ప్రకాశం

అట్టడగు వర్గాలకు అండగా కేంద్ర పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్ళూరు,జూలై 17 : అట్టడగు వర్గాలకు అండగా కేంద్రప్రభుత్వపధకాలు ఉన్నాయని బిజెపి జాతీయమహిళా మోర్చా ఇన్‌చార్జీ దగ్గుబాటి పురంధ్రీశ్వరి అన్నారు. మండలంలోని లక్కవరం గ్రామంలో సోమవారం రాత్రి ఏడుగంటలప్రాంతంలో జిల్లాపార్టీ అధ్యక్షుడు పులికృష్ణారెడ్డి అధ్యక్షతన బహిరంగసభ నిర్వహించారు.ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పిఎం మోది భారతదేశాన్ని ప్రపంచదేశాలు గుర్తించేలా తీవ్రకృషిచేస్తున్నారన్నారు. గతంలో ఏడుకోట్లమంది మాత్రమే బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేవారని ప్రస్తుతం 29కోట్లమంది బ్యాంకింగ్ సేవలు వినియోగిస్తున్నారని తెలిపారు. పలుకేంద్రప్రభుత్వ పధకాలు, అంత్యోదయపధకం గురించి వివరించారు. గ్రామానికి చెందిన 40మందిని పార్టీకండవలు కప్పిపార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా స్వామి కృష్ణస్వామి ఆశ్రమంలో ప్రత్యేకపూజలు చేశారు. ఈకార్యక్రమంలో తాళ్ళూరు మండల అధ్యక్షుడు కోటేశ్వరరావు, రాష్టక్రార్యదర్శి మీనాకుమారి, మైనార్టీ ఎస్‌సిమోర్చా అధ్యక్షుడు ఖలీపాతుల్లాభాషా, ఏసన్న, జిల్లాప్రధానకార్యదర్శి ఏరువ లక్ష్మినారాయణరెడ్డి, కార్యదర్శి పిన్నినారాయణరెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జీ ఆంజనేయులు,కార్యవర్గ సభ్యులు వీరంరెడ్డి నాగిరెడ్డి, రామారావు పాల్గొన్నారు.