ఫోకస్

అవగాహనా లోపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలన వ్యవస్థలో నాయకులు, ప్రణాళికల అమలులో అధికారుల సమన్వయం కొరవడితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. అధికారులతో సత్సంబంధాలు సామాజిక అభివృద్ధిపై కొనసాగాలి. పైరవీలు, స్వార్థప్రయోజనాలకోసం నాయకులతో అధికారులు కుమ్మక్కైతే వివాదాలు తప్పవు. ఎవరైనా చట్టపరిధిలో పనిచేస్తే పాలన వ్యవస్థలో వివాదాలకు తావుండదు. సమన్వయంతో కలిసి పనిచేస్తే సమస్యలేవైనా సులువుగా పరిష్కారమవుతాయి. సజావుగా పాలన సాగుతుంది. సామాజిక బాధ్యత పెరుగుతుంది. అధికారుల సర్వీసు ఎలాంటి వివాదాలు, మనస్పర్థలు లేకుండా పూర్తవుతుంది. రాజకీయ నాయకుల వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడాలి. ప్రజల ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలి. అధికారులు, నాయకులు పరస్పర అవగాహనతో కలిసి పనిచేస్తే ఎలాంటి అభిప్రాయభేదాలు రావు. అక్కడక్కడ చట్టాలపై అవగాహన లోపాలవల్లే అతిచిన్న సమస్యలు పెద్దవిగా మారుతున్నాయి. రాజకీయ ప్రమేయంతో ఇరువర్గాల్లోనూ భేదాభిప్రాయాలు ఏర్పడి సమస్యల పరిష్కారం సుదీర్ఘంగా కొనసాగుతోంది. కాబట్టి అధికారుల వ్యవహారాల్లో రాజకీయ నాయకులు, నాయకుల వ్యవహారాల్లో అధికారులు తలదూర్చే ప్రయత్నాలు జరుగకూడదు. అలాంటి ఏ ప్రయత్నం జరిగినా పాలన వ్యవస్థ స్తంభించిపోతుంది. సమస్యలేవైనా.. పాలన ఎలాంటిదైనా.. చట్టపరిధిలో జరగాలి. అలాంటప్పుడే సమాజంలో శాంతిభద్రతలు అదుపులో ఉంటాయి. ప్రజల్లో అధికారులు, నాయకుల పట్ల గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఎవరైనా ప్రజల్లో మమేకమై పనిచేస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది.

- మహేశ్ ఎం భగవత్ పోలీస్ కమిషనర్, రాచకొండ