హైదరాబాద్

అన్నమయ్య కీర్తనలకు ప్రతిరూపం శోభరాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 16: అన్నమాచార్య కీర్తనలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పద్మశ్రీ డా. శోభారాజును ఘనంగా సత్కరించి ఆదివారం సాయంత్రం రవీంద్రభారతిలో పి.సూర్యకాంతం స్మారక పురస్కారాన్ని ప్రదానం చేశారు. కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు కెవి రమణాచారి శాలువాతో ఘనంగా శోభారాజును సత్కరించి పురస్కారం ప్రదానం చేశారు. అమ్మపై ఉన్న అభిమానంతో డా. పి. వెంకటరామశాస్ర్తీ ఏర్పాటుచేసిన పురస్కారానికి రమణాచారి అభినందనలు తెలిపారు. లలిత గీతాల శిక్షణతో వందలాది శిష్యులను తయారుచేసిన రామాచారిని అభినందించారు. కార్యక్రమానికి టివి చానల్ సిఇఓ డా. ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించారు. డా. పి. వెంకటరామశాస్ర్తీ మాట్లాడుతూ తన తల్లిపై వున్న ప్రేమను వ్యక్తం చేశారు. రామాచారి శిష్యులు ‘అమ్మ - అన్నమయ్య’ పాటలను గానం చేశారు. కినె్నర రఘురామ్ స్వాగతం పలికారు.
మానవత్వానికి పట్టంకట్టిన సినారె
హైదరాబాద్, జూలై 16: ‘మాలయే మహామంత్రమైతే నే పూలమాలనవుతాను’ అనడమే కాకుండా ‘గాలికే కులమేది...’ అంటూ సినీ గీతాన్ని వ్రాసిన డాక్టర్ సి.నారాయణరెడ్డి అన్ని శక్తుల కంటే మానవత్వం గొప్పదని తన సాహిత్యంలో వ్రాసారని సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతి శాఖ, తెలంగాణ రచయితల సంఘం ఆదివారం మధ్యాహ్నం రవీంద్రభారతిలో ‘మహాకవి సినారె సాహిత్య సమాలోచన’ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నంది సిదారెడ్డి సినారె సాహిత్యాన్ని కొనియాడారు. సాంస్కృతి శాఖ సంచాలకు మామిడి హరికృష్ణ అధ్యక్షత వహించగా, కవి పరమాత్మ, తెరసం కార్యదర్శి వి.శంకర్, విమర్శకులు పెన్నా శివరామకృష్ణ, బాల శ్రీనివాస మూర్తి, జి.లక్ష్మణ్‌రావు, నాళేశ్వరం శంకర్, ఎం.నారాయణశర్మ, థింసా తదితరులు సదస్సులో పాల్గొన్నారు. సంగీతాలు, సాహిత్య విలువలు అనే అంశంపై దేశపతి శ్రీనివాస్ ప్రసంగించారు.