విశాఖపట్నం

కాకి గోడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెట్లను కూల్చెడి వానికి తెలియదు
గూడు కూలిన కాకి గోడు
మనసే మనిషికి మూలం
మనిషే పుడమికి ఆభరణం
నీరు లేని ఊరు ఎడారిలోన రహదారి
నీది నీది కాదు నాది నాది కాదు
అంతా మనదే అనుకుంటేనే సౌఖ్యం
పంచభూతాల పుట్ట రక్తమాంసాల దేహం
దీనిపై వ్యామోహం వెర్రితలలు
వేయడం తగదురా
భోగాల కోసం స్వార్ధం పెంచుకుంటే
- ఎల్. రాజాగణేష్, చైతన్యనగర్, పాతగాజువాక, విశాఖపట్నం-530026.

అవయవ దానం

మానవ దేహం పంచభూత నిర్మితం
జ్ఞానం, విచక్షణ, స్పర్శ, మాట్లాడే శక్తి
ఎంత అద్భుతం
సృష్టిలో అన్ని జీవుల కన్నా మావన
జనే్మ ధన్యం
ఇంద్రియాల సమాహారం మానవ శరీరం
మస్తిష్కం నుండి
పాదం వరకు సర్వాంగం ప్రదానం
అన్ని అంగాలు సక్రమంగా పని చేస్తే ఆరోగ్యం
ఏ అవయవం క్షీణించినా కలుగును అనారోగ్యం
చూపు లేని అభాగ్యులు ఎందరో
అంగవైకల్యంతో జీవచ్ఛవాలుగా
బతుకుతున్న వారెందరో
గుండె, కిడ్నీ ఇలా ఎన్నో సమస్యలతో
సగం ఊపిరితో జీవించే వారెందరో
సాటి మానవులుగా ఇలాంటి వారిని చూసి
మనల్ని మనం ప్రశ్నించుకోవాలి
మన సాటి వాడు పడుతున్న నరకయాతనకు
మనం ఎంత వరకు సహాయ పడగలం
అవయవ దానమే దానికి సరైన సమాధానం
మనం తనువు చాలించిన
మనం చేసే అవయవ దానం
మరొకరికి ప్రాణం నిలుపుతుంది
వారి జీవితానికి వెలుగునిస్తూ
మన జీవితం సార్ధకమవుతుంది
- సాలూరు సంతోషి, విజయనగరం.
సెల్ : 8019783424.

పెళ్లయిన కొత్తలో...

నే గులాబీలు కోస్తుంటే
ముల్లు గుచ్చుకున్న నా వేలును
తన నోట్లోకి తీసుకుని
కళ్ల వెంట నీళ్లు కార్చిన
మా ఆయన రూపం
నేను ఉల్లిపాయలు కోస్తుంటే
నా కళ్ల వెంట వచ్చే నీళ్లను చూసి
నా వేలు తెగిందేమోననుకుని
ఆదుర్దాగా వచ్చి పక్కన చేరిన వైనం
కాఫీ ఇచ్చి వెనుదిరిగి కదులుతుంటే
జడ పట్టుకు లాగి
కౌగిలిలో బంధించిన విషయం
సాయంత్రం పెరటి చెట్టు కింద
విశ్రాంతి తీసుకుంటే
వెనకగా వచ్చి
రెండు కనులు మూసి
దాగుడుమూతలు
ఆడిన మధుర క్షణాలు
ప్రతిరోజూ ఉదయం
ఆఫీసుకి వెళ్లేటప్పుడు
తీపి గుర్తుగా
నా పెదవులను చుంబించడం
గుర్తుకొచ్చేటప్పుడు
నేను పాడుకునే పాట
మళ్లీ మళ్లీ ఇవి రాని రోజులు
- బండారు చిన్న రామారావు.
సెల్ : 9553330545.