నేర్చుకుందాం

నేర్చుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంతింతై వటుడింతయై మఱియు దానింతై నభో వీధిపై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై
నంతై, చంద్రుని కంతయై, ధ్రువునిపైనంతై, మహర్వాటిపై
నంతై, సత్యపదోన్న తుండగుచు బ్రహ్మాండాంత సంవర్థియై

భావము:బలి చక్రవర్తినుండి దానాన్ని తీసుకున్న వామనుడు కొద్ది కొద్దిగా ఎదిగినాడు ఇంతవాడు అంతవాడైనాడు. అంతవాడు మరింతవాడైనాడు. క్రమక్రమంగా పెరిగిపోతున్నాయి. వరుసగా ఆకాశం కంటె, మేఘ మండలంకంటె వెలగుల రాశికంటె పైకి పెరిగాడు. చంద్రుని వరకు, ధ్రువతారవరకు, మహర్లోకం వరకూ ఆపైన సత్యలోకం వరకూ పెరుగుతూ బ్రహ్మాండమంతా నిండిపోయినాడు.

మహా భాగవతం లోని పద్యము