కృష్ణ

మృత్యుశకటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెడన, జూలై 16: రోడ్డు మీద వెళ్లాల్సిన బస్సు అదుపు తప్పి జనం మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందగా ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం 7గంటల సమయంలో పెడన-గుడివాడ ప్రధాన రహదారిలో పల్లటి స్కూల్ వద్ద ఉన్న పెట్రోలు బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మచిలీపట్నం నుండి రాజమండ్రి వెళుతున్న ఎపి 28జెడ్ 5986 నెంబరు గల ఆర్టీసి బస్సు ఎదురుగా మార్నింగ్ వాక్ చేస్తూ నడుపూరు నుండి పెడన వస్తున్న నలుగురిపైకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో స్థానిక 13వ వార్డుకు చెందిన పండ్ల కొట్టు వ్యాపారి వడ్డి రామకృష్ణ (59) అక్కడిక్కడే మృతి చెందాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన 3వ వార్డు కౌన్సిలర్ బూసం ఆనందరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు సోదరుడు బొడ్డు ఆనందరావు, సాయి రమ్య కేబుల్ నెట్‌వర్క్ నిర్వాహకుడు మలిరెడ్డి రామకృష్ణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో రామకృష్ణారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో మచిలీపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బూసం ఆనందరావు, బొడ్డు ఆనందరావులు విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు రామకృష్ణకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బ్రేక్ ఫెయిల్ కావటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ బస్సుకు కండెక్టర్ ఉండరు. డ్రైవరే ప్రయాణీకులకు టిక్కెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ బస్సును డ్రైవ్ చేస్తూ ప్రయాణీకులకు టిక్కెట్లు కొట్టాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కారణంగా ఎడమ వైపు ప్రయాణించాల్సిన బస్సు కుడి వైపుకు వెళ్లి ఎదురుగా వస్తున్న పాదచారులపైకి దూసుకుపోయిందని ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ బంటుమిల్లి యోగేశ్వరరావు పరారై కొద్దిసేపటికి పోలీసులకు లొంగిపోయాడు. బందరు డియస్పీ శ్రావణ కుమార్, సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మూర్తి ఘటనా స్థలికి వెళ్లి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సీతాపతిరావు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పెడన ఎస్‌ఐ గణేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్షతగాత్రులకు ఎమ్మెల్యే కాగిత పరామర్శ
ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావ్, టిడిపి రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల జగన్నాధరావు (బుల్లయ్య), మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద ప్రసాద్, మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, పిసిసి సభ్యుడు యండి మతీన్‌లు ఘటనా స్థలిని పరిశీలించటంతో పాటు మచిలీపట్నం, పెడనలో ప్రాథమిక చికిత్స పొందిన క్షతగాత్రులు బూసం ఆనందరావు, బొడ్డు ఆనందరావు, రామకృష్ణారెడ్డిలను పరామర్శించారు. వడ్డి రామకృష్ణ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు.