శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

ప్రభుత్య వైద్యులకు మెమోల జారీ:డిఎంహెచ్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదలకూరు, జూలై 17: పట్టణంలోని క్లస్టర్ వైద్యశాలలో పనిచేస్తున్న నలుగురు వైద్యులతో సహా ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేయనున్నట్లు డిఎంహెచ్‌ఓ వరసుందరం తెలిపారు. సోమవారం ఉదయం ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు రావాల్సిన డాక్టర్లు పది గంటలైనా రాకపోవడంతో వారిపై ఆగ్రహించారు. దీంతో నలుగురు డాక్టర్లకు, ముగ్గురు సిబ్బందికి మెమోలు జారీ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతసాగరంలో..
అనంతసాగరం: అనంతసాగరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిఎంహెచ్‌ఓ వరసుందరం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదన్నారు. అటువంటి వారిపై తగు చర్యలు తీసుకుంటామన్నారు. అంతేగాకుండా అపరిష్కృతంగా ఉన్న రికార్డుల్ని పరిశీలించి డాక్టర్లకు పలు సూచనలు తెలిపారు.