సబ్ ఫీచర్

నాన్న కూచి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అతియాశెట్టి నాన్న కూచి. తండ్రి సునీల్‌శెట్టి అడుగుజాడలనే అనుసరిస్తోంది. 2015లో సినిమా ఆరంగ్రేటం చేసిన అతియాశెట్టి ఇపుడు రెండవ సినిమా చేయబోతుంది. ఈసారి ఈమె ముబారఖాన్ సినిమాలో అమాయకమైన యువతి పాత్రలో నటించబోతోంది. రెండవ సినిమాలో ప్రత్యేకమైన పాత్ర దక్కినందుకు తెగ సంతోషపడుతుంది. ఈ సినిమాలో క్లోజ్‌షాట్ సన్నివేశాల్లో నటించే అవకాశం రావటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెబుతోంది. నటిగా తనను తాను నిరూపించుకోవటానికి ఈ సినిమా మంచి అవకాశం అని కూడా ఆమె అంటోంది.
అంతేకాదు సినిమాల విషయానికి వచ్చేసరికి తండ్రి సలహాలు తప్పనిసరిగా తీసుకుంటానని, ఎవరు తనను కలిసినా వారి గురించి తండ్రితో డిస్కస్ చేస్తానని చెబుతుంది. తన మనసులో తండ్రి బొమ్మే ఉంటుంది. ఆయనను కాదని ఏ పని చేయనని కూడా నిక్కచ్చగా చెబుతోంది. సోదరుడు ఆహాన్‌శెట్టి గురించి చెబుతూ, అతను కూడా ఇపుడిపుడే సినిమా రంగంలోకి అడుగుపెట్టబోతున్నా డు. అతనికి ఎలాంటి సలహాలైనా ఇస్తారా? అని అడిగితే.. మాది ఉమ్మడి కుటుంబం.
ఆ బంధాలు, అనుబంధాలు మామ ధ్య ఉన్నాయి. కాని సలహాలు మాత్రం ఇవ్వలేదు. తొలిసారి గా సినిమాల్లోకి వస్తున్నందున ఎలా నటిస్తాడోననే ఆందోళన మాత్రం ఉన్నది అని చెప్పుకొచ్చింది. అతియాశెట్టికి ఇండియాలోని పర్యాటక ప్రదేశాలు చూడటం అంటే ఎంతో మక్కువ. ఇప్పటికే ఎన్నో ప్రదేశాలు చుట్టేసింది. ఈసారి ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్‌మహల్ చూడాలని ముచ్చటపడుతుంది. అంతేకాదు జైపూర్, గోవా కూడా వెళ్లాలని ఆరాటపడుతోంది.