కడప

దొంగతనాల నివారణకు యాప్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,జూలై 17: దొంగతనాలు నివారించేందుకు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్‌తో యాప్‌పై శిక్షణ ఇచ్చి ప్రజల్లో, పోలీసు యంత్రాంగంలో సాంకేతిక పరిజ్ఞానం పెంచుకునే విధంగా చర్యలు చేపడుతున్నట్లు జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పేర్కొన్నారు. ఆయన జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్‌హాల్‌లో లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ మొబైల్ యాప్‌తో శిక్షణ ఇచ్చి దొంగతనాలు నివారించేందుకు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని సాంకేతిక పరిజ్ఞానాన్ని సిబ్బందికి తెలియజేశారు. తాళాలు వేసిన ఇళ్లల్లో చోరీలు జరగకుండా యాప్‌తో సాంకేతిక అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.
పోలీసులకు వైద్యపరీక్షలు
పోలీసుసంక్షేమ ఆసుపత్రిలో సిబ్బందికి కిడ్నీ, లివర్, ఇసిజి, దంతాలకు సంబంధించిన వైద్యపరీక్షలు సోమవారం జిల్లా ఎస్పీ బాబూజీ ఆదేశాలతో వైద్యపరీక్షలు చేశారు. కిడ్నీ, లివిర్, రక్తపోటు, ఇసిజి వైద్యపరీక్షలు ఆసుపత్రుల్లో చేపట్టారు. ఏఆర్ డిఎస్పీ మురళీధర్ ఆసుపత్రిలో ఏర్పాట్లుచేసి సోమవారం సిబ్బందికి వైద్యపరీక్షలు నిర్వహించి మిగిలిన వారికి మంగళవారం వైద్యపరీక్షలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.