మెదక్

ఇక రైతే సూపర్ పవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 17: పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు త్రీ ఫేస్ కరెంటు సరఫరా చేయడంతో నిద్రాహారాలు మాని పొలాలకు పరుగెత్తి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి 24 గంటల పాటు వ్యవసాయానికి కరెంటు సరఫరా చేయడం ప్రారంభించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. అధికారంలోకి వస్తే మెరుగైన విద్యుత్ సరఫరా చేసి రైతన్నకు ప్రభుత్వం దన్నుగా నిలుస్తుందని చెప్పిన సిఎం కెసిఆర్ హామి సోమవారంతో నెరవేరింది. 24 గంటల విద్యుత్ సరఫరాను దృష్టిలో పెట్టుకున్న ట్రాన్స్‌కో అండ్ డిస్కాంలు ఉమ్మడి మెదక్ జిల్లాలో రెండేళ్ల కాలంలో సుమారు 250 కోట్లు ఖర్చు చేసి వివిధ సౌకర్యాలను మెరుగుపర్చింది. అవసరాలకు సరిపడే విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతో దశాబ్దాల కాలంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిరంతరాయంగా కొనసాగిన సరఫరా కాస్త 12 గంటలు, అనంతరం తొమ్మిది గంటలు, ఆ తరువాత 6 గంటలు సరఫరా చేస్తే అది పగలు మూడు గంటలు, రాత్రి మూడు గంటలు సరఫరా చేసిన సందర్భాలున్నాయి. రాత్రి సరఫరా చేసినప్పుడు పొలాలకు వెళ్లిన రైతులు చీకట్లలో విద్యుత్ తీగలు తగలుకుని మృత్యువాత పడటంతో అనేక కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి నేటికి బిక్కుబిక్కుమంటున్నాయి. విద్యుత్ సరఫరా సక్రమంగా లేక సాగు చేసిన పంటలు కళ్లముందే ఎండిపోయి చేసిన అప్పులను తీర్చలేక అనేక మంది రైతులు ఉరికొయ్యలకు తణువులు చాలించిన సంఘటనలు కోకొల్లలుగానే ఉన్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరాను ప్రారంభించిన రోజునే ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడం ప్రారంభించాయి. దీంతో రైతులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ఏ మాత్రం అక్కరకు రావడం లేదు. భవిషత్తులో ఇది మంచి శుభ పరిణామం అని రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో అధికార టిఆర్‌ఎస్ నాయకుల నేతృత్వంలో విద్యుత్ సబ్ స్టేషన్ల వద్ద రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావుల చిత్ర పటాలకు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్‌కో విభాగం 125 కోట్లు, డిస్కాం విభాగం 125 కోట్లు వెచ్చించి ఉమ్మడి జిల్లాలో 100 కొత్త ట్రాన్స్ ఫార్మర్లను ఏర్పాటు చేయగా మరో వంద ట్రాన్స్‌ఫార్మర్ల స్థాయిని పెంచారు. 280 కిలోమీటర్ల మేరకు 33 కెవి విద్యుత్ లైన్లను నిర్మింపజేసారు. జిల్లాలో మొత్తం 132/33 విద్యుత్ సబ్ స్టేషన్లు 15 ఉండగా 350 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభానికి ముందు రోజుకు 9 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తే 7 మిలియన్ యూనిట్ల కరెంటు సరఫరా అయ్యేది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 3.10 లక్షల వ్యవసాయ బావులు, పంప్ సెట్లు ఉన్నట్లు ట్రాన్స్‌కో రూరల్ జోన్ సిజిఎం సదాశివరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధితో చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరా వల్ల ట్రాన్స్‌కో అదనంగా ఎంత విద్యుత్‌ను సరఫరా చేయాల్సి వస్తుందో అధికారులు ఇంకా నిర్ధారణకు రాలేకపోతున్నారు. వర్షాకాలం పూర్తిగా నిలిచిపోతేకానీ 24 గంటల విద్యుత్ సరఫరాపై ఒక నిర్ధిష్టమైన అంచనా వేయలేమని అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాగా గతంలో రాత్రి సమయంలో విద్యుత్ సరఫరాను చేసినా చాలా మంది రైతులు పొలాలకు వెళ్లలేదని, పగటి కరెంటును మాత్రమే ఉపయోగించుకున్నారని సదాశివపేట మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన రైతు దశరత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం పగటి పూట ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 12 గంటలు సరఫరా చేస్తే అదే గొప్ప అవుతుందన్నారు. ప్రభుత్వం ఇస్తామంటే ఎవరు వద్దనరని, కానీ పగటి కరెంటు మాత్రమే సరిపోతుందని ఆయన వివరించారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయంపైనే తమ కుటుంబాలు ఆధారపడి జీవనం సాగిస్తున్నాయని రెండు దశాబ్దాలుగా కరెంటు కష్టాలు పెరిగాయన్నారు. పగటి పూట నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తే చిన్నాభిన్నమైన వ్యవసాయం మళ్లీ గాడిన పడుతుందని సంతోషం వ్యక్తం చేసారు. దశరత్‌రెడ్డి చెప్పినట్లు 12 గంటలు మాత్రమే రైతులు వ్యవసాయానికి విద్యుత్‌ను ఉపయోగిస్తే ట్రాన్స్‌కోపై పెద్ద భారం ఉండకపోవచ్చన్న అంచనాకు రావచ్చు.