సాహితి

మృదువుగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొగ్గగా వున్నప్పుడు
ముద్దులొలుకుతాయి
వికసించేటప్పుడు
గుప్పున పరిమళిస్తాయి
జడలోనో మెడలోనో
మెరిసిన తర్వాత
తళుకులు నలిగిపోతాయి
నేను తెచ్చిన మాలికలు
నీ మెడనిండా వేసుకో
నీవు ఇచ్చిన పువ్వులు
దోసిట్లో పోసుకుంటా
అందరి మధ్యన ఇద్దరం
అత్తరులా అల్లుకుపోదాం

తీసేసేటప్పుడు కాస్తంత జాగ్రత్త
రేకులు ఒక్కొక్కటి మెత్తగా విరిగిపోతాయి
గాజు వంటి మనసు దండలది
పూలగుండెలు పగులకుండా పట్టుకో
దాచుకొన్న నవ్వులు రాలిపోకుండా
మూట విప్పినట్టు మృదువుగా పరుచుకో

మమతలు కరువైతే
ఈ విరులెందుకు!
మనుషులు దూరమైతే
ఈ మరులెందుకు!!

- ఆశారాజు