కృష్ణ

జిల్లాలో సమృద్ధిగా వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 16: వాతావరణ మార్పుల కారణంగా జిల్లాలో వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. అనుకున్న సమయానికే ఈశాన్య ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకటంతో ఈ యేడాది వర్షాభావ పరిస్థితుల నుండి బయట పడ్డారు. విస్తారంగా కురుస్తున్న వర్షాలు, పట్టిసీమ ద్వారా డెల్టాకు విడుదలైన గోదావరి జలాల పరవళ్లకు రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. గత పదేళ్ల డెల్టా చరిత్రలో ఈ సంవత్సరం జూన్ రెండవ వారంలోనే కాలువలకు పట్టిసీమ పుణ్యమా అంటూ గోదావరి జలాలు రావటంతో ఖరీఫ్ సాగుపై రైతులు మరింత మక్కువ పెంచుకున్నారు. గత యేడాది కన్నా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది. 6.24లక్షల హెక్టార్లలో పలు రకాల పంటలు సాగు కానున్నాయి. ఇందులో ప్రధానంగా 2.50లక్షల హెక్టార్లలో వరిని సాగు చేయనున్నారు. ఇప్పటికే సుమారు 30వేల ఎకరాల్లో నారుమడులు వేశారు. 80వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధతిన సాగు చేయనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు నాలుగు రోజుల నుండి జిల్లా వ్యాప్తంగా మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేడు, రేపు కూడా జిల్లాలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలియజేస్తున్నారు. జూన్ 1వతేదీ నుండి ఆదివారం వరకు 234.8మి.మిల వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 188.8మి.మిలు కురవాల్సి ఉండగా 24.4మి.మిలు అధిక వర్షపాతం కురిసింది. 17 మండలాల్లో సాధారణ వర్షపాతం, 30 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జి.కొండూరు, ఆగిరిపల్లి, బాపులపాడు మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది.