రివ్యూ

మెరుపులేని.. మణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* బాగోలేదు * శమంతకమణి

తారాగణం: నారా రోహిత్, సుధీర్‌బాబు, ఆది సాయికుమార్, సందీప్‌కిషన్, రాజేంద్రప్రసాద్, చాందినీ చౌదరి, అనన్య సోని, జెన్నీ హనీ, రఘు, సుమన్, హేమ, సురేఖావాణి, తనికెళ్ల భరణి, ఇంద్రజ, జీవా.
సంగీతం:మణిశర్మ
నిర్మాత:వి.ఆనంద్ ప్రసాద్
స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరామ్ ఆదిత్య.టి

*
ఐదు కోట్లు విలువ కట్టిన పాతకాలం రోల్స్ రాయిస్ కారు -శమంతకమణి. సింగిల్ పాయంట్ చుట్టూ చిత్రాన్ని నడపడానికి దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య శక్తివంచన లేకుండా కృషిచేసినా, తెరపై ఆవిష్కృతమైన రీతిలో అంతగా ప్రతిఫలించలేదు. అరుదైన కార్ల వేలంలో అత్యంత ప్రాచీనమైన రోల్స్‌రాయిల్ కారు శమంతకమణిని అయిదు కోట్ల రూపాయలు వెచ్చించి వ్యాపారవేత్త జగన్నాధం (సుమన్) గెలుచుకుంటాడు. బర్త్‌డే పార్టీ కోసం వాళ్లబ్బాయి కృష్ణ (సుధీర్‌బాబు) పోలీటెల్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లిన సమయంలో కారు చోరీకి గురవుతుంది. శమంతకమణిని ఎవరు తస్కరించారు? దొంగలు దొరికారా? చివరకు ఏమైంది? అన్నది అసలు కథ.
‘లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలిష్టం’ అని ఓ సందర్భంలో దర్శకుడు చెప్పుకున్న కానె్సప్టుని మరీ విస్తృతపర్చారనిపిస్తుంది. ఇందులో పరిచయం చేసిన దాదాపు నాలుగు పాత్రలూ (ఒక్క సర్కిల్ ఇన్స్‌పెక్టర్ రంజిత్‌కుమార్ (నారారోహిత్) పాత్ర తప్ప మిగతావన్నీ యాజ్ ఫర్ లైఫ్ రీతిలో సాధారణంగా సాగేవే) మంచి దృక్పథంతో ఉన్నవే. కానీ ఏర్పడిన పరిస్థితులూ, అవకాశం రీత్యా దొంగతనానికి పాల్పడతారు. శివ (సందీప్‌కిషన్) కారు సీటు లోపల పెట్టిన నోట్ల కట్టలు దొంగిలిస్తాడు. కార్తీక్ (ఆది సాయికుమార్) కారు తాళం చెవి దొంగిలిస్తాడు. అందులో అతను అమెరికాకు ఎగిరిపోయే రీతి సంపదను కలగచేసే అతి విలువైన వజ్రం ఉంటుంది. వీళ్లతోపాటే పరిచయమైన కారు మెకానిక్ ఉమామహేశ్వరరావు (రాజేంద్రప్రసాద్) అందులోని వజ్రాల సంచీ కొట్టేస్తాడు. పోనీ మానవ స్వభావంకొద్దీ అవి వాళ్లు ఆ సమయానికి ప్రలోభపడి తమపరం చేసుకున్నా, విషయం తెలిసిన తర్వాతైనా వాటిని ప్రభుత్వపరం చేసినట్లు చూపితే బాగుండేది. అసలు ఆ కారు దొంగిలింపు సన్నివేశ సృష్టిని దాని యజమాని తన నల్లధనం వదిలించుకోవడానికి చేసిన పని కనుక దాన్ని ప్రభుత్వపరమే చెయ్యాల్సి వస్తుంది. కానీ కార్తీక్, శివ, ఉమామహేశ్వరరావుల విషయంలో అది జరిగినట్లు చూపలేదు. ఇవన్నీ ‘లార్జర్ దేన్ లైఫ్’ ఖాతాలో వేస్తానంటే సమంజసం కాదు. అందులోనూ నలుగురు హీరోలు కలిసి నటించారంటూ సినిమాకు ప్రచారం జరిగింది కనుక ఇలాంటి ప్రధాన విషయాల పట్టించుకుతీరాలి. ఒక పోలీసుధికారికీ తప్పుడు మార్గంలో నడిచినందుకు ఏసిబి బారిన పడ్డట్లు చూపి ప్రేక్షకుణ్ణి కాస్తంత తెరిపిన పడేటట్లు చేశారు. ఆ పాత్ర విషయంలో కూడా కొన్ని సన్నివేశాలు అసహజంగా చిత్రీకరించారు. ఉదాహరణకు పోలీసు స్టేషన్‌లో డిపాజిట్ అయ్యే వివిధ వాహనాలను అడ్డగోలుగా అక్కడి సర్కిల్ ఇన్స్‌పెక్టర్ సెకెండ్‌హేండ్ మార్కెట్‌కు తరలించేయడం. వాస్తవానికి అలా ఆ స్థాయి విచ్చలవిడి ఎక్కడా జరగదు. అలాగే ఉద్యోగస్థుడు ఎంత అవినీతిపరుడైనా, ఇందులోని పోలీసు అధికారిలా ‘ఇలా ఎంతకాలం, పెద్దదే పట్టాలి, లైఫ్ సెటిలైపోవాలి’ అన్న ఏకసూత్ర లక్ష్యంతో ఉండడు. ఇలాంటి కీలక అపసవ్యతలపట్ల కళ్లు మూసుకుని మిగతా విషయాలు చూస్తే- పెర్‌ఫార్మెన్స్ ప్రకారం దాదాపు హీరోలు నలుగురూ బాగానే చేశారు. అయితే కార్తీక్ పాత్రని మలచడంలో దర్శకుడికి క్లారిటీ మిస్సైంది. రాజేంద్రప్రసాద్ తన మార్కు నటనని ఇందులో మరోసారి ప్రదర్శించాడు. ముఖ్యంగా ‘మన కుర్రాళ్లందరికీ ప్రేమ విషయంలోనే చిక్కులు’ అన్నప్పుడు ‘నువ్వూ కుర్రావడివేనా?’ అన్న భావనతోనే సందీప్‌కిషన్, ఆదిలు చూసినపుడు, దానికి ప్రతిగా రాజేంద్రప్రసాద్ ఇచ్చిన భావ ప్రకటన బాగా పండింది. వీళ్లందరికన్నా ముందుగా చెప్పుకోవాల్సింది పోలీసు పాత్ర ధరించిన రఘుని. పాత్రకిచ్చిన పంచ్‌లతో చక్కగా ఆకట్టుకున్నాడు. తనికెళ్లభరణి, సుమన్, చాలాకాలానికి తిరిగి కనపడిన ఇంద్రజ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. నలుగురు హీరోలన్నాం కదా అని వాళ్లకి హీరోయిన్లు, డ్యూయెట్స్ అంటూ గందరగోళం చేసే ప్రయత్నం ఇందులో లేకపోవడం చెప్పుకోదగ్గ అంశం. కార్తీక్, శివ పాత్రల ప్రేమాయణం కూడా అపరిపక్వ దశలోనే ఆగిపోతాయి. ‘కారు విషయం ఏమన్నా తెలిసిందా?’ అని కృష్ణ అడిగితే ‘నువ్ పోగొట్టుకున్నావని మాత్రం తెలిసింది’ అని పోలీసు పాత్ర బదులిచ్చిన డైలాగ్ బాగా పేలింది. అదేవిధంగా పాత్రధారణ చేసిన నటులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాగా పండాయి. నీ వయసేమిటి? ఈ విగ్గేమిటీ? రంగేమిటి? అని రాజేంద్రప్రసాద్ పాత్రనుద్దేశించి చేసిన వ్యాఖ్య, ఇంకో సందర్భంలో ‘అందరికీ మహేష్‌బాబులే కావాలంటే సందీప్ కిషన్‌లాంటి వాళ్లేమవుతారు? (ఈ డైలాగ్‌ని సినిమాలో సందీప్‌కిషన్‌తోనే అనిపిస్తారు) లాంటివి ఇందుకు ఉదాహరణలు. అలాగే ‘సూటుకి సూటుకాని ఫేసు నీది’ అన్న పంచూ థియేటర్‌లో బాగా రిసీవైంది. పాటల పరంగా మణిశర్మకిందులో పని తక్కువ (ఉన్నదొక్క పాటే). కానీ నేపథ్య సంగీత రూపంలో వైవిధ్యతను చూపారు. ఎటునుంచి ఎటు చూసినా చిత్రానికిచ్చిన ప్రచార స్థాయిలో ‘శమంతకమణి’ మెరవలేదనడం మాత్రం వాస్తవం.

-అనే్వషి