కరీంనగర్

హరితహారానికి రూ.25లక్షల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూలై 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమ నిర్వహణకు వెలిచాల సరళాదేవి ధార్మిక స్వచ్చంద సంస్థ పేరిట రూ.25లక్షల విరాళాన్ని సిఎం కెసిఆర్‌కు పంపించడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే, పుష్పాంజలి రీసార్ట్స్ అధినేత వెలిచాల జగపతిరావు తెలిపారు. సోమవారం పుష్పాంజలి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మరో 25లక్షల విలువచేసే 50వేల మొక్కలను చొప్పదండి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నాటనున్నట్లు తెలిపారు. చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని చొప్పదండి, రామడుగు, గంగాధర, బోయినపల్లి, మల్యాల, కొడిమ్యాల మండలాల్లోని గ్రామాల్లో మొక్కలు నాటుతామని వివరించారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని అన్నారు. మానవ మనుగడ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో విడత హరితహారం కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములై విజయవంతం చేయాలని జగపతిరావు కోరారు.
నేడు మంత్రి హరీశ్‌రావు రాక
కోహెడ, జూలై 17: మండలంలోని గుండారెడ్డిపల్లిలో మూడున్నర కోట్ల వ్యయంతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ నిర్వహించేందుకు గాను భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు రానున్నారని ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ తెలిపారు. మూడు కోట్ల రూపాయల వ్యయంతో చెక్ డ్యాం నిర్మాణం, పది లక్షల వ్యయంతో స్వశక్తి భవనం, 28 లక్షల వ్యయంతో కుంట మరమ్మత్తు పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారని ఆయన పేర్కొన్నారు.