డైలీ సీరియల్

ట్విన్ టవర్స్- 57

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐ కెన్ రియల్లీ అప్రీసియేట్ యువర్ కంపెనీ టుడే అన్నాను. ప్రతి పదాన్ని నొక్కిచెప్తూ!
ఒక్క క్షణం నా మొహంలోకి చూచింది. ఏమనుకుందో ఏమో.
‘ఓకె’ అంది సింపుల్‌గా.
నా గౌను, కోటు, కేప్ అన్నీ కారులో వెనక్కి పడేశాను. ఫుల్ హాండ్స్ షర్ట్ చేతిపైదాకా ముడుచుకుంటూ నడవడానికి బయలుదేరాం.
అది సమ్మర్ మొదలు అవడంతో చాలా హాయిగా ఉంది. వేడి, చలి రెండూ లేకుండా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కాంపస్ అంతా విద్యార్థులతో, వారి కుటుంబాలతో ఎంతో కోలాహలంగా ఉంది. చెట్లన్నీ పచ్చబడ్డాయి. పైన సూర్యుడు, కాని వెచ్చదనం లేదు.
ప్రతి విద్యార్థికి అదో ప్రత్యేకమైన మైలురాయి. జీవితంలో ఒక పైమెట్టు. కొనే్నళ్ళ శ్రమకు ఒక ముగింపు.
ఇక్కడ చాలామంది వెంటనే ఉద్యోగాలను ప్రయత్నిస్తారు. వెంటనే పైచదువులు మొదలుపెడతారు.
నూటికి 90 శాతం స్టూడెంట్స్ అప్పు చేసే చదువుతారు. వాళ్ళు కాలేజీ నుంచి బయటకువస్తూనే కావలసినంత బాధ్యతలు వాళ్ళ నెత్తిమీద.
తేజని ఉండమని అడిగాను కానీ, వౌనంగా పక్కనే నడుస్తున్నాను. కొంచెం దూరం నడిచేటప్పటికి విసుగ్గా అనిపించిందేమో! తనే అడిగింది. వాట్స్ బాదరింగ్ యు టుడే? అంది.
ఏం లేదని తల ఊగించాను.
‘‘ఇవాళ కంపెనీ కావాలనిపించింది. ఒంటరిగా ఉండబుద్ధి కాలేదు. అలా అని మాట్లాడేందుకు ఏమీ లేదు’’ అన్నాను.
‘‘ఒంటరిగా ఏం? అక్కడ మీ అందరినీ ఆనందింపజేస్తూ అంత పెద్ద రిసెప్షన్ జరుగుతుంటే’’ అంది. అలాంటి చోట కంపెనీకి ఏం తక్కువ?
మాట్లాడకుండా ఉండిపోయాను.
‘‘డా.రఘురాం ఉపన్యాసం చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంది. చాలా బావుంది కదూ! వెరీ ఇంప్రెసివ్ మాన్!’’ అంది మాట కలుపుతూ.
తల ఊగించాను.
‘‘యంగెస్ట్ పిహెచ్‌డిట. ప్రపంచ వ్యాప్తంగా తెలిసినవాడు. సమ్‌థింగ్ టు బి ప్రౌడ్ ఆఫ్! ఇండియా నుండి వచ్చాడు. అందులో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చాడు’’ అంది.
తల ఊగించాను.
‘‘నా చిన్నప్పుడు మాన్ ఆఫ్ ది ఇయర్‌గా టైమ్ మాగజైన్ వేసింది. మా డాడ్ ఆ కాపీని ఇప్పటికీ దాచి ఉంచారు. మన తెలుగువాడు’’ అంటూ.
చాలా ప్రౌడ్‌గా చెప్పేవారు మా అందరికీ.
తల మళ్లీ ఊగించాను. నేనూ చూచాను ఆ మాగజైన్. మరికొన్ని నిమిషాలు వౌనంగా నడచిపోయాయి. ఐయమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టాపిక్స్. ఐ విల్ సీ యు సమ్ అదర్ టైమ్ అని వెళ్లడానికి ఉద్యుక్తురాలయింది.
చటుక్కున తేజ చేయి పట్టుకున్నాను. ‘‘డోంట్ గో!’’ అన్నాను. చప్పున ఆశ్చర్యంగా చూచింది. ఎదురుగా కాఫీ షాప్ కనిపించింది. అందులోకి దారితీశాను. ఇద్దరికీ చెరో కాఫీ తీసుకుని, మూల ఉన్న టేబుల్ దగ్గరికి దారితీశాను.
తేజ ఎదురుగా కూర్చుని వేడి కాఫీ సిప్ చేయడం మొదలుపెట్టింది. ఆ పూట ఎందుకో నా మనసు చిత్రంగా స్పందించింది. ఎవరితోనైనా మాట్లాడాలనిపించింది. కానీ, మళ్లీ ఏం మాట్లాడాలో కూడా తోచలేదు. కానీ మాట్లాడాలి.
ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా గడపాలనుకున్న రోజు ఎందుకో బరువుగా అనిపించింది. పాపం తేజ చాలా ఓర్పుగా ఎదురుగా కూర్చుని ఉంది.
పోయిన ఏడాదిలో మా ఇద్దరి మధ్య స్నేహం బాగా కుదిరింది. ఒకరి కంపెనీ ఒకరు ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాం. చిన్న చిన్న విషయాలు, స్కూల్‌లో ఎదురయ్యే ఇబ్బందులు, ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంటాం.
నేను ఆహ్వానించగానే, 50 మైళ్ళు డ్రైవ్ చేసుకుని వచ్చింది. ఉండమనగానే ఆగిపోయింది. అయినా మనసులో మాట బయటికి అనడానికి కొంచెం సంకోచమే అనిపించింది. కప్‌లో స్పూన్ గిరగిరా తిప్పుతూ..
డా.రఘురామ్ హాపెన్డ్ టు బి మై ఫాదర్! అన్నాను, తేజ వంక చూడకుండానే. తేజ మొహంలో ఎలాంటి భావాలు మెదిలాయో చూడాలని అనిపించింది. కానీ ఆమె నా కళ్ళల్లో భావాలు చూడటం, నాకు ఇష్టంలేదు.
‘‘అతనికి ఆ విషయం తెలియదు కూడా’’ అన్నాను మళ్లీ.
‘‘అదెలా సంభవం?’’ అంది ఇంగ్లీష్‌లోనే!
‘‘మేమెప్పుడూ కలవలేదు. ఇవాళ ఫస్ట్‌టైమ్’’ అన్నాను. ఫస్ట్‌టైమ్ అన్నది నొక్కి చెప్తూ.
తేజకి ఏమనాలో తెలిసినట్లు లేదు. అందుకే తను వౌనం వహించింది.
‘‘అమ్మతో పెళ్లి అవంగానే అతను అమెరికా వచ్చేశాడు. మళ్లీ ఎప్పుడూ తిరిగి మా జీవితాలలోకి రాలేదు’’ అన్నాను.
‘‘యు హావ్ నో కాంటాక్ట్స్’’ అంది ఆశ్చర్యంగా.
‘‘లేదన్నట్లు భుజం కదిలించాను. ఇంతమటుకు ఎప్పుడూ కలవలేదు. నాకు ఇవాళ ఎంతో ముఖ్యమయిన రోజు స్పాయిల్ అయింది ఈ సంఘటనతో’’ అన్నాడు చాలా బిట్టర్‌గా!
తను నా చెయ్యిమీద చెయ్యి వేసి మృదువుగా నొక్కింది.
‘‘అలా ఎందుకు అనుకోవడం. ఇవాళ నువ్వు కొత్త విషయం నేర్చుకున్నావు’’ అంది.
‘‘ఏమిటి?’’’ అన్నాను ఆశ్చర్యంగా.
‘‘అతను ఎలా ఉంటాడో, అతన్ని చూస్తే నీలో ఎలాంటి రియాక్షన్ వస్తుందో, నీకున్న ఫీలింగ్స్ అన్నీను. మనం చాలా సందర్భాలు ఊహిస్తాము. కానీ, వాస్తవంలో ఎదురుపడితే కాని, మన ఊహ, వాస్తవానికి ఎంత దూరంగా ఉంటుందో తెలుస్తుంది’’.
తల అడ్డంగా ఊగించాను. ‘‘అతనికి నా ఉనికి తెలియదనుకుంటే చాలా బాధాకరమైన విషయం’’ అన్నాను.
‘‘నీ ఆత్మీయులు నిన్ను నిర్లక్ష్యం చేసి వెళ్లిపోతే బాధపడాలి. నువ్వెవరో తెలియనివారికి, నీతో ఎటువంటి సంబంధమూ లేని వాళ్ళ మూలంగా బాధ ఎందుకు కలగాలి?’’ అంది తేజ!
‘‘అమ్మా అచ్చంగా నువ్వన్నట్లుగానే!’’ అన్నాడు వౌళి నా వంక చూస్తూ.
మళ్ళీ మళ్లీ మొదలుపెట్టాడు.
తేజ వంక ఆశ్చర్యంగా చూచాను నమ్మలేనట్లు. మళ్లీ తేజ అంది ‘‘నీ జీవితంలో అతను ఒక అపరచితుడు.. అపరిచితులు సంతోషాన్ని చెడగొట్టలేరు’’ అంది.
-ఇంకాఉంది

- రమాదేవి చెరుకూరి