గుంటూరు

విధి నిర్వహణలో అలసత్వం కూడదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), జూలై 17: విధి నిర్వహణలో పోలీసులు అలక్ష్యాన్ని వీడి బాధ్యతతో విధులు నిర్వహించాలని అర్బన్ ఎస్‌పి సిహెచ్ విజయారావు పేర్కొన్నారు. సోమవారం స్థానిక పోలీసు కళ్యాణ మండపంలో ఆర్మ్‌డ్ రిజర్వ్, క్విక్ రియాక్షన్ టీంలకు నిర్వహించిన దర్బార్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయారావు మాట్లాడుతూ సిబ్బంది కష్టపడి పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి, వారి మన్ననలు పొందినప్పుడే శాఖ గౌరవం ఇనుమడిస్తుందన్నారు. ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది అంకితభావంతో పనిచేసినప్పుడు ఇది సాధ్యపడుతుందన్నారు. కష్టపడి పనిచేసిన వారికి రివార్డులు కూడా అందజేస్తామన్నారు. పోలీసు క్వార్టర్స్‌కు మరమ్మతులు చేయించి సౌకర్యవంతంగా తీర్చిదిద్దుతామన్నారు. అలాగే సిబ్బందికి డిపిఒలో విశ్రాంతి గదులను ఏర్పాటు చేసేందుకు సత్వర చర్యలు గైకొంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్‌పి సుబ్బారాయుడు, ఎఆర్, సౌత్, వెస్ట్, ఈస్ట్ డిఎస్‌పిలు తదితరులు పాల్గొన్నారు.