కృష్ణ

బిసిలకు అన్యాయం చేస్తే పోరాటం చేస్తాం: కృష్ణయ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 16: తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలలోని బిసిలకు అన్యాయం జరిగితే పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బిసి హక్కుల జాతీయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. ఆదివారం మొవ్వ మండలం వేములమడ గ్రామానికి విచ్చేసిన ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఉద్యమం ద్వారా బిసి వర్గాలకు అన్యాయం జరిగితే వ్యతిరేక పోరాటం చేసేందుకు వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ జనాభాలో 56 శాతం మందిగల బిసి వర్గాలలో కేవలం 14శాతం మంది మాత్రమే ఫలితాలు అనుభవిస్తున్నారన్నారు. 2,600 ఉప కులాలు కలిగిన బిసి సామాజిక వర్గాలలో కేవలం 50 కులాలకు మాత్రమే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. జనాభాలో ఆరు నుండి ఎనిమిది శాతం మంది మాత్రమే గల కాపు వర్గాల ఒత్తిడికి రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోవటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా 1994లో న్యాయ స్థానాన్ని ఆశ్రయించానన్నారు. ఫలితంగా బిసిలకు కొంతమేర ఉపయోగ పడుతుందన్నారు. ఏది ఏమైనా బిసిలకు ఏ మాత్రం అన్యాయం జరిగినా సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ మురారి శ్రీనివాసరావు, బిసి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి డా. యం మారీష్, తెలంగాణ బిసి సంక్షేమ పోరాట సంఘం అధ్యక్షుడు రాజేందర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి బాపయ్య తదితరులు పాల్గొన్నారు.