ఫోకస్

ఇద్దరూ జవాబుదారులే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతో గొప్పదైన భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులు ఇద్దరూ ప్రజలకు జవాబుదారీలే. ప్రజాప్రతినిధులు, చట్టాలను అమలు చేసే అధికారులు ఎవరికి వారు తమ పరిధిలో తమకున్న అధికారాల మేరకు ప్రజలకు సేవా చేయడం కోసమే ఉన్నారు. ప్రభుత్వం తరపున అధికారులు పనిచేస్తూ ప్రజాప్రతినిధులతో చేసుకుంటూ, కొన్ని సందర్భాల్లో ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. వౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు, శాంతిభద్రతల పర్యవేక్షణ.. ఇలా ప్రజల అవసరాలకు సంబంధించి ఏ పనులైనా ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి మెలసి పనిచేస్తే సత్ఫలితాలు త్వరగా లభించే అవకాశం ఉంటుంది. పోలీస్ శాఖ విషయానికొస్తే కొన్ని సున్నితమైన కేసులకు సంబంధించి ప్రజాప్రతినిధులు, పోలీస్ శాఖ కలిసి సమస్యను సద్దుమణిగేలా చేయవచ్చు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలన్నా, నష్టపరిహారం వంటివి ఇప్పించే విషయంలోనూ ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు కీలకంగా మారిన సందర్భాలు ఉన్నాయి. ప్రజల్లో భావోగ్వేదాలు చెలరేగిన సమయంలో పోలీస్ శాఖకు ప్రజాప్రతినిధులు, ఆయా వర్గాలకు ప్రాతినిధ్యం వహించే వారు సహకరించిన సందర్భాలు ఉన్నాయి, సహకరించాల్సిన అవసరం కూడా ఉంది. రోడ్డు ప్రమాదాల నివారణ విషయంలోనూ, నగరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలోనూ పోలీస్ శాఖకు ప్రజాప్రతినిధుల సహకారం ఎంతో అవసరం. గతంలో అధికారులకు ఏదో చేసి పెట్టండి అని చెప్పే ప్రజాప్రతినిధులు ఉండగా, ప్రస్తుతం ప్రజాప్రతినిధుల్లో ఎంతో అవగాహన కనిపిస్తోంది. సమస్యను, పరిష్కారాన్ని అధికారులకు మాత్రమే విడిచి పెట్టకుండా చొరవ చూపిస్తూ ప్రజాప్రతినిధులు కూడా అందులో భాగస్వాములవుతున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా ప్రజాప్రతినిధులుగా ఉన్నపుడు ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారుల పాత్ర పరిధిని గమనిస్తూ తమ వంతు సహకారం అందించాలి. అదే విధంగా అధికారులు సైతం ప్రజలు ఎన్నుకొన్న ప్రజాప్రతినిధులను గౌరవిస్తూ వారు సూచించిన సమస్యల పరిష్కారంలో నిబంధనలు, చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించుకుంటూ పోతే ఇద్దరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారనే భావన కల్పించిన వారవుతారు.

- టి.పాండురంగ విఠలేశ్వర్ ఓఎస్‌డి (క్రైమ్స్), నెల్లూరు జిల్లా