శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నీరు-ప్రగతి ఫలితాలను ప్రజలకు అందించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, జూలై 17: జిల్లా కలెక్టర్లు, అధికారులు నీరు -ప్రగతిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వాటి ఫలితాలను ప్రజలకు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి విజయవాడ నుంచి జిల్లా కలెక్టర్లతో, వివిధ శాఖాధికారులతో సోమవారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు మాట్లాడుతూ గ్రౌండ్‌వాటర్ టేబుల్ పెంచడం ద్వారా కరవు పరిస్థితులను అధిగమించవచ్చన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద పంటకుంటలు, రోడ్ల నిర్మాణాల గురించి అడిగి తెలుసుకున్నారు. గత సంవత్సరం నీటి నిర్వహణ సంతృప్తికరంగానే అధికారులు నిర్వహించారన్నారు. సమస్యలు వచ్చిన తరువాత తీసుకోవడం కంటే సమస్యలు రాకుండా ముందస్తు కార్యక్రమాలు చేపట్టినట్లైతే ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. వీడియోకాన్ఫరెన్స్‌లో నెల్లూరు జిల్లా నుంచి కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ -2 వెంకటసుబ్బారెడ్డి, డ్వామా పీడి హరిత, సిపిఓ మూర్తి, వ్యవసాయశాఖ జేడి హేమమహేశ్వరరావు, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.