ప్రకాశం

కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జూలై 17:కార్పోరేట్‌శక్తులకు జిఎస్‌టి అనుకూలంగా మారిందని సిపిఐ జాతీయకార్యదర్శి కె నారాయణ విమర్శించారు. సోమవారం స్ధానిక సిపిఐ జిల్లాకార్యాలయంలోని సమావేశమందిరంలో సిపిఐ రాష్టస్రమితి సమావేశాలు సిపిఐ జిల్లాకార్యదర్శి కె అరుణ అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఈసమావేశానికి ముఖ్యఅతిధిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ వస్తుసేవలపన్ను (జిఎస్‌టి) రూపకల్పనలో అమెరికా పాలసీనే మోది అమలుచేసారని విమర్శించారు. జిఎస్‌టి వలన పేదలకు పన్నుభారం తగ్గేకంటే కార్పోరేట్‌శక్తులకే అనుకూలంగా ఉందని విమర్శించారు. జిఎస్‌టి వలన ఒక్కకార్పోరేట్ కంపెనీ అయిన నష్టపోయాడా అని ఆయన ప్రశ్నించారు. దేశం అంతటా అన్నిరకాల పదవులకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్రం భావిస్తుందని ఇది ఇబ్బందికరమైన సంఘటన అన్నారు. ఎక్కడైనా ఒక పదవీకి అనుకోని సంఘటనలో మద్యలో ఖాళీవస్తే ఐదుసంవత్సరాల వరకు మరల అక్కడ ఎన్నికలుజరగకపోతే పాలనకు ఆటంకం ఏర్పడే పరిస్ధితి ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల విషయంలో ప్రస్తుత విధానాన్ని కొనసాగించటం వలన పెద్దగా నష్టం లేదన్నారు. రాష్టప్రతి ఎన్నికల్లో సెక్యూలర్‌భావాలు కలిగిన అభ్యర్ధికి తమ మద్దతును ప్రకటించామన్నారు. భవిష్యత్తులో జరిగే దేశ, రాష్ట్ర ఎన్నికల్లో తమపార్టీ లెప్ట్‌ఒరియేంటేషన్‌కలిగినటువంటి విధానానికే కట్టుబడి ఉన్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో సిపిఐ పార్టీని బలోపేతం చేసేందుకు సిపిఐ నాయకులు,కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. పార్టీపరంగా నిర్మాణం చేసుకోకపోతే పార్టీని మనం బలోపేతంచేయలేమని కనుక సిపిఐ శాఖలను పటిష్టం చేయాలని ఆయన సూచించారు. కొత్తక్యాడర్‌ను పార్టీలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడికి సిపిఐ పార్టీమనది అనే భావనతో ముందుకు తీసుకుపోవాలని సూచించారు. ఈసందర్బంగా దేశ,రాష్టర్రాజకీయాల గురించి వివరించారు. సిపిఐ రాష్టక్రార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపితో టిడిపి పొత్తు ఉందన్నారు. అయితే బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు వైకాపా రాష్ట్రఅధినేత జగన్‌మోహన్‌రెడ్డి కూడా ఆరాటపడుతున్నారని ఎద్దెవచేశారు. బిజెపి ఆధ్వర్యంలో రాష్టప్రతిగా పోటీచేసిన కోవింద్‌కు జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు ఇవ్వటాన్ని చూస్తేనే బిజెపితోపాటు పొత్తుపెట్టుకునేందుకు ఆరాటపడుతున్నట్లు అర్ధవౌతుందన్నారు. విశాఖపట్నంలో భూముల విషయంలో టిడిపి మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుల మధ్య సమన్వయం లేదని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుకు పాలనపై పట్టుతగ్గిందన్నారు. మంత్రుల్లో కొంతమంది సమన్వయం కోల్పోయి మాట్లాడుతున్న ఏమి చేయలేని పరిస్ధితి అని అదేవిధంగాఅధికారులపై కూడా చంద్రబాబు పట్టుకోల్పోయరని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతుందని దేశంలో జాతీయపార్టీల పట్టుతగ్గి ప్రాంతీయపార్టీల పట్టుపెరుగుతుందన్నారు. ప్రజావ్యతిరేక విధానాలను సిపిఐ నాయకులు,కార్యకర్తలు వ్యతిరేకించాలని ఇందుకు ప్రజావ్యతిరేక కార్యకలపాలపై పోరాటాలకుసిద్దంకావాలని రామకృష్ణపిలుపునిచ్చారు. తొలుత సిపిఐ రాష్టస్రమితి సమావేశాల్లో కార్యదర్శినివేదికను ప్రవేశపెట్టారు. ఈసమావేశంలో సిపిఐ రాష్టన్రాయకులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.ఈసమావేశంలో ఇటీవల మృతిచెందిన పలువురికి సంతాపాన్ని తెలియచేశారు.