ప్రకాశం

మోదీ విదేశీ పర్యటన వలన దేశానికి ఉపయోగం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 17: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జరుపుతున్న విదేశీపర్యటనల వలన దేశానికి పెద్దగా ప్రయోజనం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయంలోని సమావేశమందిరంలో సిపిఐ రాష్టస్రమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈ సమావేశానికి విచ్చేసిన నారాయణ విలేఖర్లతో మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుండి నేటివరకు విదేశీపర్యటనలు ముమ్మరంగా చేస్తున్నారని దీనివలన దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారని ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్,మోదిలు ఒకరినొకరు పొగుడుకుంటూ పేపర్లల్లో మంచి హవభావాలతో ఫోజులిచ్చారని ఆయన ఎద్దెవా చేశారు. అమెరికాతో ఆర్ధికపరమైన లాభం ఈ పర్యటన వలన ఏమైనా మనదేశానికి కలిగిందా అంటే అది ఏమిలేదని ఆయన ఆరోపించారు. అమెరికా వద్ద వంద విమానాలు కొనుగోలు చేసే ఒప్పందానికి సంబంధించిన అగ్రిమెంటును మోదీ చేసుకోవటం జరిగిందని ఈ అగ్రిమెంటు వలన అమెరికాకు ఉపయోగమే కాని భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పాకిస్థాన్‌ను తీవ్రవాదానికి అనుకులంగా వ్యవహరిస్తుందన్నారు. అయితే ట్రంప్ మాత్రం ఎక్కడ కూడా తన ప్రస్తావనలో పాకిస్థాన్ తీవ్రవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు ఖండించటం లేదని ఆయన ఆరోపించారు. అమెరికాకంటే చైనాతోటే మంచి సంబంధాలు మన దేశం పెట్టుకోవటం మంచిది ఆయన సలహా ఇచ్చారు. చైనా, భారత్‌దేశం మధ్య సరిహద్దుల సమస్యలతో పాటు ఇతర సమస్యలు ఉన్నాయని, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. చైనాలో తయారైన వస్తువులు భారతదేశంలో తయారు అయ్యే వస్తువులు ఒకరికొకరు ఎగుమతులు,దిగుమతులు చేసుకోవటం వలన ఇరుదేశాలకు ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉంటాయన్నారు. పెద్దనోట్ల రద్దువిషయంలో బ్లాక్‌మనీ వైట్‌మనీగా మార్చుకునేందుకు కార్పొరేట్ శక్తులకు ఉపయోగకరంగా మారినట్లు ఆయన ఆరోపించారు. కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉపరాష్టప్రతికి పోటీలో ఉంటారని వార్తలు వస్తున్నాయని, మోదీ అనుకుంటే వెంకయ్యనాయుడు ఉపరాష్టప్రతి అవుతారని ఆయన జోస్యం చెప్పారు. తిరిగే కాలు, తిట్టే నోరు ఆగదని అయితే వెంకయ్యనాయుడు ఉపరాష్టప్రతి అయితే ప్రత్యక్ష రాజకీయాలతో సంబంధం ఉండదన్నారు. ఉపరాష్టప్రతి అయితే నోరు కట్టేసికోవాల్సి వస్తుందని ఇందుకు వెంకయ్య విముఖత చూపినప్పటికి మోది నిర్ణయం తీసుకుంటే తప్పక ఉపరాష్టప్రతి అవుతారన్నారు. బిజెపి దేశ అధ్యక్ష పదవిని కూడా కాషారుూకరణ చేస్తున్నట్లు తెలిపారు. దేశ రాష్టప్రతి, ఉపరాష్టప్రతులుగా బిజెపికి చెందిన అభ్యర్ధులు ఉంటే కాషాయికరణం బిల్లులే పాస్ అవుతాయని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌భగవత్ మూడువేలమందితో మేధావుల సభ పెట్టారని దేశవ్యాప్తంగా వారు అనుకున్న వ్యక్తులనే అన్నిచోట్ల జొప్పించి దేశాన్ని కాషారుూకరణ చేస్తున్నారని విమర్శించారు. రాష్టప్రతి ఎన్నికల విషయంలో తెలుగుదేశం, వైకాపాల రాజకీయ విధానం ఒక్కటేనన్నారు. పోటీలో ఉన్న రాష్టప్రతి అభ్యర్థి కోవింద్‌కు తెలుగుదేశంపార్టీ, వైకాపా అధినేతలు మద్దతు ప్రకటించారని దీన్ని బట్టిచూస్తే ఆరెండుపార్టీల రాజకీయ విధానం ఒక్కేటేనని ఇట్టే అర్ధవౌతుందన్నారు.విశాఖపట్నం భూముల విషయంలో తెలుగుదేశంపార్టీ, వైసిపినేతల ప్రమేయం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని ఈనేపధ్యంలో సిబిఐ, జ్యూడిషియల్ విచారణలను జరిపించి నిగ్గుతెల్చాలని ఆయన డిమాండ్ చేశారు. గోరక్షణ పేరుతో పౌరహక్కులను హరించేవేసేవిధంగా ఆర్‌ఎస్‌ఎస్ వాదులు చూస్తున్నారని ఈవిధానం మంచిదికాదని ఆయన హితవుపలికారు.