విజయవాడ

279 జీవోపై చర్చలు అసంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: మున్సిపల్ కార్మికులను బానిసలుగా మార్చే 279 జీవో టెండర్ల రద్దు డిమాండ్లపై సోమవారం వెలగపూడి సచివాలయంలో జెఎసితో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మరో దఫా చర్చలు జరపాలని ఉభయులు అంగీకారానికి వచ్చారు. చర్చల్లో ప్రభుత్వం నుండి ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్ కరికాల వలవన్, డిఎంఎ కె కన్నబాబు పాల్గొన్నారు. జెఎసి ప్రతినిధులుగా సిఐటియు నుండి కె ఉమామహేశ్వరరావు, పి వెంకటరెడ్డి, కె సామ్రాజ్యం, జి సుబ్బారావు, పి రామచంద్రరావు, యం డేవిడ్, ఎఐటియుసి నుండి ఆకుల రంగనాయకులు, బి తులసేంద్ర, ఐఎన్‌టియుసి నుండి వైవి రమణ, ఎంవి నారాయణ, స్వతంత్ర సంఘాల నుండి ఇ మధుబాబు, ఎస్ శంకర్‌రావు, శ్రీనివాసు, సుధీర్, రామ్‌దాసు పాల్గొన్నారు. చర్చల్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ రాబోయే కాలంలో అన్ని డిపార్ట్‌మెంట్లలో వర్కర్స్ ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసి వర్క్ ఔట్‌సోర్సింగ్‌ను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. దీనిపై జెఎసి ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్క్ ఔట్‌సోర్సింగ్ విధానం వలన కార్మికులకు ఉపాధి భద్రత లేకుండా పోతుందని కాంట్రాక్టర్ల లాభాల కోసం ప్రజల మీద భారాలు మోపడం సరికాదని ప్రతినిధులు వాదించారు. 279 జిఓలో రాష్ట్రంలో 25 ఏళ్లుగా పని చేస్తున్న మున్సిపల్ కార్మికులకు ఉపాధి ప్రమాదంలో పడుతుందని, జీతభత్యాలు గ్యారెంటీ లేకుండా పోతాయని, 50 ఏళ్లు నిండిన ఉద్యోగులను తొలగించే ప్రయత్నం ఉందని జెఎసి ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికులందరికి 10వ పిఆర్‌సి ప్రకారం వేతనాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని జెఎసి ప్రతినిధులు ఆర్థికశాఖ మంత్రిని నిలదీశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చెయ్యడానికి ఈ ప్రభుత్వం పూనుకోవడం లేదని జెఎసి ప్రతినిధులు విమర్శించగా ఆ తీర్పు కాపీని యూనియన్ నాయకులు మాకు అందజేస్తే దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఆర్థికమంత్రి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీస్కెల్డ్ జీతాల అమలు మున్సిపల్ స్కూల్ స్వీపర్స్‌కు 193 జిఓ ప్రకారం 4,000 వేతన అమలు, పుల్ టైం కంటింజెంట్ వర్కర్స్‌గా గుర్తించాలని జెఎసి ప్రతినిధి వర్గం మంత్రులను కోరింది. అయితే 279 జిఓ మీద ప్రభుత్వం, జెఎసి ప్రతినిధులకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మరోధపా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు మరోధపా చర్చలు జరిగేవరకు కొత్త టెండర్లు పిలవడం గానీ, ఇప్పటికే పిలిచిన టెండర్లను ఓపెన్ చెయ్యమని మున్సిపల్ ముఖ్యకార్యదర్శి కరికాలే వలవన్ జెఎసి ప్రతినిధులకు హామీ ఇచ్చారు.