నల్గొండ

అభివృద్ధిపై చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 17: టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో జరిగిన అభివృద్దిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, అధికార పార్టీ నేతలకు దైర్యం ఉంటే చర్చకు రావాలని మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి సవాల్ విసిరారు. జిల్లాకేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలను అమలుచేయడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఘెరంగా విఫలమైందని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూపంపిణీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలమయ్యారన్నారు. రైతులకు నేటి రుణాలు మాఫీ కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆర్భాటంగా ఏర్పాటుచేసిన గురుకులాల్లో సరైన వసతులు లేక విద్యార్ధులు ఇబ్బందుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ఉద్యమంలో పాల్గొన వారిలో ఎంతమందికి పదవులు ఇచ్చారో చెప్పాలన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన వారిని పార్టీలో చేర్చుకొని అందలం ఎక్కించారని విమర్శించారు. హరితహారం మంచి కార్యక్రమమే అయిన ప్రభుత్వం ఆర్భాటానికే పరిమితమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటారో, ఎంత ఖర్చు చేశారో ప్రభుత్వం హరితహారంపై శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తాము ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ ఏ ప్రభుత్వ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదని, జాతియ నాయకుల జయంతులు, వర్థంతుల కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించకుండా పార్టీ కార్యక్రమాలుగా చేపడుతున్నారని ఆరోపించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పక్కన బెట్టి కాంట్రాక్టర్‌ల ప్రయోజనాల కోసమే పనిచేస్తుందని విమర్శించారు. నేడు గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లు, ఇతర పనులు నాసిరకంగా ఉంటున్న ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. కెసిఆర్ మయామాటాలను ప్రజలు నమ్మడం లేదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, చకిలం రాజేశ్వర్‌రావు, బైరు వెంకన్నగౌడ్, అంగిరేకుల నాగార్జున, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్ధుల్ రహీం, యూత్‌కాంగ్రెస్ నల్లగొండ పార్లమెంట్ అధ్యక్షుడు కుమ్మరికుంట్ల వేణుగోపాల్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఈద ప్రవీణ్, నాయకులు బంటు చొక్కయ్య తదితరులు పాల్గొన్నారు.