కడప

ఒంటిమిట్టలో భూకబ్జా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంటిమిట్ట, జూలై 17: ఒంటిమిట్టలో విలువైన భూమిని కబ్జాచేసేందుకు చదును చేశారని స్థానికులు బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోసారి భూ బకాసురులు విలువైన భూమిని చేజిక్కుంచుకునేందుకు పంజా విసరబోతున్నారనేది బహిరంగ రహస్యం. వివరాలిలావున్నాయి. ఒంటిమిట్ట చెరువుకట్ట మలుపువద్ద ఉన్న స్థలాన్ని జేసీబీలతో చదునుచేశారు. అయితే ఈ స్థలంలో రాజకీయ నాయకుల అండదండలతో దేవాలయాన్ని నిర్మించాలనే యోచనలో కొంతమంది ఉన్నారనే మాటలు తెరపైకి వచ్చాయి. రామాలయాన్ని ప్రభుత్వం గుర్తించిన తర్వాత చెరువు మలుపువద్ద ఉన్న ఖాళీస్థలాన్ని కొందరు మట్టితో చదునుచేశారు. అప్పట్లోనే సాయిబాబా ఆలయమని లేదా శ్రీ కృష్ణమందిరం నిర్మించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం జరిగి ఏడాది కావస్తున్నా ఆలయ నిర్మాణంలో పురోగతి లేదు. ఇలాంటి సమయంలో ఎవరైనా ఈ విలువైన భూమిని కబ్జాచేసేందుకు చదును చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సుమారు ఎకరాకుపైగా ఉన్న స్థలాన్ని చదును చేశారు. దీంతో కోట్ల విలువచేసే ఈ స్థలంపై భూ బకాసురుల కన్నుపడిందా అని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికే సుమారు 500 ఎకరాలకు పైగా విలువైన భూములు రాజకీయ అండదండలతో కొంతమంది రెవెన్యూ అధికారులపై ఒత్తిడులుతెచ్చి స్వంతం చేసుకున్న విషయం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. అప్పట్లో వేసిన సుబ్బరాజు కమిటీ ఒక రోజులోనే విచారణను అటకెక్కించారు. 5వ విడత భూ పంపిణీలో సుమారు 300 మందికి పైగా అర్హులైన వారికి ఇవ్వాలని కమిటీ వేశారు. కాని కొంతమంది నాయకులు ఆ పేర్లను తొలగించి బినామీ పేర్లను ఆన్‌లైన్ చేసుకోవడంతో భూ కుంభకోణ వ్యవహరం బట్టబయలైంది. ఈ వ్యవహరాన్ని ఆ రోజుల్లోనే ఆంధ్రభూమి వెలుగులోకి తెచ్చిన విషయం విదితమే. ఇలాంటి తరుణంలో చెరువుమలుపు స్థలాన్ని చూస్తే ఎవరికైనా దీనిపై భూ కుంభకోణానికి సిద్ధం అయిందా అనిపిస్తుంది. ఈ స్థలం ఆలయానికి సమీపంలోను, ఒకపక్క చెరువు, మరోపక్క ఈ స్థలం ఉండడంతో భవిష్యత్‌లో మంచి విలువవచ్చే అవకాశం ఉంది. వీటిని ఆసరా చేసుకున్న ప్రబుద్ధులు ఈ స్థలం కబ్జాచేసే యత్నాలు సాగిస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. స్థలం చదును విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పట్టించుకోకపోవడం వెనుక అంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు. కలెక్టర్ ఈ వ్యవహరంపై స్పందించి తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంపై సోమవారం తహశీల్దార్ శ్రీనివాసులరెడ్డిని ఆంధ్రభూమి సంప్రదించి ఒంటిమిట్ట చెరువు మలుపు వద్ద చదును చేసిన ప్రభుత్వభూమి భూకబ్జా గురవుతుందనే విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తెచ్చింది. ఇందుకు స్పందించిన శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ గతంలో ఒంటిమిట్టలో చోటుచేసుకున్న భూకబ్జా వ్యవహరం గతమని, ప్రస్తుతం ఈ భూమిని ఎవరు కబ్జాచేయలేదని, వస్తున్న ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. అయితే ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి చొరవతో ప్రవేటు వ్యక్తులు ఆలయానికి కావాలని వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఉచితంగా భూమి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు. అయితే ప్రభుత్వ తరపున కొనుగోలు చేస్తే ఇవ్వడం జరుగుతుందని, అది అంత సులభం కాదన్నారు.