మంచి మాట

పరాత్పరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతీయ సంస్కృతిలో తల్లిదండ్రుల తర్వాత ‘గురువు’కు ఎనలేని ప్రాధాన్యత ఇచ్చింది. తల్లిదండ్రులు మనకు జన్మకారకులైతే, గురువు మనో చైతన్య వికాసానికి, ఋజువర్తనకు మార్గదర్శకుడై, మనిషిని పరిపూర్ణ మానవుడిగా చేసేవాడు. మనిషిలో మానవత్వాన్ని పెంచుతూ సన్మార్గాన్ని, స్వార్థరహితంగా చూపించే వాడు గురువు. సర్వమానవ సౌభ్రాతృత్వంతో విశ్వమానవ కల్యాణాన్ని వీక్షింపజేసే జ్ఞాన స్వరూపుడు గురువు. ఈ సకల చరాచర సృష్టికి గురువే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం.
గురువు అంటే జ్ఞాన తేజస్సును ప్రసాదించేవాడు. గురువు అనుగ్రహం లేనిదే స్వతహాగా మానవునికి తనకు తానుగా బాహ్య వ్యామోహం నుండి తప్పించుకునే దృఢ చిత్తం అలవడదు. కనుక గురువును సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా తలచిననాడే గురు శిష్యుల అనుబంధం చిరస్థాయిగా నిలిచిపోతుంది. అసలైన విద్య ఆత్మ విద్యే. ఆత్మ విద్యా బోధకులే అసలైన గురువులు అన్నాడు యోగి వేమన. అట్టి ఆత్మ విద్యను నేర్పడానికి అవతరించినవాడే వ్యాసుడు. సాక్షాత్తూ భగవంతుడే మానవాళిని ఉద్ధరించడానికి వ్యాసునిగా అవతరించాడు.
‘వ్యాసాయ విష్ణు రూపాయ- వ్యాస రూపాయ విష్ణువే’ అని సాక్షాత్ భగవంతుడే మానవాళిని ఉద్ధరించడానికి వ్యాసునిగా భూమిపైకి వచ్చాడు. గురువు, దేవుడు వేర్వేరు కాదు, ఒక్కరే. దేవుడే గురువైనపుడు గురువును మించినదేది ప్రపంచంలో లేదు. సాక్షాత్ కనిపించు గురువే కనిపించని దేవుడు.
ఒకే ఒక్కడైన పరమాత్మ సృష్టి కార్యం కోసం అనేక రూపాలు ధరించవలసి వచ్చింది. ఒక్కో రూపంలోనూ ఆయన పలు విధాలుగా భక్తులను కాపాడారు. ఏ రూపంలో వచ్చినవారు ఆయన్ని ఆ రూపంలో ఆరాధించుకునే వీలుగా వ్యాసులవారు అష్టాదశ పురాణాలను, ఉప పురాణాలను, భాగవతాన్ని, భారతాన్ని రచించి ప్రపంచంలోని ప్రజలకందించాడు. బ్రహ్మ ముఖము నుండి వెలువడిన వేదాలను విని విభజించుమని శ్రీమన్నారాయణుని ఆదేశం. ఆయన వేద విభజనకు మెచ్చి వేదవ్యాసుడు అనే బిరుదును బహూకరించాడు.
మానవులందరికి అజ్ఞానం నశించి జ్ఞానం వృద్ధి చెందేందుకు పాపం తొలగిపోయి పుణ్యం లభించడానికి, అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి జ్ఞానకాంతులను కలిగించడానికి త్రికాల జ్ఞాన సంపన్నుడైన వ్యాస మహర్షి ఆదిగురువుగా ఏకరూపంలోనున్న వేదరాశిని లోకోద్ధరణకోసం ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అనే నాలుగు వేదాలుగా విభజించాడు.
వ్యాస మహర్షి ధర్మబద్ధమైన మానవ జీవన వ్యవస్థను రూపుదిద్దడమేగాక, మానవ జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలకూ, పరిష్కార మార్గాలు ఆయన గ్రంధాల్లో ఉన్నాయి. మానవ జీవితాల్ని సన్మార్గంలో నడిపించడానికి తన సర్వశక్తుల్ని ధారపోశాడు. భారత, భాగవత, అష్టాదశ పురాణాలను, బ్రహ్మసూత్రాలను మనకందించిన జ్ఞానభిక్షను ప్రసాదించిన వేదవ్యాసుని స్మరించడం భారతీయుల కనీస ధర్మం. కేవలం స్మరించడం కాదు ఆయన బాటలో నడవడానికి అహర్నిశమూ కష్టపడాలి. సత్యధారణ చేయడం మొదట్లో కష్టంగా అనిపించినప్పటికీ కూడా సత్యధారణ వల్ల వచ్చే లాభాలను తెలుసుకొంటే ఆచరించాలన్న ధ్యాస ఆసక్తి కలుగుతాయ. నారాయణ సదాశివ సమారంభా వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యన్తాం వందే గురు పరంపరాం-
గురువు ఆత్మస్వరూపుడై బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల శరీరములోను ఉన్నాడు. అందుకే ‘గురువు’ను గురుబ్రహ్మ, గురువిష్ణుః గురుదేవో మహేశ్వర అన్నారు. ‘ఓం గురురేకో జగత్సర్వం బ్రహ్మ, విష్ణు, శివాత్మకం గురోః పరతరం నాస్తి తస్మాస్థం పూజయేద్గురుం’ అంటే త్రిమూర్తుల ఆత్మగా నున్నవాడు గురువు ఒక్కడే జగత్తంతయు నిండి సర్వమై ఉన్నవాడు. గురువు కంటే మించిన వేరైన మోక్షం లేదు. అందుకే గురువును అన్ని విధముల పూజించవలెయును. పరమాత్మయందు ఎటువంటి భక్త్భివం కలదో గురవుయందు కూడా అంతటి భక్తి చూపాలి. పరమ గురువు చరణ సన్నిధానం పొందుటకు శుశ్రూషే మార్గం. రామకృష్ణ పరమహంస, వివేకానందుడు వంటి మహానుభావులు గురు శుశ్రూష ద్వారానే ఆత్మజ్ఞాన సంపన్నులై ముక్తి పొందారు.

-రసస్రవంతి కావ్యసుధ