హైదరాబాద్

ఘనంగా బోనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సైదాబాద్, జూలై 16: ఆషాఢం సందర్భంగా నగర వాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాల సంబరాలు అంబరాన్నంటాయ. పాతబస్తీలోని దేవాలయాల్లో బోనాల జాతర కన్నుల పండుగగా జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మూడో సంవత్సరం రాష్ట్ర పండుగా జరుపుతున్న బోనాల సంబరాలు నగరంలో నేత్రపర్వంగా జరిగాయి. జంటనగరాలకు చెందిన వివిధ ప్రాంతాల ప్రజలతో పాటు ఇరుగుపొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన ప్రజలు అత్యధిక సంఖ్యలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. లాల్‌దర్వాజలోని శ్రీ సింహవాహిని మహాంకాళీ అమ్మవారిని, శ్రీ అక్కన్న మాదన్న దేవాలయంతో పాటు చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజలు అమ్మవారికి బోనాలు, టెంకాయలు సమర్పించుకుని పూజలు నిర్వహించారు.
కోరిన వరాలిచ్చే తల్లి వరాల పోచమ్మ
చిక్కడపల్లి, జూలై 16: భక్తులు కోరిన వెంటనే కోరిన వరాలను అందించే తల్లి వరాల పోచమ్మ అని టిఆర్‌ఎస్ బిసి సెల్ అధ్యక్షుడు ముఠా గోపాల్ అన్నారు. ఆదివారం బోనాల సందర్భంగా గాంధీనగర్ డివిజన్‌లోని జవహర్‌నగర్ వరాల పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం బోనాలను అధికారికంగా ప్రకటించటమే కాకుండా బోనాలకు ప్రత్యేక నిధులు ఏర్పాట్లు చేయటం భక్తులకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తోందని అన్నారు. మన బోనాలు పండుగ కూడా జాతీయ స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకోవటం ఆనందదాయకమని అన్నారు. గాంధీనగర్ కార్పొరేటర్ ముఠా పద్మ, డివిజన్ అధ్యక్షుడు నరేష్, స్థానిక నాయకులు ఎర్రం శ్రీనివాస్ గుప్తా, ముకుంద రెడ్డి, పిఎస్ శ్రీనివాస్, సుధాకర్, రాజ్ కుమార్ గుండు జగదీష్, అరుణశ్రీ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
తనని నమ్మిన వారింట కనకాలు కురిపించే తల్లి కనకాల కట్ట మైసమ్మ అని కవాడిగూడ కార్పొరేటర్ జి.లాస్యనందిత అన్నారు. ఆదివారం బోనాల సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ అమ్మవారికి బోనం సమర్పించారు. కట్ట మైసమ్మ అమ్మవారు ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన తల్లి అని, ఈ దేవాలయం ఎప్పుడూ భక్తులతో కళకళలాడుతూ ఉంటుందని తెలిపారు. కంటోనె్మంట్ శాసన సభ్యుడు సాయన్న.. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం భక్తులకు మొక్కలను పంపిణీ చేశారు. టిఆర్‌ఎస్ నాయకులతో పాటు దేవాలయ చైర్మన్ గౌతమ్ కుమార్ పటేల్, ఇవో సత్యనారాయణ పాల్గొన్నారు.
ఉప్పల్: రామంతపూర్, హబ్సిగూడలో ఆదివారం బోనాల జాతర అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ప్రధాన రహదారిలోని శ్రీ పోచమ్మ, ఊర పోచమ్మ, పాతబస్తీలోని మహాంకాళమ్మ ఆలయంలో ఉదయం నుంచి భక్తులు మరీ క్యూలో నిలబడి అమ్మవార్లను దర్శించుకొని పూజలు నిర్వహించారు. మహిళలు డప్పుచప్పుళ్ల మధ్య బోనాలతో ర్యాలీగా వచ్చి అమ్మవారికి నైవేథ్యం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్, కార్పొరేటర్లు స్వప్న, జ్యోత్స్న, మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి, పిసిసి కార్యదర్శి పసుల ప్రభాకర్ రెడ్డి జాతరలో పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతకు ముందు అమ్మవారి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫలహార బండి, తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటుచేసినట్లు ఇన్‌స్పెక్టర్ నర్సింగరావు తెలిపారు.
ఖైరతాబాద్: ఖైరతాబాద్, సనత్‌నగర్, జూబ్లీహిల్స్ నియోజక వర్గాలలోని చిన్న, పెద్ద ఆలయం అని తేడా లేకుండా అన్ని ఆలయాలు భక్తులో నిండిపోయాయి. ఖైరతాబాద్‌లోని ఏడుగుళ్లు, నల్లపోచమ్మ ఆలయం, బిఎస్ మక్తాలోని అమ్మవారి ఆలయంలో వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. నెల రోజుల పాటు కొనసాగిన వేడుకలను పురస్కరించుకొని ఆలయలకు రంగులు దిద్ది, ముగిళ్లలో చూడచక్కని హరివిల్లులను వేయించారు. ఆలయాల చుట్టూ విద్యుత్ దీపాలను ఆలంకరించారు. నగర విధులన్నీ అమ్మవారి ప్రత్యేక గీతాలతో మారుమోగాయి.
నల్లకుంట: ఆషాడ మాస బోనాల జాతర సందర్భంగా అంబర్‌పేట నియోజకవర్గంలోని అమ్మావారి ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. మహిళలు.. బోనం, సాకలను సమర్పించాయి. అంబర్‌పేటలో మహంకాళి ఆలయం, ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్, బాపునగర్, బాగ్‌అంబర్‌పేట్, నల్లకుంటలలోని ఆలయాలు రంగురంగుల విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించగా ఆలయాలకు పండగశోభ సంతరించుకుంది. కోడి పుంజలు మేకపోతులను అమ్మవారికి బలి ఇచ్చారు. అంబర్‌పేట కార్పొరేటర్ పులి జగన్.. స్థానిక ఆలయాలు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరేంద్రనగర్‌లో నల్లపోచమ్మ ఆలయంలో గొళ్యాల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కార్పొరేటర్ హాజరై పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రశాష్, ఆర్.కృష్ణ ముదిరాజ్, ఎంఎస్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, ఈశ్వర్ పాల్గొన్నారు.
శేరిలింగంపల్లిలో: బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం శేరిలింగంపల్లిలో ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నారు. చందానగర్‌లోని విద్యానగర్ కాలనీ సెంటర్ నుంచి డప్పుచప్పుళ్ల మధ్య బోనం ఎత్తుకున్న మహిళా భక్తులతో కలిసి చందానగర్ కార్పొరేటర్ బొబ్బ నవతారెడ్డి ఘటాలతో ఊరేగింపుగా కాలనీ నుంచి రెడ్డి కాలనీ ఎల్లమ్మ గుడి వరకు తరలివెళ్లారు. వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఊరేగింపు ఏర్పాట్లు చేయగా అందరూ తరలివెళ్లి అమ్మవారికి బోనం, మొక్కులు చెల్లించుకున్నారు.
బోనాల పండుగను పురస్కరించుకుని ఆదివారం శేరిలింగంపల్లి ప్రాంతంలో ఘనంగా మహోత్సవాలు జరుపుకున్నారు. బిహెచ్‌ఇఎల్ ఎంఐజి ఫేజ్-1లోని రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండలి చైర్ పర్సన్ రాగం సుజాత, శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఫలహార బండి ఊరేగింపు నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన బండికి పొటేళ్లను కట్టి డప్పుచప్పుళ్ల మధ్య పోతరాజుల విన్యాసాలు, నృత్యాలతో అమ్మవారిని కింగ్స్ సర్కిల్ నుంచి ఆలయం వరకు ఊరేగించారు. ఫలహార బండి ఊరేగింపు ఉత్సవంలో ఎమ్మెల్సీ వి.్భపాల్‌రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు వి.సింధు ఆదర్శరెడ్డి, బొబ్బ నవతారెడ్డి, కొమిరిశెట్టి సాయిబాబ, మేకా రమేశ్, వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ చైర్మన్ మిరియాల రాఘవరావు, మాజీ కౌన్సిలర్లు జి.మోహన్‌గౌడ్, దుర్గం వీరేశం గౌడ్, గుర్రపు రవీందర్‌రావు, సోమదాస్, కె.సునీతా ప్రభాకర్ రెడ్డి, నాయకులు బద్దం కొండల్ రెడ్డి, బొల్లంపల్లి సత్యనారాయణ రెడ్డి, రవీందర్ రెడ్డి, నర్సింహా రెడ్డి, కృష్ణ యాదవ్, యశ్వంత్ యాదవ్ పాల్గొన్నారు.
గచ్చిబౌలి: గచ్చిబౌలి పరిధిలో ప్రజలు బోనాల పండుగను ఘననంగా జరుపుకున్నారు. మహిళలు ఉదయానే పట్టు వస్త్రాలు ధరించుకుని అమ్మవారికి నైవేధ్యని సమర్పించుకొని తమని చల్లగా చూడాలని ప్రార్ధించుకున్నారు. సాయంత్రం కాలనీ వాసులందరూ కలసి డప్పుదరువు మధ్య పోతరాజులు విన్యాసాలతో బోనమెత్తుకుని అమ్మవారికి సమర్పించారు. శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరెకపూడి గాంధీ.. గచ్చిబౌలిలోని అంజయ్యనగర్, కొండాపూర్, మాదాపూర్‌లోని అమ్మవారి దేవాలయాలను సందర్శించి పూజలు చేశారు. కార్పొరేటర్లు జగదీశ్వర్ గౌడ్, రాగం నాగేందర్ యాదవ్, షేక్ హమీద్ పటేల్ ఆయా డివిజన్ పరిధిలో జరిగిన బోనాల ఉత్సవాలో పాల్గొన్నారు. తెరాస నాయకులు గణేష్ ముదిరాజ్, రాజు యాదవ్, నార్నె శ్రీనివాస్, నాయినేని చంద్రకాంత్, మాధవరం గోపాల్, కాశీనాథ్ యాదవ్, వసంత వౌళి పాల్గొన్నారు.
కెపిహెచ్‌బికాలనీ: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలోని పలు ఆలయాలలో బోనాల వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. వేడుకలకు కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆషాడ మాస బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్వీన్‌కాలనీ, హైదర్‌నగర్, వివేకానందనగర్ కాలనీ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో అమ్మవారి ఆలయాలను సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్తరమ్మ ఆలయంలో అమ్మవారికి ఎమ్మెల్యే గాంధీ పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, లక్ష్మీబాయి, నాయకులు సంజీవరెడ్డి, నార్నే శ్రీనివాస్, చంద్రకాంత్, రాజు యాదవ్, గణేష్ ముదిరాజ్, గోపాల్, బాల్‌రాజు, చంద్రారెడ్డి,కార్తిక్‌రావు, కాశీనాథ్ యాదవ్, రామారావు, భాస్కర్‌రావు, లద్దె నాగరాజు పాల్గొన్నారు. బాలాజీనగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన బోనాల వేడుకలకు స్థానిక కార్పొరేటర్ కావ్య హరీష్ రెడ్డిదంపతులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో నిర్వహించిన బోనాల ఉత్సవాలకు స్థానిక కార్పొరేటర్ జానకి రామారాజు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లేష్, కృష్ణ ముదిరాజ్, ఆలయ కమిటీ ఇవో పాల్గొన్నారు.
కాచిగూడ: బోనాల పండుగను తెలంగాణ ప్రజలు కులమతలకు అతీతంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచే కాచిగూడ, నల్లకుంట, బర్కత్‌పురలోని ఆమ్మవారి ఆలయాలలో భక్తులు బారులు తీరారు. మహిళ భక్తులు ఆమ్మవారికి బోనాలు సమర్పించి తమ మొక్కులను తీర్చుకున్నారు. పలు అమ్మవారి ఆలయాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు. పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులు, బోనాలతో వివిధ ప్రాంతాలు పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. బోనాలతో పాటు నైవేథ్యలను సమర్పించారు.
బాలానగర్: ఆషాడ మాస బోనాల ఉత్సవాలలో భాగంగా ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరిగాయి. ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల పరిధిలోని పలు పోచమ్మ, ఎల్లమ్మ అలయాలలో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మోక్కులు తీర్చుకున్నారు. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు పండాల సతీష్‌గౌడ్, కాండూరి నరేంద్ర ఆచార్యలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు కంచి మహేందర్, నరేందర్‌గౌడ్, దత్తారావు, సాగర్‌రావు, జగన్, సత్యనారాయణ, జగదీష్, ఈశ్వర్, బస్వరాజ్ పాల్గొన్నారు.
శంకర్‌పల్లి: శంకర్‌పల్లిలో ఆదివారం గ్రామ ప్రజలు పోచమ్మతల్లి బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. పండుగను తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టి పడేలా జరుపుకున్నారు. భక్తులు తమ కోరికలను, మొక్కులను తీర్చుకున్నారు. కాగా స్థానికంగా అనంతచారి దంపతులు పోచమ్ము, ముత్యాలమ్మ గ్రామ దేవతలకు మకర తోరణాలను సమర్పించి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. అలాగే భక్తులు డప్పుల మోతలతో, పోతరాజుల విన్యాసాలతో మహిళలు ఊరేగింపుగా అమ్మవారి గుడికి వెళ్లి పూజలు చేసి, నైవేథ్యాలను సమర్పించారు.
జిల్లెలగూడ ఆలయంలో ‘కోలన్’ ప్రత్యేక పూజలు
బాలాపూర్: బాలాపూర్ మండలం జిల్లెలగూడ గ్రామంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకుడు, సింగిల్ విండో మాజీ చైర్మన్ కోలన్ శంకర్‌రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. శంకర్‌రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి దయతో వర్షాలు సమృద్ధిగా పడి, రైతులు, కార్మికులు, అన్ని రంగాలకు చెందిన ప్రజలు సుఖ సంతోషలతో బాగుండాలని అన్నారు. అనంతరం శంకర్‌రెడ్డిని జిల్లెలగూడ బిజెపి నాయకులు శాలువతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లెలగూడ బిజెపి అధ్యక్షడు బి.నర్సింహ యాదవ్, గాజుల మధు, సోమేశ్వర్, శ్రావణ్ పాల్గొన్నారు.
అమ్మవారి సేవలో శూరకర్ణ రెడ్డి
అల్మాస్‌గూడ తిరుమల నగర్ కాలనీలో ఆదివారం నిర్వహించిన బోనాల పండుగ ఉత్సవాలకు రంగారెడ్డి జిల్లా బిజెవైఎం నాయకుడు రామిడి శూరకర్ణరెడ్డి హజరై ప్రత్యేక పూజలు చేశారు. శూరకర్ణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో బోనాల పండుగను ప్రతి ఒక్కరూ ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. అమ్మవారి కృపతో ప్రతి ఒక్కరూ చల్లాంగా ఉండాలని ఆకాక్షించారు.