రాజమండ్రి

ప్రాజెక్ట్ వర్క్! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అంకుల్! నెట్‌లో లాల్‌బహదూర్‌శాస్ర్తీని

తియ్యరూ!’’ అంది కుసుమ.
‘‘నాకు ఎన్విరాన్‌మెంట్ పొల్యూషన్ కావాలి’’

అంది సరోజ.
‘‘అంకుల్ ఫతేపూర్ సిక్రీ గురించి నెట్‌లో

వెదకండి’’ రాజ్‌కుమార్ అడిగాడు.
అందరికీ అలాగే అంటూ నెట్‌లో వారికి

కావాల్సినవి వెదుకుతున్నాడు సుందరం. ఆరో

తరగతి నుండి పదో తరగతి వరకూ ప్రాజెక్టుల

పేరుతో నెట్ సెంటర్ల వెంట తిరిగి కాలాన్ని ఖర్చు

చేసి, చమురు వదిలించే కొత్త చదువులు తెచ్చిన

విప్లవం యిది.
సుందరం నెట్‌సెంటర్లో మొత్తం తొమ్మిది

కంప్యూటర్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం

కోసం వాటిని కేటాయించి, తాను లాప్‌టేప్‌లో

కొన్ని పనులు చేస్తున్నాడు.
ఆరోతరగతి అంటే పదకొండేళ్ళ వయసు -

అక్కడ్నుండీ పదో తరగతి అంటే పదిహేనేళ్ళ

వయసు - పిల్లలంతా నెట్‌సెంటర్లలో తిరుగుతూ

కొన్ని పడకూడని కళ్ళపడ్తూ, కొందరు

చూడకూడని చూపుల్ని చూసీచూడనట్టు

వదిలించుకొంటున్నాయి.
సుందరం ఇంటర్నెట్ కేఫ్‌లో కంప్యూటర్లు,

జిరాక్స్, నోట్స్ పుస్తకాలు, పెన్నులు, చాక్లెట్లు,

యిలా అన్ని వయసుల వారి అవసరాలకు

తగ్గట్టుగా వస్తువుల్తో నిత్యం బిజీగా ఉంటుంటాడు

సుందరం.
వయసులో కుర్రాడు - చురుకుదనం పాలెక్కువ.

అటూయిటూగా మాట్లాడుతూనే నవ్వుతూ

పనులు చేసిపెడ్తాడు.
చుట్టూ ఉన్న నాలుగు స్కూళ్లకు సెంటర్లో

ఏర్పాటు చేసింది. ఎక్కువమంది పిల్లలు

వచ్చిపోయేది కావడంవల్ల సాయంత్రం షాపు

సుమారు నాలుగు నుండి రాత్రి ఏడున్నరవరకు

బిజీబిజీగా ఉంటుంది.
ప్రాజెక్ట్ వర్క్‌ల పుణ్యమాని నాలుగు డబ్బులు

కళ్లచూడగలుగుతున్నాడు. అదీ

యింతకుముందయితే కేవలం జిరాక్స్, నెట్

వ్యాపారంలో రోజుకు నాలుగొందలు

సంపాదించడం సుందరానికి గగనమయ్యేది.
‘‘మా పుస్తకాల్ని రికమెండ్ చెయ్యాలి సార్!’’

అన్నాడు గోవర్థనరావు.
‘‘చూద్దాం’’ దర్పంగా సెలవిచ్చాడు ధనుంజరావు.
‘‘అలా అనకండి. ఈ పుస్తకాలు చూశారూ.

తెలుగు - చాలా తక్కువ సమయంకు

సరిపోయేలా! ఇంగ్లీష్ - ఎనె్నన్ని వర్డ్స్, రైమ్స్,

కలర్స్ ఉన్నాయో! యిక మేథ్‌మెటిక్స్ ఎగ్రేడ్,

బిగ్రేడ్, సిగ్రేడ్‌లుగా మూడు పుస్తకాలు, సైన్స్,

సోషల్ స్టడీస్ అయితే ప్రతి లెసన్‌కు రెండేసి

ప్రోజెక్ట్ వర్క్‌లు. స్టేట్ మొత్తం మా సిలబస్సే ఫాలో

అవుతున్నారంటే నమ్మండి!! గుక్కతిప్పుకోకుండా

చెప్పి కాసిన్ని మంచినీళ్లు తాగాడు బిజినెస్

రిప్రజెంటేటివ్ గోవర్థనరావు.
‘సరే చూద్దాంలెండి. కాంప్లిమెంటరీ కాపీలు రెండు

సెట్లు యిచ్చి వెళ్లండి వన్ టు టెన్త్’’
‘‘అలాగే!’’
మా ఆఫీస్ బాయ్‌కు యిచ్చి వెళ్లండి/ తర్వాత

మా స్ట్ఫా కలెక్ట్ చేసుకుంటారు’’
అలాగే సార్! యిదిగోండి నా విజిటింగ్ కార్డ్. మీరు

ఫోన్ చెయ్యడం ఆలస్యం క్షణాల్లో వాలిపోనూ!’’
‘‘డీ.కే’’ అంటూ ధనంజయరావు సెల్‌ఫోన్‌లో

నంబర్లు వెదుక్కుంటున్నాడు పరోక్షంగా వెళ్లి

రమ్మన్న భావంతో!
గోవర్థనరావు నెమ్మదిగా లేచాడు అక్కడ్నుంచి.
పావుగంట గడిచింది. లంచ్ అవర్‌ని సూచిస్తూ

బెల్ మోగింది.
కారియర్స్ తెచ్చుకున్న వాళ్లు విప్పి భోజనం

చేస్తున్నారు. చిన్నపిల్లలకు ఆయా సహాయం

చేస్తోంది. భోజనం తెచ్చుకుని వాళ్లు స్కూల్

కాంపౌండ్‌లో గల షాపులో డ్రింక్స్, బిస్కట్స్

తీసుకుంటున్నారు. కొంత నగదుగా - కొందరికి

అరువుగా!
మధ్యాహ్నం తరగతులు రెండు గంటలకు

మొదలయ్యాయి. సాయంత్రం నాలుగు

అయ్యేలోగా మరో ముగ్గురు పబ్లికేషన్స్ తరఫు

నుండి వచ్చి తమ పుస్తకాలు మాత్రమే కొనమని

బలవంతపెట్టి, అడిగిన కాంప్లిమెంటరీ కాపీలు

యిచ్చి ఆర్డర్స్‌కోసం ఎదురుచూస్తూన్నాం అని

చెప్పి వెళ్లిపోయారు.
సాయంత్రం నాలుగైంది. లాంగ్‌బెల్ మోగింది.
కరస్పాండెంట్ ధనంజయరావు చెప్పడంవల్ల స్ట్ఫా

అంతా మీటింగ్‌కోసం ఎదురుచూస్తున్నారు. కాఫీ

- బిస్కట్లు సేవించి
ధనంజయరావు లేచియిలా చెప్పడం

మొదలుపెట్టాడు.
‘‘ఫ్రండ్స్, మన సంస్థకు సమాజంలో

గొప్పపేరుంది. చక్కని విద్యా బోధన యిస్తామన్న

గుర్తింపు ఉంది. కాబట్టి ఈ సంవత్సరం సిలబస్

మారుస్తున్నాం. మీ అందరికీ ఒకో పబ్లికేషన్

పుస్తకం ఒక్కో కాపీ యిస్తాం. దాన్ని ఆదివారం

అంటే రేపే చదివి సోమవారం నాటికి మీ

అమూల్యమైన, నిష్కర్షమైన అభిప్రాయాలు

తెలియజేయండి’ అంటూ మీటింగ్ పూర్తి చేశాడు.
ప్రతి సబ్జెక్ట్ టీచర్‌కు ఒక్కో పబ్లికేషన్ ఒక్కో కాపీ

అందింది. స్ట్ఫా అంతా ఆ పుస్తకాలు పట్టుకొని

యిళ్లకు బయల్దేరారు.
సింహాచలం (కరస్పాండెంట్ బావ) మాత్రం అక్కడే

ఉండిపోయాడు.
‘‘ఏం బావా? యింకా వెళ్లలేదేం?’’ నవ్వుతూ

అడిగాడు ధనంజయరావు.
‘‘యింత సడన్‌గా మీటింగ్ ఉద్దేశ్యం ఎందుకో?’’

నవ్వుతూనే ప్రశ్నించాడు సింహాచలం...
‘‘బావా! నీకు తెలియందేముంది. నేనా పెద్దగా

చదువుకోలేదు. నాకూ కొందరితో తోడు అవసరం

పడుతుందిగా!’’ అన్నాడు నవ్వుతూనే.
‘‘డొంక తిరుగుడెందుకు. అసలు విషయం

చెప్పరాదూ!’’
‘‘అయితే విను’’ అంటూ మొదలు పెట్టాడు

ధనుంజయరావు. ‘‘యిప్పుడు మన స్కూల్

రెంటల్ నుండి స్వంతంకు వచ్చిందికదా!’’
‘‘అవును’’
‘‘్ఫజుల్లో మిగిలింది చేర్చి ఈ బిల్డింగ్

కట్టాంకదా!’’
‘‘స్ట్ఫా జీతాలు అవన్నీ’’
‘‘అన్ని ఖర్చులూ పోనూ సంవత్సరానికి

రెండున్నర లక్షలు కనీసం లాభం మనకు’’
‘‘అమ్మ బాబోయ్’’
‘‘హెడ్మాస్టర్ - స్ట్ఫాలో టీచర్స్ తప్ప అంతా

మనవాళ్లే కదా!
‘‘అవును’’ అన్నాడు సింహాచలం - సంభాషణిలా

కొనసాగింది.
‘‘అలా ఎందుకు చేశాడో చెప్పగలవా?’’
‘‘నాకు తెలీదు’’
‘‘పిచ్చి బావా! పాఠాలు బాగా చెప్తే మిగిలినవి

ఏవైనా, ఎంతైనా ఎవరూ పట్టించుకోరు.

వ్యక్తిగతంగా ఎవడి అవసరాలు వాడికి తీరిపోతే

సరి. అంతే’’
‘‘అంటే!’’
‘‘ఆవూ! మా ఇంటి పనిమనిషి కూతురు,

బస్‌డ్రైవర్స్ యిద్దరూ, మా డ్రయివర్, తోటమాలి

కొడుకులు, జిరాక్స్ షాప్ మన షాపింగ్

కాంప్లెక్స్‌లా ఏర్పాటు చేస్తున్నా! దాంట్లో మా

రెండో బావమరిది ఉంటాడు. ప్రక్కనే నెట్‌సెంటర్ -

మా అన్నయ్య కొడుకు చూసుకొంటాడు.
యిక బిస్కట్స్, స్వీట్స్, టీ-కాఫీలకు మా

చిన్నాన్న గారి అబ్బాయొకడు ఖాళీగా ఉన్నాడు.

వీళ్లందరికీ వస్తువులు నేనే ఇస్తా! కేవలం

జీతగాళ్లుగా మాత్రమే పనిచేస్తారు. అంతే. మనకి

అడుగడుగునా ఆదాయం’’
‘్భలేగా ఉంది బావా?’ అన్నాడు సింహాచలం
‘‘అంతేనా! యింకా ఉంది. ఎవరి పుస్తకాలు, ఏ

సబ్జెక్స్‌వి ఎంత ధరకు యిస్తారో వాళ్ళు క్యాటలాగ్

యిచ్చారు. ఎక్కువ పర్సెంటేజ్ మిగిలే రకంగా

మనం పుస్తకాల్ని ఎంచుకుంటాం.

విద్యార్థులందరికీ ఎంఆర్‌పికే అమ్ముతాం. అక్కడ

చాలా లాభం మిగుల్తుంది. అదీగాక బుక్స్

ఎంచుకునేటప్పుడే ప్రాజెక్ట్ వర్క్ ఎక్కువగా ఉండే

పుస్తకం సెలక్ట్‌చేస్తే నెట్ అండ్ జిరాక్స్ మార్కెట్

బావుంటుంది. నోట్స్‌లు, పరీక్ష పేపర్లు అక్కడే

అమ్ముతాం కూడా!’
‘‘అందుకేనా సంవత్సరానికి రెండున్నర లక్షలు

మిగులు’
‘పిచ్చి బావా! అది కనీస మొత్తం... ఐదుకు చేరినా

ఆశ్చర్యపోనక్కర్లేదు.
‘ఇన్‌కంటాక్స్ కట్టాలి కదా!’
‘రసీదులు ఇవ్వం. యింత ఫీజు అని చెప్పం.

బిల్డింగ్ ఫండ్ వంటి వాటి పేరు చెప్పి కొంత

నొక్కేస్తాం. స్కూల్ బస్సులు, యూనిఫాం, బేడ్జస్

ఉండనే ఉన్నాయి. ఆదాయం చెప్తేనే కదా! టాక్స్

కట్టాలి. మనం ఆ పనెలాగూ చెయ్యం కదా!’
‘‘ప్రాజెక్ట్ వర్క్ వెనుక యింత కథ ఉందా?’ అంటూ

నోరు వెళ్ళబెట్టాడు సింహాచలం.
జనం మాత్రం వేలంవెర్రిలా - ఆ స్కూల్ ముందు

అడ్మిషన్లకై లైన్లలో.

- శ్రీనివాసభారతి, శ్రీకాకుళం