నెల్లూరు

‘విధి’ కథ బాగుంది (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావేరిపాకం రవిశేఖర్ కథలన్నీ కూడా

కొత్తకోణంలోనే వుంటున్నాయి. మేము గతంలో

వీరి కథలను కూడా చదివాము. ఈ వారం

మెరుపులో రాసిన విధి కథ గతంలో ఆయన

రాసిన కథల్లానే గొప్ప సందేశాన్ని అందించింది.

విధిరాతను ఎవ్వరూ మార్చలేరు కానీ

ఆత్మవిశ్వాసం వుంటే ఎక్కడైనా రాణించవచ్చు.

కథలో గొప్పగా బతికిన మణిమేఖలై డెవలపర్సు

సంస్థ చైర్మన్ ఈశ్వర్రావు, విశాలక్ష్మి జీవితాలను

విధి ఎలా తారుమారు చేసింది. సముద్రంలో

వేటకు వెళ్లే మత్స్యకారులను స్ఫూర్తిగా తీసుకుని

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన వారి

జీవితాలు ఎలా మలుపు తిరిగాయన్నదే

కథలోని సారాంశం. కథను మొదటి నుంచి కూడా

చివరి వరకు గొప్పగా రాశారు. పిల్లలతో సహా

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వారు

జీవితంలో మళ్లీ గత కీర్తిని సంపాదించిన తీరు

సమాజం నాకేమిచ్చిందనే వాళ్లందరికి

స్ఫూర్తిదాయకం. విధి రాత అనుకునే వాళ్లకు వీరి

జీవితం ఓ చక్కని ఉదాహరణ. ఆత్మవిశ్వాసంతో

ముందుకు సాగితే అంతా మంచే జరుగుతుంది.

రచయితకు అభినందనలు
- కోన వీరయ్య, అద్దంకి
- శ్యామలాదేవి, లెక్చరర్, నెల్లూరు
- రావి పద్మావతమ్మ, పీలేరు

మంత్రప్రక్రియ, కడుపుకోత
కవితలు బాగున్నాయి

మెరుపులో ఖాదర్‌షరీఫ్ గారు రాసిన

మంత్రప్రక్రియ కవిత బాగుంది. షరీఫ్ గారి కవిత

గురించి కొత్తగా చెప్పేదేముంది. అలాగే

కడుపుకోత అంటూ బోరుబావిలో పడిన చిన్నారి

ఆవేదనను అద్భుతంగా రాశారు కంచనపల్లి

ద్వారకానాథ్ గారు. ఇద్దరికీ అభినందనలు
- కాశీ విశే్వశ్వరరావు, నెల్లూరు
- పల్లెర్లమూడి రాఘవయ్య, కావలి