ఫోకస్

తక్కువా కాదు..ఎక్కువా కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాప్రతినిధులు, అధికారులు పాజిటివ్ ధృక్పధంతో ఆలోచించి, సమన్వయంతో పనిచేస్తే ఏ విధమైన సమస్య ఉండదు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఏ ఒక్కరూ తక్కువా కాదు ఎక్కువా కాదు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ప్రజాప్రతినిధులకు క్షేత్ర స్థాయిలో ఉండే సమస్యలపై అవగాహన ఉంటుంది. తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో ఉండే సమస్యలను యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లిన సందర్భాల్లో అధికారులు ఒకే కోణంలో ఆలోచించడంతోనే సమస్య ఎదురవుతోంది. ప్రజా పాలన ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాల్సిన పరిస్థితులుంటాయి. కొన్ని సన్నితమైన అంశాల విషయంలో తీసుకునే నిర్ణయాలు ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంటాయి. ప్రజా జీవితంలో ఉండేవారు ఈ అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే సందర్భంలో నిబంధనల బూచిని చూపి సమస్యల పరిష్కారంలో కాలయాపన చేయడం కూడా ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య వివాదాలకు కారణంగా చెప్పవచ్చు. ఇక తొలి సారిగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, కొత్తగా బాధ్యతల్లోకి వచ్చిన అధికారులకు అనుభవలేమి కూడా సమస్య తీవ్రతకు కారణమవుతోంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో పనిచేసి అనుభవనాన్ని కూడగట్టుకున్న అధికారులు పాజిటివ్ ధృక్పథంతో ఆలోచిస్తున్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ విధానాలు, నిబంధనలను ఆకళింపు చేసుకుని అటు ప్రజలకు, ఇటు యంత్రాంగానికి అనువుగా పనులు సాధించుకుంటున్నారు. ఇక అధికారులు కూడా నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేలా ప్రజా ప్రతి నిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగితే ఏ సమస్యా ఉండదు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ,తమ విధులను నిర్వర్తించాలి.

-పిజివిఆర్ నాయుడు (గణబాబు) ఎమ్మెల్యే, విశాఖ పశ్చిమ నియోజకవర్గం