గుంటూరు

చిత్తడిగా మారిన ఆంధ్రాప్యారిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 17: గత రెండు రోజులుగా ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రాప్యారిస్ తెనాలి పట్టణంలోని ప్రధాన రహదార్లతో పాటుగా లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. స్థానిక బోస్‌రోడ్‌లోని రైతుబజారు రెండు అడుగుల మురుగు, వర్షపునీటి లోతులో మునిగిపోయింది. తుపాను ప్రభావంతో గత రెండు రోజులుగా డెల్టా ప్రాంతంలో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. పెద్దవర్షం లేకపోయినా చిలుజల్లులతో రహదార్లు చిత్తడిగామారి బాటసారులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరోవైపు ప్రకాశం రోడ్, నెహ్రూరోడ్, బోస్‌రోడ్, చినరావూరు పార్కురోడ్, సరోజినీ దేవీచౌక్, రైతుబజారు తదితర ప్రాంతాలలో వర్షపునీటితో పాటుగా డ్రైనేజీలు పొంగిపొర్లి మురికి కూపాలుగా మారాయి. లోతట్టు ప్రాంతాలు జలమయంగామారి గృహాలల్లోకి నీరు రావటంతో మహిళలు పలుఅవస్తలకు గురైయ్యారు. తెనాలి రూరల్, 1వ పట్టణ పోలీస్‌స్టేషన్లు, మున్సిఫికోర్టు, ట్రజరీ, తహశీల్దార్ కార్యాలయం, రిజిస్ట్రార్ కార్యాలయం, మీసేవా కేంద్రాలు, జిల్లా కోర్టు, ఆర్డీఓ కార్యాలయం, ఎంపిడిఓ కార్యాలయం, గృహ నిర్మాణశాఖ, పంచాయితీరాజ్ కార్యాలయాలకు వెళ్ళే రహదార్లు మురుగునీటితో మునిగిపోవటంతో ప్రజలతోపాటుగా వాహనచోదకులు, అధికారులు ఇబ్బందులు ఎదర్కొన్నారు. అలాగే ఇటీవలే రాష్ట్ర శాసనసభాపతి కోడెల, హోంమంత్రి చినరాజప్ప, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మరోమంత్రి కామినేని శ్రీనివాసరావు తదితరులు ప్రారంభించిన తెనాలి రామకృష్ణకవి ఆడిటోరియమ్ బయటి ఆవరణం కూడా వర్షపునీటితో తడిసిముద్దైంది. పరిసర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో తెనాలి పట్టణానికి వివిధ పనులు నిమిత్తం వచ్చివేళ్ళే గ్రామీణులు వర్షాలతో కొంతమేరకు ఇబ్బందు పడ్డారు. ఇదిలాఉండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు వరిసాగుకు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయశాఖాధికారులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌కు సాగునీరు విడుదల చేయటంతోపాటుగా రెండు రోజులుగా వర్షాలు ఎకధాటిగా పడుతుండటంతో భూమి సుమారు అడుగున్నర లోతువరకు తడిసిపోయిందని ఈ తరుణంలో వేసిన మొక్కలు ఎంతో ఆరోగ్యంగా ఎదుగుతాయని చెబుతున్నారు. కొల్లూరు, వేమూరు, భట్టిప్రోలు ప్రాంతాలలో వెద పద్ధతిని వేసిన వరి పంటకు ఈవర్షాలు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద సామాన్య ప్రజలు, వాహనచోదకులు, బాటసారులు, స్లమ్‌ఏరియా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈవర్షాలు రైతులకు మాత్రం మేలుచేస్తున్నాయి.