నల్గొండ

అంతర్జాతీయ ఫుట్‌బాల్ పోటీలో దేవరకొండవాసి ప్రతిభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, జూలై 17: నేపాల్ దేశంలోని పోఖ్రాలో గత నెల 21వ తేదీ నుండి 25 వ తేదీ వరకు జరిగిన అంతర్జాతీయస్ధాయి ఫుట్‌బాల్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దేవరకొండ పట్టణానికి చెందిన అమరోజు సంతోష్‌కుమార్‌ను సోమవారం స్ధానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అభినందించారు. దేవరకొండ పట్టణంలోని ఇస్లాంపురలో నివాసం ఉండే సంతోష్‌కుమార్ చిన్ననాటి నుండి డిగ్రీ వరకు దేవరకొండ పట్టణంలోనే చదివాడు. దేవరకొండ పట్టణానికి చెందిన సంతోష్‌కుమార్ స్వశక్తితో ఫుట్‌బాల్ క్రీడలో అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారునిగా ఎదగడం అభినందనీయం అన్నారు. పోఖ్రాలో జరిగిన ఫుట్‌బాల్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి సంతోష్‌కుమార్ సిల్వర్ మెడల్‌ను సాధించడం గర్వించదగ్గ విషయం అన్నారు. ఈ సందర్భంగా సంతోష్‌కుమార్ మాట్లాడుతూ ఫుట్‌బాల్ క్రీడలో అంతర్జాతీయ స్ధాయి క్రీడాకారునిగా ఎదగడానికి తనకు శిక్షణను ఇచ్చిన పిడి జె పుల్లయ్యకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఆర్ధికసాయం అందిస్తే ఫుట్‌బాల్ క్రీడలో మరింత రాణించి దేశానికి మరింత గుర్తింపు తీసుకొస్తానని అన్నారు. సంతోష్ అంతర్జాతీయస్ధాయి ఫుట్‌బాల్‌లో సిల్వర్‌మెడల్ సాధించినందుకు అతని స్నేహితులు జహీర్‌బాబా, కిరణ్, ప్రభు, గిరి, జబ్బార్, మధు హర్షం వ్యక్తం చేశారు.