కృష్ణ

ప్రపంచంలోనే పోలవరానికి గుర్తింపు సాధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామర్రు, జూలై 16: ప్రపంచంలోనే పోలవరం నీటి ప్రాజెక్టుకు గుర్తింపు లభించేలా కృషి చేస్తూ 2018 సంవత్సరానికి ఆ ప్రాజెక్టులోని కొన్ని కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం పామర్రు సమీపంలోని బల్లిపర్రు లాకుల వద్ద పుల్లేరు కాలువ నీటి ప్రవాహాన్ని ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడారు. 2019 నాటికి పూర్తి స్థాయిలో పోలవరంను పూర్తిచేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు అపర భగీరథుడిగా కీర్తిని తీసుకొస్తామన్నారు. ప్రస్తుతం రైతులు సూక్ష్మ సేద్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆ దిశగా ప్రభుత్వం ‘పొలం పిలుస్తోంది’ అనే కార్యక్రమం ద్వారా అవగాహన కల్పిస్తుందని వివరించారు. పోలవరం పూరె్తైన తర్వాత ప్రతి బీడు భూమి పంట భూమిగా మారగలదని, మూడు పంటల వరకు పండించుకోవచ్చన్నారు. అదే విధంగా రాష్ట్రంలో డ్యాంను పరిరక్షించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. శ్రీశైలం డ్యాం భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. పట్టిసీమ ద్వారా జూన్ నెలలోనే నీరు విడుదల చేశామని, రైతులు ఆలస్యం చేయకుండా వరినాట్లు వేయాలని కోరారు. దీని వలన నవంబర్ తుఫాన్‌లను అధిగమించి ముందుగా పంటలు చేతికొస్తాయన్నారు. కృష్ణాడెల్టాకు ప్రస్తుతం 80 టిఎంసిలు అవసరమున్నట్లు గుర్తించామని ఇందులో 68 టిఎంసిల వరకు నీరు అందిస్తున్నామని మిగిలిన నీరు వర్షపాతం పూర్తి చేస్తుందన్నారు. ఈ ఏడాది ఇటు ఖరీఫ్ వరిసాగుకు అటు వాణిజ్య పంటలకు పుష్కలంగా నీరు లభిస్తుందన్నారు. ఎరువులు, పురుగు మందులు పూర్తి స్థాయిలో మార్కెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా ప్రతిపక్ష వైకాపా నేత జగన్ వారి అనుచరులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావుతోపాటు స్వాతంత్య్రుడని చెప్పుకునే ఉండవల్లి అరుణ్‌కుమార్ వారి ఉనికి కోసం అధికార ప్రభుత్వ పాలనను సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను విమర్శించిన అంశాల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. తప్పులు విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష నేతలపై రైతులే తిరగబడే రోజు దగ్గరబడిందన్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనాన్ని అధిగమించడానికి అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేసి సాగుకు సహకరించిన మంత్రి దేవినేని ఉమను పామర్రు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మండపాక శంకరబాబు, విజయవాడ కనకదుర్గ దేవస్థానం డైరెక్టర్ పామర్తి విజయశేఖర్, జిల్లా తెలుగుదేశం పార్టీ నేత దగ్గుబాటి ఫణీంద్ర, వైఎస్ ఎంపిపి లాజరస్‌లు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. మంత్రి ఉమ వెంట కృష్ణాడెల్టా ప్రాజెక్టు చైర్మన్ గుత్తా శివరామకృష్ణ పాల్గొన్నారు.