నెల్లూరు

నది (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గలగల పారే గోదారి గగనానికి ఎగిసిందా
కళకళలాడే కృష్ణమ్మ కైలాసానికి కెగిసిందా
కిలకిలలాడే కినె్నరసాని కాటికెళ్లిందా
ధగధగల పారే స్వర్ణముఖి ముఖం చాటేసిందా
వడివడిగా జారే వంశధార తన వంశం
అంతం చేసుకుందా
జలజల జారే ప్రాణహిత తన ప్రాణాన్ని
కోల్పోయినదా
బిరబిర బారే తుంగభద్రకు భద్రత కరువై
కనుమరుగు అయిందా
దేహ దాహం తీర్చే మంజీర మాయం అయ్యే

సమయం ఆసన్నమయిందా
ఘటప్రభ, మలప్రభ తమ ప్రభావాన్ని
కోల్పోయినాయి
సీమకు సిరులిచ్చే పినాకిని పెకిలిపోయిందా
నల్లమలలో పురుడు పోసుకున్న
గుండ్లకమ్మకు గండం ఏర్పడిందా
తుల్యభాగ, ఆత్రేయ, గౌతమి,వృద్ధగౌతమి,
భరత్వజ, కౌశిక, వశిష్ట, అను సప్త స్వర్ణ సప్త

గోదారి సమాప్తం అయ్యిందా...!!!
నదులను కలుషిత కోరల నుండి కాపాడండి..
భూగర్భ జలాలను పెంచండి..!
పాలు ఇచ్చే కన్న తల్లితో సమానం..నీరు ఇచ్చే

నది...!!!
అఖిలాశ, బెంగళూరు. చరవాణి : 7259511956

జైళ్లు తెరిచారు

చదువులకీ, మోస్తున్న బరువులకీ సంబంధం

తెగాక కలల్ని కూల్చుకుని వయస్సుకి మించిన

భారపు
బరువుల్ని భుజానికెత్తుకుని యుద్ధయాత్రని
ప్రారంభించి కదుల్తున్నారు..
అవును నిజంగానే పిల్లలు బళ్లకు

ప్రయాణమయ్యారు
బతుకుల్ని దున్నడం తప్పనిసరయింది
బాల్యం అందరిముందూ తగలబడ్తున్నా
రోజూ తల్లిదండ్రులు అనాలోచితంగానే
మళ్లీమళ్లీ బరువుల్ని భుజానికెత్తుతున్నారు
వయసుతోపాటు బరువు పెరుగుతూ పోతోంది
చూడండి... చూడండి.. జైళ్లు తెరిచారు
సత్యమేదో తెల్సుకునేలోపు
చిన్న జైల్లోంచి పెద్దజైల్లోకి అడుగుపెడ్తారు
బాల్యపు గంటలు నిశ్శబ్ధమై
ప్రవాహగానంలో కల్సిపోతున్నాయి
ప్రేమలు కరువయిన గుండెలు
సాయంత్రానికి అలసి సొలసి ఇంటికి

చేరుతున్నాయి
మమకారంలేని క్యారేజీలు రోజూ వెక్కిరిస్తూనే

ఉన్నాయి
బుద్ధిగా బడికెళ్లాలి
బ్రతుకుల్ని అక్కడే దిద్దుకుని దిద్దుకుని
జీవితాన్ని అరగదీసుకోవాలి
సరిగ్గా చూడండి పిల్లలు జైళ్లకెళ్తున్నారు..
ఎవరికయినా ప్రేమలు కరువయిన
కొన్ని కఠోర సత్యాలు నలిగిపోయిన
జీవన సన్నివేశాలూ కళ్లకి కన్పించాయా
లేదు.. లేదు.. సత్యాన్నీ అసత్యాన్నీ
ధైర్యంతో తూచేశక్తి ఎవరికీ లేదు
ప్రేమల్ని కొలవడానికి గుండెలు కావాలి
బరువుల్ని దించడానికి గుండెలున్న
తల్లిదండ్రులు కావాలి
జీవితం సాక్షిగా
భుజాలమీది బరువులు కొండలవుతున్నాయి
ఏదీ స్పష్టంగా చెప్పలేంగానీ
చదువు ఎక్కడయినా దొరుకుతుంది
మట్టికీ మనసుకీ సంబంధం గురించి
మనిషికి తెలియజెప్పే ప్రేమ ఎక్కడ

దొరుకుతుందో
ఇనుప చువ్వల్లోంచి బ్రతుకుని వీక్షిస్తూపోయే
ఆ బాల్యపు కన్నీటి చుక్కల ప్రవాహానికి
ఎప్పుడు తెరపడనుందో చెప్పలేంగానీ
అదిగో ఎప్పటికిమల్లే మరలా జైళ్లు తెరిచారు
అన్ని బాల్యాలు అక్కడే బందీలు కావాలని
జన్నతుల్ ఫిరదౌజ్ బేగం, సోమశిల. 9505961150

బాల మేధావులు

ఈ నర్సరీ అడవుల్లో
మహావృక్షాలు సైతం
మరుగుజ్జులౌతున్నాయి
హాంగింగ్ పాటలై
కిటికీలకు వేళ్లాడుతున్నాయి
యూరియా, ఫాస్ఫేట్లకి
తల్లి వేరు కుళ్లిపోయి
చివుళ్లు చివుళ్లుగానే
మొగ్గలు మొగ్గలుగానే
రాలిపోతున్నాయి
***
ఈ నర్సరీ బడుల్లో
విషాతీసిన పీజాలతో
కుర్కురే బర్గర్లతో
బాల మేధావులు
బొనసాయి
యంత్రాలౌతున్నారు
బాయిలర్ కోళ్లవుతున్నారు
***
పోషకాహార లోపంతో
సాధారణ ప్లూలు కూడా
స్వైన్‌ఫ్లూలై- ఆరోగ్యం
ఆర్థిక సమస్యై
అమాయక గ్రామీణం
అనారోగ్యవౌతుంది
ఇక్కడ -
కంప్యూటర్‌కి కళ్లిచ్చి
కాళ్లను కుర్చీలకు కట్టేసుకున్నాక
అమ్మెక్కడ? నానె్నక్కడ??
అమ్మమ్మెక్కడ? తాతయ్యెక్కడ??
అంతా -
నెట్ యంత్రాలమే కదా!
- డాక్టర్ ఈదూరు సుధాకర్,
నెల్లూరు
చరవాణి : 9849561613