విజయవాడ

చిత్తడిగా మారిన నగరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంద్రకీలాద్రి, జూలై 17: నిరంతరా యంగా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం చిత్తడిగా మారడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. కొద్ది రోజులుగా నిత్యం వర్షం కురుస్తుండ టంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయ మయ్యాయ. దీనికితోడు వీధుల్లో మరమ్మతులకు తవ్వి ఒదిలేసిన గోతిలో వర్షపు నీళ్లు నిల్చిపోవటంతో రోడ్లపై ని త్యం ట్రాఫిక్ సమస్య విలయతాండ వం చేస్తోంది. సూర్యారావుపేట, నక్కల రోడ్, పుష్పా హోటల్, తదితర సెంటర్లలో ఆసుపత్రులు ఉన్నాయి. విజయా టాకీస్ ఎదుట రోడ్‌లో వర్షపునీళ్లు నిల వటంతో సోమవారం ఉదయం వాహనాలు నిల్చిపోయ సుమారు 2గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. ఈ రోడ్‌కు అనుబంధంగా ఉన్న 5 రోడ్లలో 2 రోడ్లు నిర్మాణంలో ఉండగా మిగిలిన 3 రోడ్లు గతుకులమయంగా ఉండటంతో ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ నీళ్లు ని ల్చిపోయాయో అర్థంకాక వాహనదా రులు నానా అగచాట్లు పడ్డారు. పుష్ప హోటల్ పల్లపు ప్రాంతంలో కూడా దా దాపు ఇదే పరిస్థితి నెలకొంది. బెం జిసర్కిల్‌లోని జ్యోతి మహల్ వెనుక ఉన్న ఫకీర్‌గూడెంలో పలుచోట్ల నీళ్లు నిల్చిపోవటంతో స్థానికులు నానా అవస్థలు పడ్డారు. మహాత్మాగాంధీ రోడ్‌లో ని స్వరాజ్ మైదానం పక్కనే ఉన్న రైతు బజారు వెనుక గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు వీలులేని పరిస్థితి నెలకొం ది. గేట్ ప్రారంభంలోనే మట్టి రోడ్ మొత్తం చిత్తడిగా మారటంతో రోడ్ ఉందో, లేదా గొయ్యి ఉందో అర్థం కా నీ పరిస్థితి. దీంతో కూరగాయల కొనుగోలుకు వచ్చే వినియోగదారులు, రైతు లు, వ్యాపారస్థులు నానా ఇబ్బందులు పడ్డారు. లోబ్రిడ్జిలో వర్షపు నీళ్లు నిల్చి పోవటంతో వాహనాలు ఆగి ముందు కు కదలని పరిస్థితి ఏర్పడింది. దీంతో ద్విచక్ర వాహనదారులు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై నుంచి వాహనాల రాకపోకలు సాగిస్తు న్నారు. అటువైపు కూడా ట్రాఫిక్ జామ్ అయతే పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థక మైంది. టూటౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్న ఆంజనేయవాగు సెంటర్ ముం దున్న రోడ్ మొత్తం గతుకులమయం కావటంతో చిన్నపాటి వర్షానికే కొం డపై నుంచి వర్షపునీళ్ళు రోడ్‌పై నిల్చి పోవటంతో రాకపోకలు సాగించే వా హనదారులు నానా అవస్థలు పడుతున్నారు. గట్టు వెనుక కబేళా సెంటర్, ఊర్మిళానగర్, రామానగర్ ప్రాంతాల్లో ని పల్లపు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్చి పోవటంతో స్థానికులు ఆందోళన వ్య క్తం చేస్తున్నారు. ఇప్పటికే నగర వాసు లు అనారోగ్యాలకు గురై నానా అవస్థ లు పడుతున్నారు. ఈనేపథ్యంలో వర్షపునీళ్లు నిల్చిపోవటంతో ఎప్పుడు ఎ లాంటి వ్యాధులకు గురికావాల్సి వ స్తోందోననే భయం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నగర పాలక సంస్థ అధికారులు పల్లపు ప్రాంతాల్లో ని నీళ్లను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని నగరవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.