దక్షిన తెలంగాణ

‘సామలేటి’ పాటల పల్లకి (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ సాహిత్య పరిషత్తు 177వ గ్రంథంగా

సామలేటి లింగమూర్తి పద్మశాలి గారు రచించిన

‘పాటల పల్లకి’ బాల గేయాల సంపుటిని

వెలువరించారు. లోగడ ‘పంచరత్న

మంగళారతులు’, ‘్భక్తమార్కండేయ నాటకం’,

‘అడవితల్లి’, ‘దేవి స్మరణామృతము’ ‘్భక్తజన

భజనమాల’ తదితర గ్రంథాలను ప్రకటించిన

లింగమూర్తి గారు ఇప్పుడు వెలువరిస్తున్న

‘పాటల పల్లకి’లో బాల గేయాలకు స్థానం

కల్పించారు. బాల సాహిత్యం సృజన ఇప్పుడిప్పుడే

పుంజుకుంటున్నా ప్రస్తుత నేపథ్యంలో..

లింగమూర్తి గారు పిల్లలు ఆడుతూ గానం

చేయడానికి యోగ్యంగా ఇందులో గేయాలను

పొందుపరిచారు. చిన్నారుల సర్వాంగణ

వికాసానికి దోహదపడేలా రూపుదిద్దారు. వర్షము

గురించి రాస్తూ.. గూనల ధారలు - జారినవి, నేల

వరదలు - పారినవి.. ఉరుములు - మెరుపులు

మెరిచినవి. గడ గడ ధ్వనులు వచ్చినవి

అన్నారు. అంగడివెళ్లి వస్తామా.. అరటిపండ్లు

తెస్తామా.. బజారుకు వెళ్దామా.. బొమ్మను కొని

తెస్తామా అంటూ అంగడి గురించి రాశారు.

పిల్లలకు రంగులు పరిచయం చేయడానికి..

మల్లెపూలు పరిచయం చేయడానికి.. మల్లెపూలు

తెల్లన.. రామచిలుక పచ్చన.. కాకి ఈకె నల్లన..

మంకెన పూవు ఎర్రన.. అని గేయాన్ని రాశారు.
‘ఎలుక భామ’ పేరుతో గేయం రాసినప్పటికీ..

కుక్కపిల్ల, పక్షి, చిలుక, కోతిపిల్లతో పాటు చేపలు,

కాకులు, కప్పలను గేయంతో చక్కగా

ఆవిష్కరించారు. ఇలా చిన్నారులకు ప్రాథమిక

విషయాలను పరిచయం చేస్తూ ‘ప్రయాణం’,

‘గంట’, పాపాయి, పల్లె ఇల్లు, కొంటె పనులు,

మంచి, తదితర అంశాలపై గేయాలను రాశారు.
పిల్లలో తల్లిదండ్రులపై గౌరవం కలిగేలా

అమ్మానాన్న కావాలి గేయం రాశారు. నోరులేని

జంతువుల పట్ల కరుణ చూపాలని హితవు

పలుకుతూ ఓ గేయాన్ని ఇందులో

పొందుపరిచారు.
చందమామ, దేవుళ్లు, వృక్షం, పాపాయి నవ్వులు,

అష్టదిశలు, వారములు, నెలలు, కోలాటం, వంటి

గేయాలు పిల్లలు హాయిగా గానం చేసుకోవడానికి

యోగ్యంగా వున్నాయి. ఇవేకాక.. ఆరోగ్యం, మంచి

ఆహారం, గురించి పాటలు ఇందులో వున్నాయి!

తాత మనుమడు, కన్న ప్రేమలు, పల్లె జీవనం

తదితర గేయాలు ఆసక్తికరంగా ఉన్నాయి..
ఇలా ఇందులోని గేయాలన్నీ పిల్లల్లో విజ్ఞానాన్ని

పెంచేలా వున్నాయి. ప్రాథమిక స్థాయి విద్యార్థినీ,

విద్యార్థులకు ఉపయుక్తమైన గ్రంథం..అయితే

అక్కడక్కడ గేయాల్లో పిల్లల స్థాయికి మించిన

పదాలు పడ్డప్పటికీ.. పఠన యోగ్యంగా ఉన్నాయి.

గేయాలకు అనుగుణంగా వేయబడిన బొమ్మలు

గ్రంథానికి శోభను కూర్చాయి!

వెల: అమూల్యం
ప్రతులకు:
సామలేటి లింగమూర్తి
ఇం.నం.17-85
శ్రీనగర్ కాలనీ
భరత్‌నగర్, సిద్ధిపేట
సెల్.నం.9492912155

- సాన్వి, సెల్.నం.9440525544