ఫోకస్

లక్ష్మణరేఖ దాటరాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చట్టాన్ని అధికారులు, ప్రజా ప్రతినిధులతోపాటు ఏ పౌరుడు అతిక్రమించరాదు. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న వివిధ ఘటనలు చూస్తుంటే కొన్ని సందర్భాల్లో అధికారులు, మరికొన్ని సందర్భాల్లో ప్రజా ప్రతినిధులు లక్ష్మణరేఖను దాటుతున్నారు. బెంగళూరు జైల్లో తమిళనాడు అన్నా డిఎంకె నేత శశికళకు రాజభోగాలు సమకూరుస్తున్నట్ల వార్తలు వస్తున్నాయ. దీనికి ఆమె జైలు అధికారులకు ముడుపులు చెల్లించినట్లు అభియోగం. దీనిపై ఒక ఐపిఎస్ అధికారి తీవ్రంగా స్పందించారు. ఇదంతా తప్పని జైళ్ల శాఖ అదనపు డిజిపి ఖండించారు. ఫలితంగా ఒక మహిళా ఐపిఎస్ అధికారిపై బదిలీ వేటు పడింది. తెలంగాణలో ఒక ఎమ్మెల్యే కలెక్టర్ పట్ల ప్రవర్తించిన తీరు గర్హనీయం. ప్రజా ప్రతినిధులు తమ హద్దుల్లో ఉండాలి. అలాగే కొంతమంది ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధుల పట్ల చులకనగా వ్యవహరిస్తున్నట్లు కూడా అభియోగాలున్నాయి. ఇది కూడా తప్పే. ప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థ అత్యున్నతమైంది. ప్రజలు చట్టసభలకు ప్రతినిధులను ఎన్నుకుని పంపుతారు. వారికి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ నిబంధనలను అధికారులు పాటించాలి. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి తానా అంటే తందానా అనే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. కొన్నిసార్లు విపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, నేతలకు అధికారులు వాస్తవాలు వివరించకుండా అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. ఈ సందర్భంగా గొడవ జరుగుతుంటుంది. మహారాష్టక్రు చెందిన ఒక ఎంపీ విమానయాన సంస్థల సిబ్బంది పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. దీనిపై విమానయాన సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఆ తర్వాత క్షమాపణతో నిషేధం ఉత్తర్వులను ఉపసంహరించుకున్నాయి. ఈ తరహా ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోనూ చోటుచేసుకుంది. ఏపిలో ఒక ఎమ్మెల్యే మహిళా ఉద్యోగిని పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే కలిసి రవాణాశాఖ ఉన్నతాధికారుల పట్ల జులుం చేశారు. రాయలసీమలో ఒక ఎంపి సోదరుడు కూడా ఎప్పుడూ దుందుడుకుగా వ్యవహరిస్తూ పత్రికల్లో పతాక శీర్షికల్లో నిలుస్తున్నారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే విధంగా ఎవరూ వ్యవహరించినా తప్పే. వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

- కె శివకుమార్, ప్రధాన కార్యదర్శి, వైకాపా తెలంగాణ శాఖ