయమని స్పష్టమైంది. కోచ్‌గా ఎంతవరకూ రాణిస్తాడో చెప్పలేంగానీ, అందరితోనూ సర్దుకుపోయే గుణం ఉంది కాబట్టి, డ్రెస్సింగ్ రూమ్ ఘర్షణలు ఉండవు. లౌక్యం తెలిసిన వాడు గనుక అటు బిసిసిఐకి, ఇటు క్రికెటర్లకు మధ్యవర్తిగా వ్యవహరించి, ఎలాంటి సంక్లిష్టమైన పరిస్థితినైనా చక్కబెట్టగలడు. డంకన్ ఫ్లెచర్ చీఫ్ కోచ్‌గా ఉన్నప్పుడు బిసిసిఐ అధికారులు ఏరికోరి డైరెక్టర్ పదవిని సృష్టించి మరీ రవి శాస్ర్తీకి కట్టబెట్టారంటేనే అతను ఏ స్థాయిలో లాబీయింగ్ చేస్తాడో అర్థమవుతుంది. పైగా భారత క్రికెట్‌పై ముంబయిది తిరుగులేని ఆధిపత్యం. అక్కడి వాడు కాబట్టే రవి శాస్ర్తీ సులభంగానే చక్రం తిప్పగలుగుతున్నాడు. నిజం చెప్పాలంటే, మంచిగానీ, చెడుగానీ, పర్యవసనాలు ఏవైనాగానీ.. చరిత్రలో ప్రతి ఏడాదికీ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అనిల్ కుంబ్లే కోచ్‌గా ఉన్న ఏడాదికాలం కూడా అలాంటిదే. ఆ ఏడాది టీమిండియా ఎన్ని ఉన్నత శిఖరాలకు ఎదిగిందో, అదే స్థాయిలో వివాదాలకు నెలవుగా మారింది. కెప్టెన్ ఆధిపత్య ధోరణి, ఆటగాళ్ల ఇష్టారాజ్యం, కోచ్ పదవి నామమాత్రమేనన్న విషయం మన కళ్ల ముందు ఆవిష్కృతమైంది. జట్టులో ఘర్షణలు ఎందుకు తలెత్తుతాయో తెలిసింది. ఒకరిపై ఒకరు ఎందుకు కత్తులు దూసుకుంటారో స్పష్టమైంది. టోర్నీలు, సిరీస్‌ల్లో జయాపజయాల విషయం ఎలావున్నా, జట్టు మొత్తం ఒకే తాటిపై నడిస్తేనే భవిష్యత్తు బాగుంటుంది. నిలకడ లేకపోవడం, ఆటగాళ్లు, కోచ్, బోర్డు అధికారులు ఎవరికివారే అన్నచందంగా వ్యవహరించడం ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందో వెస్టిండీస్, ఆస్ట్రేలియా పరిస్థితిని చూస్తే స్పష్టమవుతుంది. ఇప్పటికే భారత జట్టు క్రమంగా సంక్షోభంలో పడిపోతున్నది. జట్టులో క్రమ శిక్షణ కొనసాగుతున్న లక్షణాలు కనిపించడం లేదు. ఒకరితో ఒకరికి సయోధ్య లేదు. క్రికెట్ ప్రపంచానికి ఐక్యత, స్వేచ్ఛను పరిచయం చేసిన భారత క్రికెట్ ఇప్పుడు అవే సమస్యలతో అల్లాడుతున్నది. సమున్నత లక్షాలతో మాజీ క్రికెటర్లు, అధికారులు వేసిన సామరస్య బాటను ఇప్పుడు ఎవరూ అనుసరించడం లేదు. అంతర్గత ప్రజాసామ్యం మరీ ఎక్కువ కాడవంతో, ఆటగాళ్లది ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా మారింది. ఈ పరిస్థితుల్లో జట్టును పటిష్టపరచడానికి, అందరినీ ఒకేతాటిపై నడిపించడానికి అందరికీ ఆమోదయోగ్యుడైన అభ్యర్థి అవసరం. సచిన్ తెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ సభ్యులుగా ఉన్న క్రికెట్ సలహా మండలి (సిఎసి) ఏకగ్రీవంగా రవి శాస్ర్తీ పేరును ఖరారు చేయలేదన్నది వాస్తవం. కానీ, కుంబ్లే కోచ్‌గా ఉన్న కాలంలో తలెత్తిన వివాదాలను పరిష్కరించే సత్తా రవి శాస్ర్తీకి మాత్రమే ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో అతనిని కాదంటే సమస్యలు తీవ్రమవుతాయని ఒక నిర్ణయానికి వచ్చింది. గంగూలీ వ్యతిరేకించినప్పటికీ, సచిన్ మద్దతు ఉండడంతో కోచ్‌గా రవి శాస్ర్తీ ఎంపిక సులభమైంది. అతను ఎంత వరకూ తన కర్తవ్యాన్ని సమర్థంగా పూర్తి చేస్తాడో చూడాలి.
అంచనాలు వేరు.. వాస్తవాలు వేరు
ఎక్కడైనా, ఎప్పుడైనా కాగితంపై రాసుకొని అంచనాలు వేయడం వేరు. వాస్తవ ఫలితాలు వేరు. ఈ సిద్ధాంతం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగింది. అనుకున్నట్టుగానే గ్రూప్ దశలో ఆధిపత్యాన్ని కనబరచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. విశే్లషకులు ఊహించిన విధంగానే ఫైనల్ చేరింది. ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకున్నప్పటికీ, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ తదితర జట్లను వెనక్కునెట్టిన పాకిస్తాన్ ఫైనల్ చేరి సంచలనం సృష్టించింది. ఇక ఫైనల్‌లోనూ గ్రూప్ దశలో ఫలితమే వెల్లడవుతుందనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రతి ఒక్కరూ విరాట్ కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా టైటిల్ దక్కించుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాగితాలపై ఇరు జట్లను పోలుస్తూ, భారత్‌కు పాక్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేదన్న నిర్ణయానికి వచ్చారు. కానీ, ఫైనల్ ఫలితం ఏమైందో మనందరికీ తెలుసు. ఫేవరిట్ కోహ్లీ సేన మట్టికరచింది. కొత్త కెప్టెన్ సర్ఫ్‌రాజ్ అహ్మద్ నాయకత్వంలోని పాకిస్తాన్ ఆ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని ఎగరేసుకుపోయింది. అంచనాలకూ, వాస్తవాలకూ ఉన్న తేడా ఇది. టీమిండియా కోచ్ విషయంలోనూ ఈ సిద్ధాంతాన్ని వర్తింప చేయవచ్చు. కోచ్ అనిల్ కుంబ్లేను సాగనంపే వరకూ నిద్రపోని కోహ్లీ తన పంతాన్ని నెరవేర్చుకున్నాడు. మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీని కోచ్‌గా కావాలని డిమాండ్ చేసి మరీ అనుకున్నది సాధించాడు. అయితే, అంతమాత్రం చేత టీమిండియాలో సమస్యలన్నీ తుడిచిపెట్టుకుపోతాయనుకోవడం అత్యాశే. కోహ్లీ కోరిన కోచ్ లభించాడు. ఆటగాళ్లకు వ్యతిరేకంగా రవి శాస్ర్తీ ఎన్నడూ నిర్ణయాలు తీసుకోడు. వారిని బెదిరించడం లేదా పరుషంగా మాట్లాడడం చేయడు. అవసరమైతే బిసిసిఐ అధికారుల వద్ద ప్రాపకం ఉండనే ఉంది. కోహ్లీతో మంచిగానే ఉంటాడు... క్రికెటర్లు తమ భార్యలను లేదా గర్ల్‌ఫ్రెండ్స్‌ను టూర్లకు తీసుకొచ్చినా ఇదేమని అడగడు. ఆస్ట్రేలియాతో, సిడ్నీలో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన వెంటనే విఐపి బాక్స్‌లో కూర్చున్న తన ప్రేయసి అనుష్క శర్మను చూస్తూ ఫ్లయింగ్ కిసెస్ ఇవ్వడం అప్పట్లో వివాదం సృష్టించింది. అప్పుడు టీమిండియాకు డైరెక్టర్‌గా రవి శాస్ర్తీ ఉన్నాడు. సిరీస్ లేదా టోర్నీలు జరిగే సమయాల్లో ఏ ఆటగాడి వెంటా అతని భార్య లేదా గర్ల్‌ఫ్రెండ్ ఉండరాదన్న నిబంధన కొన్ని దశాబ్దాలుగా ఉంది. కానీ, కోహ్లీకి అవేవీ పట్టలేదు. ఆస్ట్రేలియాలో అనుష్కతో చట్టపట్టాలేసుకొని తిరిగాడు. వీరిద్దరూ జంటగా అందరికీ దర్శనమిచ్చారు. దేశంలో మీడియా నిప్పులు చెరిగినా, పలువురు మాజీ క్రికెటర్లు ఇదేమిటంటూ నిలదీసినా రవి శాస్ర్తీ స్పందించలేదు. కోహ్లీపై చర్య తీసుకోలేదు. అందుకే, అతని పట్ల కోహ్లీ మొగ్గు చూపాడు. మిగతా ఆటగాళ్లంతా తమతమ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అతనికే వంతపాడారు. మొత్తానికి ప్రస్తుత పరిస్థితుల్లో, కోచ్.. కెప్టెన్.. క్రికెటర్ల మధ్య అద్భుతమైన సంయమనం ఉందని, ఇకపై ఎలాంటి సమస్యలు తలెత్తవనీ ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. కానీ, కొత్త కోచ్‌తో టీమిండియా కొంత దూరం ప్రయాణిస్తేగానీ అసలు సమస్యలు బయటపడవు. అంచనాలన్నీ వాస్తవ రూపం దాలిస్తే, భారత క్రికెట్‌కు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. కానీ, తేడా వస్తేనే పరిస్థితి ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారుతుంది.
క్రికెటర్‌గా, కామెంటేటర్‌గా, ప్రెజెంటర్‌గా, ఒక జట్టుకు డైరెక్టర్‌గా విభిన్న పాత్రలు పోషించిన రవి శాస్ర్తీకి కోచ్ పదవి కొత్తేమీ కాదు. నేరుగా అతను కోచ్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించకపోయినా, డంకన్ ఫ్లెచర్‌ను కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత, అతను ఆ పదవికి అనర్హుడన్న అభిప్రాయం భారత క్రికెట్ బోర్డు అధికారులకు స్పష్టమైంది. పైగా, అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్లెచర్‌కీ సరిపడకపోవడం కూడా అధికారులను ఇబ్బందిపెట్టింది. అందుకే, కాంట్రాక్టు పూర్తయ్యేవరకూ ఫ్లెచర్‌ను నామమాత్రపు కోచ్‌గా కొనసాగించి, డైరెక్టర్ అనే పదవిని సృష్టించి, రవి శాస్ర్తీకి అప్పగించారు. పేరుకు డైరెక్టరేగానీ, అతను కోచ్‌గా బాధ్యతలనే నిర్వర్తించాడు. అప్పట్లో అతను పరోక్షంగా టీమిండియాకు కోచ్. ఇప్పుడు ప్రత్యక్షంగా కోచ్. అంతే తేడా. అతనికి బోర్డులో మంచి పలుకుబడి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులున్నాయి. ఆటగాళ్లకు అనుగుణంగా, ఎప్పటికప్పుడు నిర్ణయాలను మార్చుకునేతత్వం ఉంది. పట్టుదలకు పోడు. తన మాటే నెగ్గాలన్న పంతం లేదు. కెప్టెన్‌తో, ఆటగాళ్లతో సర్దుకుపోతాడు. అతని మార్గదర్శకంలో టీమిండియా ప్రస్తుత సమస్యల నుంచి గట్టెక్కుతుందా లేక మరింతగా సమస్యల ఊబిలో కూరుకుపోతుందో చూడాలి. అందరికీ ఆమోదయోగ్యుడు కాబట్టి, సానుకూల ఫలితాలే వస్తాయని ఆశిద్దాం.
చిత్రం.. గర్‌ల్రఫెండ్, బాలీవుడ్ నటి అనుష్క శర్మకు ఫ్లయంగ్ కిస్ ఇస్తున్న భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. రవి శాస్ర్తి కోచ్‌గా ఉన్నంత కాలం ఇలాంటి సంఘటనలను చూసే అవకాశం అభిమానులకు దక్కుతుంది.

- విశ్వ