Others

చెక్స్‌తో సరికొత్త లుక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెక్స్ కేవలం గేమ్ బోర్డులో, ఫ్లోర్ టైల్స్, పికినిక్ బ్లాంకెట్స్ మీదే కాదు నేడు చిన్నా,పెద్దా అందరూ కూడా మక్కువగా దుస్తుల్లో ధరిస్తున్నారు. చీరల్లో చెక్స్ ఒదిగిపోతున్నాయి. సీజన్ మారినట్లు చెక్స్ ట్రెండ్ సృష్టిస్తోంది. బాలీవుడ్ భామలు అలియాభట్ నుంచి దీపికాపదుకునే వరకు కూడా చెక్స్ డిజైన్లను అమితంగా ఇష్టపడతున్నారు. ర్యాంప్స్ మీద హొయలు పోవటమే కాదు గల్లీల్లో కూడా చెక్స్ చెక్‌పెట్టకుండా ధరిస్తున్నారు. మిడ్‌లెన్త్ డ్రెస్స్‌లు, యువతుల టాప్స్, హ్యాండ్‌లూమ్స్ దుస్తులు, కంజీవరం చీరలపై మద్రాస్ చెక్స్ అందంగా మెరుస్తున్నాయి. అన్ని సీజన్లలో నప్పేవిధంగా సరికొత్త డిజైన్లలో మార్కెట్లోకి వస్తున్నాయి. పొడవు, పొట్టి, నలుపు, తెలుపు అనే రంగుల తేడా లేకుండా ఎవ్వరికైనా చెక్స్ అందాన్నిస్తాయని ఫ్యాషన్ డిజైనర్ వినయ్ భరద్వాజ అంటున్నారు. ప్రతిరోజూ క్యాజువల్‌గా ధరించే దుస్తుల్లోనే కాదు ప్రత్యేక ఫంక్షన్‌లలోనూ చెక్స్ డిజైన్లు ఆకట్టుకుంటున్నాయని బెంగుళూరుకు చెందిన డిజైనర్ జి. నర్మత చెబుతున్నారు. చెక్స్ డిజైన్ బాగుందని కాకుండా శరీరాకృతిని బట్టి ఎంచుకుంటే వీటి అందమే వేరు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లు నిలువు గీతలున్నవాటికి ప్రాధాన్యతనిస్తే బాగుంటారు. ఎత్తు తక్కువగా ఉన్నవాళ్లు ఈ వస్త్రశ్రేణిని ఎంచుకునేటపుడు ఎత్తుమడమల చెప్పులు వేసుకోవటం మర్చిపోవద్దు. పార్టీవేర్‌కు అనుగుణంగా ఈ చెక్స్ డిజైన్లు మార్కెట్లోకి వచ్చాయి. చెక్స్ డిజైన్ ఉన్న పొడవైన స్కర్ట్ ఫార్మల్‌వేర్‌గా ఉపయోగపడినా షార్ట్ స్కర్ట్ సాయం త్రం వేళలో ధరిస్తే ఆకట్టుకుంటారని డిజైనర్ అరుంధతి అంజనప్ప అంటున్నారు.
బ్రైట్ రెడ్ టార్టన్ షర్ట్ ధరిస్తే ఉదయం పూట అందంగా కనువిందు చేస్తారు. బూడిద రంగు చెక్స్ షర్ట్‌కి బ్లాక్ లేదా గ్రే కలర్ ఫ్యాంటు వేసుకుంటే ఆ అందమే వేరు. వీటిని ఎలాంటి వేడుకలోనైనా హాయిగా.. హుందాగా వేసేసుకోవచ్చు.