గుంటూరు

బైక్‌ను ఢీకొన్న లారీ, ఒకరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, జూలై 17: లారీ బైక్‌ను ఢీకొన్న సంఘటనలో ద్విచక్ర వాహనంపై వస్తున్న ఎర్రగుంట్ల ఇషాక్ (65) అక్కడికక్కడే మృతి చెందిన దుర్ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని నందిగామ అడ్డరోడ్డు వద్ద సోమవారం రాత్రి 9.20 గంటలకు జరిగింది. సత్తెనపల్లి రూరల్ ఎస్‌ఐ నజీర్ బేగ్ సమాచారం ప్రకారం కట్టావారిపాలెం గ్రామానికి ఒక శుభ కార్యక్రమానికి వెళ్లి తిరిగి స్వగ్రామమైన బృంగుబండ గ్రామానికి ద్విచక్ర వాహనంపై గోపయ్య, ఇషాక్‌లు వస్తున్నారు. నందిగామ అడ్డరోడ్డుకు రాగానే సత్తెనపల్లి నుండి గుంటూరు వైపు వేగంగా వెళుతున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. దీంతో ద్విచక్ర వాహనం పై కూర్చున్న ఇషాక్ కిందపడి అక్కడికక్కడే మృతి చెందగా గోపయ్య తీవ్ర గాయాలపాయ్యాడు. గాయాలపాలైన గోపయ్యను అక్కడి వారు సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ నజీర్ బేగ్ హుటాహుటిన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను ప్రత్యక్ష సాక్షులను అడిగి తెలుసుకున్నారు.