రాజమండ్రి

‘మద్దా’వారి మాట సుద్దుల మూట (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగరికం బాగా పెరిగిపోయి మనుషులు

ఫ్యాషన్లకు పోతున్నారు. లోకం మారిపోయింది,

కాబట్టి మనమూ మారిపోవాలని వార్ని వీర్ని

అనుకరిస్తున్నారు. ఇరవయ్యేళ్ల క్రితం నుంచే

నిత్య జీవిత మార్పులు వేగవంతంగా

పెరిగిపోయాయి. కూలీ నాలి చేసుకుని పొట్ట

నింపుకునే జనాలు ఉదయమే పనికిపోయే

క్రమంలో తినగా రాత్రి మిగిలిన అన్నాన్ని గంజి

కలుపుకొని బ్రేక్‌పాస్ట్‌గా తాగేవారు. అదే చద్దన్నం.

క్యారేజీలు లేని రోజుల్లో మూట కట్టుకుపోయే

వారు. అల్పాహారంగా టిఫిన్లు తింటున్న ఈనాటి

తరానికి చద్దిమూట విలువ తెలీదు. కుక్కర్లో

వండుకొని తిని మిగిలింది పారబోసుకుంటున్న

దుబారా మనుషులకు ఆ పొదుపే కాదు ఆ

బలమూ తెలీదు. పెద్దల మాట చద్దన్నం మూట

అనే నానుడికి గొప్ప బలమైన కారణం ‘పెద్దలన్న

మాట చద్దిమూట’ మకుటంతో మద్దా

సత్యనారాయణ గారు తన అనుభవ సారాన్ని

‘పుస్తక శీర్షిక’ టైటిల్‌గా మార్చుకొని రాసిన శతక

కావ్యం పెద్దలన్న మాట చద్దిమూట.
పల్లెటూరులో ఏ మూలకు పోయినా ఓ వేమన

పద్యమో, సుమతీ పద్యమో గ్రామీణుల నోట

నాట్యమాడుతుంది. ఆ పద్యాల్లోని నీతి సారం

నరనరాల్లోకి అలా జీర్ణించుకుపోయింది. మాత్ర

గణ పద్ధతుల్లో పద్యం రాసి పండిత ప్రశంసలు

పొందటానికే అనే అపవాదును తుడిచేసి సులభ

గ్రాహ్యం చేశారు మద్దా వారు. మకుటాన్ని బట్టే

పద్య సారాన్ని ఇట్టే పట్టేయవచ్చు. కావ్య

అవసరతను గురించి చెబుతూ ప్రారంభ పద్యాల్లో

ఏమి చెప్పారో చూడండి. ‘వేమనన్న పలుకు వేద

కావ్యంబది/ సుమతి సూక్తులెల్ల సూనృతములు

/ నార్ల వారి మాట నవయుగమ్ముల బాట’ అని

ప్రజాకవి వేమన గురించి, సుమతీ శతక కారుడి

గురించి నిన్న మొన్నటి ఆధునికుడు నార్ల

వెంకటేశ్వరరావులు ప్రబోధించిన మాటలు

నవయుగ బాటలని చెప్తున్నారు. నాలుగు

అక్షరం ముక్కలు నేర్పించి పుణ్యం కట్టుకొండని

వేడుకొనే తల్లిదండ్రుల్ని చూచాను, ఆ భావన

ఏమాత్రం వంకర పోయినా అసలు మూలం ఎంత

దెబ్బతింటుందో ఈ పద్యాన్ని చూస్తే తెలుస్తుంది.

‘బద్ధకస్తుడొకడు బడి పంతులైనచో బాల

బాలికలకు భవిత చెడును / ఎరువు లేని మొక్క

పెరుగునే పుష్టిగా’ అర్ధ వివరణలు, తాత్పర్యాలు

అక్కర్లేదు కదా! ఎంత బాగా చెప్పేరు. మనం

అర్ధాలు వెతుక్కోనక్కర లేకుండా, ఒకసారి

చదివినంతనే చక్కగా అర్థమయితే పద్య ప్రక్రియ

అయితే మాత్రం పక్కన పెట్టకుండ పఠిస్తారు

ప్రతివొక్కరు. రాజకీయ నాయకుల గురించి పచ్చి

నిజాన్ని ఎలా చెప్పారో చూడండి ‘ఓట్ల

నడిగినప్పుడోటర్లే దేవుళ్లు / పదవి గొన్న పిదప

పాలివాళ్లు / గద్దె నెక్కినంత కళ్లు మూతలు పడు’

చాలా ఏళ్లుగా చూస్తున్న చోద్యం కదూ! ఇవన్నీ

కవికి ఎదురైన అనుభవాలు, చవి చూసిన

సంగతులు. అందుకే ఆయన అంతగా ఘాటుగా

స్పందించారు. పేదవాని కోపం పెదవికి చేటని ఓ

నానుడి. అయితే మంచి మనసున్న వాని మాట

పెద్ద దీవెన అంటారు. ‘పేదవారి మాట పెద్ద దీవెన

సుమ్ము / దేవతలు తథాస్తు దీవెనలిడు / మంచి

వారి మాట మరువకుండ వినుడు’ నీతిని

ఉపదేశించటానికీ ఓ దమ్ముండాలి అదే ఈ గొప్ప

విషయం. కుల రాజకీయాల్లో ఎవరెంత మందో

లెక్కించి ఆ లెఖ్ఖన గద్దెనెక్కి కోట్ల కక్కుర్తికి సీటు

ఫిరాయించే నేతలకు ఈ పద్యం చెంప

పెట్టుకాగలదు. రాజకీయ ఫీట్లు చేసే

ఫిరాయింపుదారులందరికి ఇది వర్తిస్తుంది.
ఢిల్లీ గద్దెపై ‘కేజ్రీవాల యొకడు కీలక వ్యక్తియై /

మహిని రాజకీయ మలుపుదిప్పె / కులము

లోని చాలు గుణవంతుడొకడున్న’ సత్యాన్ని

బాగా ఎరుకపరిచారు. జ్ఞానమనేది ఎవరి

సొత్తుకాదు. వారసత్వంగా వచ్చే జబ్బు గాదు

మరి. దానే్న బహు సాత్వికంగా చెప్తున్నారు.

‘జ్ఞాన దివ్వెను మది సాకారమొనరించి /

సాగవలెను మనిషి జగతియందు! / జ్ఞానమెవని

కబ్బు? సాధకునికి గాక!’ నిజమెంత నిర్భయతగా

తన పని తాను చేసుకుపోతుంది. వయసు

తేడాల్లేకుండా ఆడాళ్ల మీద అత్యాచారాలు,

హత్యాచారాలు సాగిపోతున్నాయి. ‘చన్ను బాల

తడిమి చరచి యాడెడు బిడ్డ / పెరిగి పొరుగు

సఖిని చెరపగోర / మూగవోయె తల్లి, మొరటు

పుత్రుని జూచి’ ఈ దుష్టాంతాలు సమాజానికి

కనువిప్పు కావాలి. తల్లి ఒడి నుంచి బయట

సమాజంలోకే కాదు కుటుంబంలోను ఉండి ఏమి

నేర్చుకుంటున్నాడో ఏది అలవర్చుకుంటున్నడో

గమనించ లేకపోవడం ఘోరమే మరి.
ఈమధ్యే పేపర్లో వార్త! ఎక్కడో కాదు మన

రాష్ట్రంలోనే. డిగ్రీ, బిటెక్ చదివిన ఇద్దరు

పెద్దాసుపత్రి నిర్మించి వైద్యం చేస్తున్నారని, వైద్యం

ఎంత చులకనైంది. సర్కారు దవాఖానాకు పోతే

తిరిగి రారనే అపవాదు ఎలాను ఉంది. దానికి

ఉటకింపే ఈ పద్యం. ‘ప్రభుత్వ హాస్పటాళ్లు

ప్రాణాలు దీసెడి / గమ్యములుగ పేరుగాంచె నేడు

/ వైద్య సర్ట్ఫికెట్టు వ్యాపారవనరౌటం’ అంటారు,

ప్రతి రంగంలోను సేవ చేయాల్సిన వాళ్లు దాన్ని

ఆదాయ మార్గంగా యెంచుకుంటున్నారు.

సేవకుల బెడద ఎక్కువై పోయిందిప్పుడు

స్వస్థతల ముసుగులో దోచుకొనే దొంగ భడవులు

ఎక్కైవైనారు. వారి గురించే ‘ప్రభుని పేర వచ్చి

ప్రార్థనలను జేసి / యానుపాను జూచి యదను

జూచి / యన్య జనులను దోచు సన్యాసి పని

దొంగ’ హిందుత్వంలో క్రైస్తవంలోను కూడా పని

దొంగల్ని మేపటం సాధారణమైపోయింది. ఎవర్నీ

వదలకుండా అందర్నీ సమాజానికి హాని చేసే

వాణ్ణి ఆపద తెచ్చే వాణ్ణి ఎండగట్టి వదిలారు

మద్దా వారు.
మద్యం ప్రధాన ఆదాయం అయిపోయింది. దాన్ని

ప్రోత్సహిస్తూ దొరికినంత దోచేసుకుంటోంది

ప్రభుత్వం. మద్యం మహమ్మారితో ప్రజల ధన

మానాలు దోచుకుంటున్న వైనాన్ని ఇలా. ‘కల్లు

గీతగాని కలిమిని దోచేసి /నాటు సారా వాని నణగ

ద్రొక్కి / బ్రాందియమ్ము ప్రభుల

బండారమిదియేమి’ అని ఆశ్చర్యం వ్యక్తం

చేస్తున్నారు. వ్యవసాయం కుంటుపడి పశు

సంపద ‘ఎలా నిర్వీర్యం అయిపోయిందోని వగచి

చెప్తున్న పద్యమిది. యాంత్రీకరణ వచ్చి

వ్యవసాయం ఆటుపోట్లకు గురైంది.
రైతు మీద వ్యవసాయం మీద ఇంకా కొన్ని

పద్యాలు మనసుకు హత్తుకొని వేదన

పరుస్తుయి. పశుపోషణ భారం కావడం,

రసాయన ఎరువుల వాడకం, పంట దిగుబడి

తగ్గడం వంటి అనేక సమస్యలు రైతును

కృంగదీస్తున్నాయి. ప్రస్తుత ప్రభుత్వాలకు

చురుక్కు మనిపించే చమక్కు ఇది. చెట్టు పేరు

చెప్పుకొని కాయలు అమ్ముకొంటున్న పరిస్థితి.

దానికిదే ఆయనిచ్చిన వనరాయె / రాముడేలి

నట్టి రాజ్యమందు / రాజ్యమేలు చుండ్రి

రాబందులిప్పుడిటన్’ ఏ కుంభకోణం ఎక్కడ

బయట పడినా దాని వెనుక రాజకీయ

దురంధుల పాత్ర మనకు తేటతెల్లమవుతుంది.

కూటికి, గుడ్డకు అలమటించుపోతున్నారు

కొందరు.
ఫ్యాషను పేరుతో పాశ్చాత్యులను అనుకరిస్తూ

రెండు గుడ్డ పీలికలు ఒంటికి చుట్టుకొని అందాలు

ఒలకపోస్తున్న ప్రదర్శనలు చూస్తూనే ఉన్నాం.

గుంజాటన లేకుండా పద్యాన్ని చదవటానికి కవికి

ఎంత విద్వత్తు ఉండాలో అంతా చూపించారు

సత్యనారాయణ కవి గారు. గతంలో శతకాన్ని

రాసిన అనుభవం మరో మంచి కావ్య రచనకు

దోహదపడిందనవచ్చు. ఆటవెలది పద్యాలతో

ఆడుకొన్నారు సులభ శైలితో, పాఠకులను

దగ్గరకు చేర్చుకున్నారు. అన్ని అంశాల మీద

వాస్తు మూఢ నమ్మకాలు, తల్లిదండ్రుల దీన స్థితి,

అనుబంధాల మీద ఇలా అన్ని విషయాల మీద

తన కలాన్ని జుళిపించారు. పద్యం మళ్లీ ఊపిరి

పోసుకుంటుందన్న నమ్మకాన్నిచ్చారు.

ప్రతులకు
మద్దా సత్యనారాయణ
గురజానపల్లి
కరప మండలం
కాకినాడ రూరల్ - 533016
సెల్: 9849257034

- రవికాంత్, 9642489244