హైదరాబాద్

మత్తు పదార్ధాల వాడకం ఆరోగ్యానికి హానికరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: ప్రస్తుత కాలంలో జంటనగరాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ (మత్తు పదార్ధాలు) వాడకంపై ఆదివారం స్లేట్ స్కూలు బాలబాలికలు ప్ల కార్డులతో ట్యాంక్‌బండ్‌పై నిరసన తెలిపారు. సెల్‌ఫోన్‌లలో అసభ్యకర అంశాలు చూడటంతో బాలబాలికలు తోటి బాలలపై ఏవిధంగా ప్రభావితమవుతారో తద్వారా జరిగే నష్టాలు ప్రజలలో అవగాహన కల్పించడానికి ఈ ప్రయత్నం చేపట్టామని స్లేట్ విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి అమరనాథ్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల పిల్లలు కూడా స్మార్ట్ఫోన్‌లు వాడుతూ గన్‌తో వున్న బొమ్మలతో ఆడటం అలవాటు చేసుకుంటున్నారని, దీనివల్ల చిన్నతనం నుండే వారి హృదయాల్లో కాల్పులు జరిపే ఆలోచనలు రావడం తద్వారా పెద్దవారైన తరువాత ఆ కల్చర్ అలవాటుపడే ప్రమాదం ఉందని అన్నారు. ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు చూడగలిగే సినిమాలు కరువైనాయి. బాహుబలి వంటి సినిమాల్లోని మంచి కంటే చెడు ఎక్కువ ప్రభావితమవుతోందని అన్నారు. బాలలను, యువతను జాగృతం చేయడానికి నగరంలో 18 స్థావరాలల్లో స్లేట్ స్కూలు బాలలతో ‘హాపి హైదరాబాద్’ పేరుతో ప్ల కార్డులతో డ్రగ్స్ వాడకాన్ని నిర్మూలిద్దామనేదే తమ ప్రయత్నమని వాసిరెడ్డి అమర్‌నాథ్ అన్నారు. కార్యక్రమంలో 1500 మంది బాలబాలికలు పాల్గొన్నారు.