హైదరాబాద్

భారీ వర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, జూలై 16: నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అల్పపీడనద్రోణి కారణంగా రెండు రోజులుగా ఆకాశం మేఘావృతం అయి ఉన్నా చిరుజల్లులతో సరిపెట్టుకుంది. కాగా రాత్రి భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బేగంపేట, అమీర్‌పేట్, బల్కంపేట, పంజాగుట్ట, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. పంజాగుట్ట ప్రధాన రహదారిపై, అమీర్‌పేట మైత్రీవనం, లక్డీకాపూర్ వద్ద వర్షం నీరు కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.