నల్గొండ

ఎడతెరపి లేని వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 17: అల్పపీడన ప్రభావంతో నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సోమవారం తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కూడా వర్షాలు కురిశాయి. రోజంతా ఎడతెరపి లేకుండా ముసురు వర్షాలు పడటంతో రోజువారి పనులకు వెళ్లేవారు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాజా వర్షాలు పత్తి, కంది, ఆముదం వంటి మెట్ట పంటలకు ఉపయోగంగా ఉండగా రైతాంగం కలుపు పనులు తీసే పనులను ముమ్మరం చేశారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, భువనగిరి, చౌటుప్పల్ డివిజన్లల్లో ముసురు వర్షాలు రోజంతా ఎడతెరపి లేకుండా కురిశాయి. యాదగిరిగుట్ట, చౌటుప్పల్, వలిగొండ, ఆలేరు, మునగాల, మోత్కూర్, నార్కట్‌పల్లి, కనగల్, హాలియా, చింతపల్లి, పిఏపల్లి, మర్రిగూడ, చండూర్, నాంపల్లి, చిట్యాల తదితర మండలాల్లో సైతం ముసురు వర్షాల జోరు కొనసాగింది. ప్రభుత్వం సోమవారం బోనాల పండుగ సెలవు ఇవ్వడంతో విద్యార్థులకు ముసురు వర్షాల బెడద తప్పింది. అయితే రాత్రి కూడా ముసురు వర్షాల పడుతునే ఉండటంతో నేడు మంగళవారం కూడా ఈ వర్షాల జోరు కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది.
2.4మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదు
జిల్లాలో సోమవారం 2.4మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 73.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదవ్వగా నల్లగొండ డివిజన్‌లో 44.6, మిర్యాలగూడ డివిజన్‌లో 9.8, దేవరకొండ డివిజన్‌లో 19.2 మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. నార్కట్‌పల్లిలో 7.4మిల్లిమీటర్లు, శాలిగౌరారంలో 6.8, కేతపల్లిలో 6, మునుగోడులో 5.2, చండూర్‌లో 5.0, మిర్యాలగూడలో 5.4, మర్రిగూడలో 3.8, నల్లగొండలో 2.6మిల్లిమీటర్ల వర్షాపాతం నమోదైంది. మంగళవారం జిల్లా వ్యాప్తంగా మరింత అధిక వర్షాపాతం నమోదయ్యే అవకాశముంది.
చిరు జల్లులతో అలరిస్తున్న ప్రకృతి
కనగల్, జూలై 17: చిరుజల్లులతో వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారగా వర్షాకాలంలో ప్రకృతి పచ్చదనంతో కనువిందు చేస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో పక్షులు, చిరుప్రాణులు ప్రకృతి ఒడిలో సందడి చేస్తున్న దృశ్యాలు ప్రకృతి ప్రేమికులను, చూపరులను ఆకర్షిస్తున్నాయి. పూల మకరందాన్ని ఆరగించే సీతాకోక చిలుకల పరవశం, మట్టి సువాసనలను రుచి చవిచూసే సీతాకోక చిలుకల వైనం, చెట్లపై రామచిలకల జంటల సయ్యాటలు, పూల పుప్పొడికై గండు చీమల ప్రయత్నాలు, నింగి నుండి జాలువారిన వాన చిలుకులతో తడిసిన పుడమిపై నత్త నడకల వయ్యారాలు ప్రస్తుతం వర్షాకాలంలో ప్రకృతి రమణీయతకు అద్దం పడుతు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. చెరువులు, కాలువల్లో నీటి ప్రవాహాల్లో కొత్త నీటిలో ఎగిరే చేపల గంతుల దృశ్యాలు మరింత ఆకర్షణీయం. ఇలా వర్షాకాలంలో ప్రకృతి..ప్రాణులు పరవశిస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కితే వీక్షకులకు మరింత కనువిందుగా మారింది.