మంచి మాట

విద్య - విజ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

...... విద్వాన్ సర్వత్ర పూజ్యతే! - మూర్ఖుడు ఇంటిలో మాత్రమే గౌరవింపబడతాడు. ప్రభువు తన గ్రామంలో మాత్రమే గౌరవింపబడతాడు. రాజు తన దేశంలో మాత్రమే గౌరవింపబడతాడు. కాని పండితుడు అయినవాడు ఏ దేశంలోనైనా గుర్తింపును పొందగలుగుతాడు. గౌరవింపబడతాడు. అట్లాంటి పండితుడుగా గౌరవం దక్కాలి లేదా పొందాలి అంటే ముందు విద్యగడించాలి. విద్యఅనేది గురువుద్వారా లభిస్తుంది. లౌకిక జగత్తులో ఉపకరించే విద్యలన్నీ శాశ్వతసుఖాలనివ్వలేవు. పరమపదం గురించి పరమాత్మ గురించి చెప్పే విద్యలే ఆధ్యాత్మిక విద్యలనీ ఆత్మజ్ఞానబోధలని అంటారు. ఈ ఆత్మజ్ఞానాన్ని అవగాహన చేసుకొంటే పరమాత్మకు జీవాత్మకు తేడా ఉండదు.
ఓసారి శిరిడీ సాయబాబా దగ్గరకు ఒకతను వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం కావాలి మీకు నాకు బోధించండి అని అడిగాడు. బాబా చిరునవ్వు నవ్వాడు. వచ్చినతను కాసేపు నిరీక్షించాడు. అంతలో బాబా ఓ ఐదు రూపాయాలు కావాలని అక్కడున్నవారిని ఇక్కడకు అక్కడకు పంపుతున్నాడు. దాని నంతా చూస్తున్న ఈ బ్రహ్మజ్ఞాన జిజ్ఞాసకుడు బాబా నాకు బ్రహ్మజ్ఞానం బోధిస్తే నేను వెళ్లిపోతా కదా. మీరు మీ పనులు ఎంత సేపైనా చేసుకోవచ్చు కదా అన్నాడట. అపుడు బ్రహ్మ జ్ఞానమంటే బోధిస్తే బోధపడేది కాదు నాయనా నీజేబులో ఐదురూపాయల నోట్లు ఐదింతలు పెట్టుకుని ఒక ఐదురూపాయలు ఇవ్వలేక పోయావు. నీకు బ్రహ్మజ్ఞానం కావాలా అని అడిగాడు. బ్రహ్మ జ్ఞానులకు మట్టి అయనా బంగారం అయనా ఒకటిగానే కనబడుతుంది. వారు పామరులను పండితులను ఒకటేలాగా చూస్తారు. అందరిలోవారికి పరమాత్మ స్వరూపమే కనిపిస్తుంది.
మాకు జ్ఞానముంది అని ఎవరైనా అంటే అది వారి మూర్ఖత్వానికి పరాకాష్ఠ. అన్ని తెలిసినవారు వౌనంగా ఉంటారు. ఎవరినీ ఎద్దేవా చేయరు. ఎవరినీ అవమానించరు. అన్ని ఉన్న విస్తరాకు ఎగరదు. ఏమీ లేని విస్తరాకు ఎగిరి ఎగిరి పడుతుంది అంటే ఇదే.
ఇట్లాంటివారు సర్వత్రా ఉంటుంటారు. రాముని కాలంలోనూ జాబాలి అన్న మహర్షిఉండేవాడు. తానే పండితుడినని అనుకొనేవాడు. తాతగారింటి నుంచి వచ్చి జరిగిన సంగతులు తెలుసుకుని రాముణ్ణి తిరిగి రాజుగా చేయాలని భరతుడు వనవాసానికి వెళ్లిన రాముని దగ్గరకు వెళ్లాడు. జరిగిన విషయం నాకు ఏమీ తెలీదు. ఒకవేళ నాకు తెలిసి ఉంటే ఈ రాజ్యభోగాలు నాకు ఏమీ అక్కర్లేదని చెప్పి ఉండేవాడిని. మన కైకేయ మాత తనకు చెప్పకుండానే ఇలాంటి వరాలను తండ్రి దగ్గర నుంచిపొందింది. కనుక నీవు తిరిగి వచ్చి అయోధ్యా పట్టణానికి రాజువు కమ్ము అని చె ప్పాడు. వంశపారంపర్యం గాను, లేక సర్వజనాభీష్ఠునిగాను నీవు మాత్రమే సింహాసనానికి అర్హుడవు. కనుక నీవే ఈ రాజ్యానికి అధికారివి. నేను ఏమాత్రం తగినవాడను కాను పలువిధాలుగా రాముడిని తిరిగి రమ్మని భరతుడు చెప్పాడు. అన్ని విన్న రాముడు భరతునికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పాడు. తాను వనవాసమే చేస్తానని, నీవు తండ్రి ఇచ్చిన మాట ప్రకారం నీవు రాజ్యాన్ని ఏలవలసిందిగా చెప్పాడు. భరతుడు ఎంతకీ రాముని మాట విననందువల్ల చనిపోయన తండ్రికి ఇచ్చిన మాట తప్పినందువల్ల నరకాది బాధలు కలుగుతాయ దానికి కారణం మనం అవుతాం అని చెప్పాడు. అపుడు అక్కడే ఉన్న జాబాలి మహర్షి రామా భరతుని కోరికను తీర్చకుండా ఉండడానికి నీవు ఏదేదో చెప్తున్నావు కాని ఈలోకంలో ఎవరికి వారు ఒంటరిగా వస్తారు. ఒంటరిగా వెళ్తారు. ఎవరు ఏమీ తీసుకొని రారు వెళ్లరు. కాని, వారితోపాటు మంచి చెడు వెళ్లాయ అనడం ఉత్తి బూటకం. చనిపోయనవారికి శ్రాద్ధకర్మలు చేయడం కాలయాపన పని, ప్రత్యక్షంగా కనిపించేది నిజం కాని పరోక్షంగా జరుగుతుందనుకొనేది అంతా అబద్ధం అంటాడు. దాన్ని రాముడు ఖండిస్తూ జాబాలి మహర్షి మీరు చెప్పేది అస్తవస్తంగా ఉంది. బంగారు ఆభరణాలను చూస్తున్నాం కదా అందులో రాగి కలసి ఉంటుంది కాని అది కనిపించదు కనుక రాగి అనేది లేదు అనిచెప్తామా అట్లానే ఈ దేహమే నిత్యమని ఆత్మ అసత్యమని అనడం ఏవిధంగా చూసినా అది తప్పే అని కచ్చితంగా ఖండించాడు. అట్లానేప్రతి ప్రాణిలోను ఉన్న పరమాత్మను చూడగలగాలి. పరమాత్మ తత్వాన్ని బోధపరుచుకోవాలి. అదే నిజమైన జ్ఞానం అవుతుందికాని, మరొకటి కానేరదు.
జంగం శ్రీనివాసులు