విజయవాడ

మాస్టర్‌ప్లాన్ సమగ్ర అధ్యయనానికి నాలుగు రోజుల వర్క్‌షాప్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 17: అమరావతి రాజధాని నగర మాస్టర్ ప్లాన్ సమగ్ర అధ్యయనానికి నాలుగు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్ సోమవారం సిఆర్‌డిఎ కార్యాలయంలో ప్రారంభమైంది. ఏపి సిఆర్‌డిఏ ప్లానింగ్ అండ్ ఇన్‌ఫ్రా అధికారులు, ఏపి సిఆర్‌డిఏ కన్సల్టెంట్లయిన ఆర్వీ అసోసియేట్స్, సిహెచ్ 2 ఎం ప్రతినిధులు, ఏడిసి అధికారులు, సింగపూర్‌కు చెందిన సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్ (సిఎల్‌సి) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూతెంగ్చీ నేతృత్వంలోని 15 మంది ప్రతినిధుల బృందం పాల్గొనడం జరిగింది. వర్క్‌షాప్‌లో తొలి రోజు ఎపి సిఆర్‌డిఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీ్ధర్ ప్రారంభోపన్యాసం చేశారు. వర్క్‌షాప్‌లో పాల్గొంటున్న ప్రతినిధులంతా చురుగ్గా చర్చలు జరపాలని, గ్రూప్ చర్చలతో ఫలవంతమైన పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను వర్క్‌షాప్‌లో సమగ్రంగా చర్చించి తగిన పరిష్కార మార్గాలు కనుగొనాలన్నారు. సింగపూర్ అనుభవాలను తెలుసుకుని, వాటిలో లోపాలు పునావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డిటెయిల్డ్ మాస్టర్ ప్లాన్, ఇన్‌ఫ్రా మాస్టర్ ప్లాన్ రూపకల్పన తయారీలో జాగ్రత్తలు తీసుకునేందుకు ప్రధానంగా ఈ వర్క్‌షాప్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా రంగాల్లో నిపుణులతో ఎపి సిఆర్‌డిఎ ప్లానింగ్, ఇన్‌ఫ్రా విభాగాలకు చెందిన 55 మంది ప్రతినిధులు, ఏడిసి ప్రతినిధులు ఈ వర్క్‌షాప్‌లో వివిధ అంశాలపై చర్చించడం జరుగుతోంది. సింగపూర్ సిఎల్‌సి నిపుణులతో అన్ని అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయడం జరుగుతోంది. నీటి సరఫరా, వేస్ట్‌వాటర్, స్ట్రామ్ వాటర్, వరద నిర్వహణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ట్రాన్స్‌పోర్టేషన్ నిపుణులు ఈ వర్క్‌షాప్‌లో తమ అనుభవాలను పంచుకోవడం జరుగుతోంది. సింగపూర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అమరావతికి ఏ విధంగా అనువైనవనే అంశాలపై లోతుగా అధ్యయనం చేయడం జరుగుతోంది. వర్క్‌షాప్‌లో మాస్టర్‌ప్లాన్ పై డిటెయిల్డ్ స్టడీ చేయడం జరుగుతోంది. వర్క్‌షాప్‌లో ఏపి సిఆర్‌డిఏ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్ రామకృష్ణారావు, ప్రొక్యూర్‌మెంట్ అడిషనల్ డైరెక్టర్ టి ఆంజనేయులు, సీఈ కె రాజేంద్రప్రసాద్, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌ఆర్ అరవింద్, ఇన్‌ఫ్రా ప్రిన్సిపల్ ప్లానర్ ఎన్‌విఆర్‌కె ప్రసాద్, ఏడిసి ఇన్‌ఫ్రా హెడ్ డాక్టర్ కె గణేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.