విజయవాడ

ప్రభుత్వ కార్యాలయాల గోడలపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 16: జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాల గోడలపై వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీలు ఇతర ప్రచార కార్యక్రమాలు నిర్వహించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బి లక్ష్మీకాంతం తెలిపారు. ఆదివారం కలెక్టర్ తన క్యాంపు కార్యాలయం నుండి సంబంధిత అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీకాంతం మాట్లాడుతూ ‘ప్రీవెన్షర్ ఆఫ్ డామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్’ అమలుకు అవసరమైన అన్ని చర్యలు జిల్లాలో తీసుకుంటామన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు పరిశుభ్రంగా అందంగా తీర్చిదిద్దాలని వాల్ పోస్టర్లు, పెయింటింగ్‌లు, ఫ్లెక్సీలు ఎక్కడ కనబడినా అందుకు బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు నష్టం కలిగించే విధంగా గోడలపై వాల్ పోస్టర్లు అందించే వారిపై ప్రీవెన్షన్ ఆఫ్ డామేజ్ పబ్లిక్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ - 4 ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో 480 ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని వాటికి నష్టం కలిగించినా, ప్రచార కార్యక్రమాలకు ఉపయోగించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. ఈ చట్టం అమలుకు రెవెన్యూ డివిజన్‌ల వారీగా మండల తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, డివిజనల్ పంచాయతీ అధికారులు, రెవెన్యూ డివిజనల్ అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.